For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జూలై 10న బడ్జెట్!: జగన్ హామీలపై కేటాయింపులు ఎలా?

|

అమరావతి: ఏపీలోని కొత్త ప్రభుత్వం పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్ పైన కసరత్తు ప్రారంభించింది. బడ్జెట్ ఎలా ఉండాలి, అంచనాలు ఎలా సిద్ధం చేయాలన్న అంశంపై అన్ని శాఖల కార్యదర్శులు, హెచ్ఓడీలకు మార్గదర్శకాలు ఎప్పుడో జారీ అయ్యాయి. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ కాలపరిమితి వచ్చే నెలాఖరును ముగియనున్న నేపథ్యంలో మిగిలిన ఎనిమిది నెలల కాలానికి అవసరమైన పూర్తిస్థాయి బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సి ఉంది. జగన్‌తోనూ ఆర్థిక శాఖ అధికారులు పలు దఫాలుగా సమావేశమయ్యారు. ఏపీ బడ్జెట్ సమావేశాలు 26న ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

అప్పులు.. వడ్డీలు.. ఇదీ ఏపీ ఆర్థిక పరిస్థితి: హోదాతో ఎలా లాభాలు!అప్పులు.. వడ్డీలు.. ఇదీ ఏపీ ఆర్థిక పరిస్థితి: హోదాతో ఎలా లాభాలు!

జగన్ హామీలపై నిధుల సమీకరణ!

జగన్ హామీలపై నిధుల సమీకరణ!

ఏయే రంగాలకు ఎన్ని నిధులు కేటాయించాలి? వైసీపీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు నిధుల సర్దుపాటు ఎలా? తదితర అంశాలపై చర్చించారు. హామీల అమలుకు నిధుల సమీకరణ అంశాన్ని పరిశీలిస్తున్నారు. హామీల అమలు కోసం ప్రత్యేకంగా నిధుల కేటాయింపు ఉండదని, శాఖలకు కేటాయించే నిధుల్లోనే వాటికి ఖర్చు చేయాల్సి ఉన్నందున బడ్జెట్ ప్రతిపాదనల సమయంలోనే స్పష్టంగా డిమాండ్లు రూపొందించాలని ఇప్పటికే ఆర్థిక శాఖ కోరింది. ప్రతిపాదనలు వాస్తవాలకు దగ్గరగా ఉండేలా చూడాలన్నారు. అలాగే, ఇదివరకు జరిగిన ప్రగతి ఆధారంగా నిధుల కేటాయింపు ఉండనుందని తెలుస్తోంది. ఈ రోజు (19వ తేదీ) నుంచి 24వ వరకు ప్రతిపాదనలు పంపాలని ఆర్థిక శాఖ కోరింది.

బడ్జెట్ రూ.2 లక్షల కోట్లు దాటుతుందా?

బడ్జెట్ రూ.2 లక్షల కోట్లు దాటుతుందా?

ఏపీ ప్రభుత్వం జూలై 10న బడ్జెట్ ప్రవేశ పెట్టనుందని తెలుస్తోంది. లేదంటే 11న ప్రవేశపెట్టే అవకాశముంది. ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రభుత్వం రూ.2.26 లక్షల కోట్లతో పూర్తిస్థాయి బడ్జెట్‌ను తయారు చేసి సభకు సమర్పించినా, నాలుగు నెలల కాలానికే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఆమోదం పొందింది. జూలై 31న ఇది ముగియనుంది. ప్రభుత్వం మారిన నేపత్యంలో ప్రాధాన్యాలు కూడా మారడంతో బడ్జెట్ స్వరూపం మారనుందని భావిస్తున్నారు. ప్రస్తుతం సమర్పించే బడ్జెట్ గత ప్రభుత్వం సమర్పించిన రూ.2.26 లక్షల కోట్ల బడ్జెట్ స్థాయికి చేరుతుందా అనేది అనుమానమే అంటున్నారు. రెవెన్యూ రాబడి, కొత్త ప్రభుత్వ ప్రాధాన్యాలను సమన్వయం చేసుకుంటూ బడ్జెట్ రూపకల్పన చేస్తున్నారు.

అన్నదాత సుఖీభవకు నో నిధులు

అన్నదాత సుఖీభవకు నో నిధులు

2019-20 ఓట్ ఆన్ అకౌంట్ సందర్భంగా కొత్తగా ప్రకటించిన కొన్ని పథకాలకు నిధులు కేటాయించే అవకాశం లేదని తెలుస్తోంది. అన్నదాత సుఖీభవను రద్దు చేసిన నేపథ్యంలో.. దానికి గత ప్రభుత్వం రూ.5,000 కోట్ల నిధులు చూపింది. ఇప్పుడు దానిని మినహాయిస్తారు. అదే సమయంలో రైతు భరోసాకు నిధులు కేటాయిస్తారు. పెన్షన్ల పెంపు, గ్రామ సచివాలయాల్లో వాలంటీర్ల నియామకానికి ఆయా శాఖలపరంగానే కేటాయింపులు జరపనున్నారని తెలుస్తోంది.

రెవెన్యూ లోటుపై ఆదేశాలు

రెవెన్యూ లోటుపై ఆదేశాలు

రెవెన్యూ లోటుపై సమగ్ర వాస్తవ లెక్కలు సిద్ధం చేయాలని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అధికారులకు సూచించారు. గతంలో రూ.12,700 కోట్లు రెవెన్యూ లోటుగా లెక్కించారు. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య భిన్నాభిప్రాయాలు వచ్చాయి. దీంతో రెవెన్యూ లోటుపై ఏకాభిప్రాయం లేకుండా పోయింది. దీంతో కచ్చితమైన లెక్కలు సిద్ధం చేసి వాటి ఆధారంగా రెవెన్యూ లోటును కేంద్రం నుంచి డిమాండ్ చేసి తెచ్చుకోవాలని వైసీపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

English summary

జూలై 10న బడ్జెట్!: జగన్ హామీలపై కేటాయింపులు ఎలా? | Andhra Pradesh budget may on July 10

The budget session of the Andhra Pradesh Legislative Assembly is likely to commence on June 26 and it is expected to be for 20 working days.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X