For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆదాయ పన్ను రిటర్న్ ఫైల్ చేస్తే ప్రయోజనాలేంటో తెలుసా?

By Jai
|

ఆదాయాన్ని ఆర్జిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి సంవత్సరం తమ ఆదాయ పన్ను రిటర్న్ లను సమర్పించాల్సి ఉంటుంది. పన్ను వర్తించడానికన్నా తక్కువ ఆదాయం ఉన్నప్పటికీ రిటర్న్ ను మాత్రం ఫైల్ చేయాలి. ఇందుకు సంబంధించి ఆదాయ పన్ను శాఖ వెబ్ సైట్ లో వివిధ ఫారాలు ఉంటాయి. అందులో మీరు ఏ కేటగిరీ కిందకు వస్తారో చూసుకొని ఆ ఫారాన్ని పూర్తి చేసి నిర్దేశిత గడువులోపు సమర్పించాల్సి ఉంటుంది.

చాలా మంది తమ ఐటీ రిటర్న్ (ఐటీఆర్) ను ఫైల్ చేయడంలో నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ దీనివల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుంటే తప్పకుండా రిటర్న్ ఫైల్ చేస్తారు. అవేమిటంటే...

బడ్జెట్ 2019: ఆదాయపన్నుపై రివిజన్ ఉండేనా? సామాన్యుల ప్రాధాన్యతలు ఇవే..బడ్జెట్ 2019: ఆదాయపన్నుపై రివిజన్ ఉండేనా? సామాన్యుల ప్రాధాన్యతలు ఇవే..

రుణాల మంజూరుకు

రుణాల మంజూరుకు

ఉదాహరణకు మీరు బ్యాంకు నుంచి వ్యక్తిగత లేదా గృహ, ఆటో తదితర రుణాలు పొందాలనుకున్నప్పుడు రెండుమూడేళ్ల మీ ఐటీ రిటర్న్ ను బ్యాంకులు అడుగుతాయి. దీని ఆధారంగానే మీ ఆర్ధిక విశ్వసనీయత ఏంటో తెలుస్తుంది. మీ అర్హతతో పాటు ఎంత రుణాన్ని మంజూరు చేయవచ్చు అన్న అంశాలు కూడా ఐటీఆర్ పై ఆధారపడి ఉంటాయి. ఆదాయ పన్ను రిటర్న్ అనేది మీరు ఒక సంవత్సరంలో ఎంత ఆదాయాన్ని ఆర్జించారన్న దానిపై స్పష్టతను ఇస్తుంది. మీరు ఎంత పన్ను చెల్లించారో కూడా తెలుస్తుంది. మీరు రుణంకోసం దరఖాస్తు చేసినప్పుడు ఐటీఆర్ ను ఇవ్వడం వల్ల రుణ మంజూరు ప్రక్రియ మరింత సులభం అవుతుంది.

వీసా ప్రాసెసింగ్

వీసా ప్రాసెసింగ్

విదేశీ ప్రయాణాల సమయంలోనే వీసాను పొందడానికి ఐటీఆర్ ప్రూఫ్ గా ఉపయోగ పడుతుంది. యూకే, యూఎస్, కెనడా వంటి ఎంబసీలు టాక్స్ టాక్స్ రిటర్న్ ను కోరుకుంటాయి.

నష్టాల క్యారీ ఫార్వార్డుకు

నష్టాల క్యారీ ఫార్వార్డుకు

నిర్దేశిత గడువులోపు ఐటీఆర్ ను ఫైల్ చేసినప్పుడే వ్యాపార నష్టం, మూలధన నష్టం వంటి వాటిని క్యారీ ఫార్వార్డ్ చేయడానికి అవకాశం ఉంటుంది.

పన్ను రిఫండ్ క్లెయిమ్

పన్ను రిఫండ్ క్లెయిమ్

మీరు కొన్ని రకాల పెట్టుబడులు పెట్టినప్పుడు వచ్చే ఆదాయంపై మూలంలో పన్నును విధిస్తుంటారు. ఇలా జరిగినప్పుడు దాన్ని తిరిగి క్లెయిమ్ చేసుకోవడానికి ఐటీఆర్ తప్పనిసరి.

బీమా క్లెయిమ్ కు

బీమా క్లెయిమ్ కు

ప్రమాదం ద్వారా మృతి చెందినప్పుడు క్లెయిమ్ ను ప్రాసెస్ చేయడానికి ఆదాయ ద్రువీకరణకోసం బీమా కంపనీలు ఐటీఆర్ ను కోరవచ్చు. ఒకవేళ ఐటీఆర్ లేనట్టయితే క్లెయిమ్ మొత్తం తగ్గడానికి అవకాశం ఉండవచ్చు. ఇలాంటి కేసుల్లో కోర్టులు ఐటీఆర్ ను మాత్రమే అనుమతిస్తుంటాయి. ఐటీఆర్ ను ఫైల్ చేసినప్పుడే అధిక మొత్తానికిబీమా కవరేజీని పొందడానికి అవకాశం ఉంటుంది. బీమా కంపనీలు సంబంధిత వ్యక్తి ఆదాయాన్ని తెలుసుకోవడానికి ఐటీఆర్ దోహదపడుతుంది.

టెండర్లకు

టెండర్లకు

ప్రభుత్వం పిలిచే టెండర్లలో పాల్గొనాలంటే ఐటీఆర్ ఫైలింగ్ అవసరం. టెండర్లను పరిశీలించే కమిటీ ఐదారేళ్ళ ఐటీఆర్ ను పరిగణన లోకి తీసుకుంటుంది.

క్రెడిట్ కార్డుకు

క్రెడిట్ కార్డుకు

క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసినప్పుడు ఐటీఆర్ ను సమర్పించాల్సి ఉంటుంది. దీన్ని బట్టి కంపనీలు క్రెడిట్ పరిమితిని నిర్ణయిస్తుంటాయి. క్రెడిట్ పరిమితిని పెంచమని కోరినప్పుడు కూడా కొన్ని బ్యాంకులు ఐటీఆర్ ను సమర్పించమని కోరుతుంటాయి.

పన్ను చెల్లించే పరిధిలోకి రాక పోయినప్పటికీ ప్రతి సంవత్సరం కూడా తమ ఆదాయ పన్ను రిటర్న్ లను సమర్పించడం ద్వారా ప్రయోజనమే ఎక్కువగా పొందడానికి అవకాశం ఉంటుంది. చాలా ఆన్ లైన్ వెబ్ సైట్లు ఆదాయ పన్ను రిటర్న్ ను ఉచితంగానే ఫైల్ చేసే సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. బ్యాంకులు కూడా తమ కస్టమర్లకు చాలా తక్కువ ఫీజుతో ఈ సర్వీసును అందిస్తున్నాయి.

English summary

ఆదాయ పన్ను రిటర్న్ ఫైల్ చేస్తే ప్రయోజనాలేంటో తెలుసా? | Benefits with income tax return filing

Benefits with income tax return filing. The new income tax return forms, notified by the revenue department in April this year, require furnishing of additional information and details by taxpayers compared to the previous assessment year. The last date for filing income tax returns for assessment year 2019-20 is July 31.
Story first published: Thursday, June 20, 2019, 16:22 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X