ముంబై: అడాగ్ (ADAG) గ్రూప్ అధినేత అనిల్ అంబానీ బిలియనీర్ క్లబ్ నుంచి కిందకుపడిపోయారు. 2008లో 42 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలోనే ఆరో స్థానంలో నిలిచిన ఆయన ఇప్పుడు స్థానాన్ని కోల్పోయారు. 11 ఏళ్లలో అంబానీ వ్యాపార సామ్రాజ్యం... అప్పుల సంక్షోభం, టెలికం సంస్థ ఆర్‌కాంతో పాటు ఇతర గ్రూప్ సంస్థల వరుస నష్టాల కారణంగా ఈక్విటీ విలువ రూ.3,651 కోట్లకు కుప్పకూలింది.

0.5 బిలియన్ డాలర్లకు పడిపోయిన అనిల్
ముఖ్యంగా మ్యుచువల్ ఫండ్ జాయింట్ వెంచర్ రిలయన్స్ నిప్పోన్ లైఫ్ అసెట్ మేనేజ్‌మెంట్‌లో రూ.42.88 శాతం వాటాలను విక్రయించడంతో బాగా దెబ్బతిన్నది. రుణాలు తీర్చేందుకు ఆస్తులను అమ్మేస్తోంది. ఆస్తులు అమ్మి రుణాలు తీరుస్తామని అనిల్ అంబానీ ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. గత పద్నాలుగు నెలల్లో రూ.35వేల కోట్లకు పైగా రుణాలు తీర్చినట్లు ఆయన ప్రకటించారు. ఆయన మొత్తం సంపద 42 బిలియన్ డాలర్ల (2008) నుంచి 0.5 బిలియన్ డాలర్లకు పడిపోయింది. రిలయన్స్ గ్రూప్ వ్యాల్యూ నాలుగు నెలల క్రితం రూ.8,000 కోట్లుగా ఉంది.

రుణభారం తగ్గించుకున్నారు
అదే సమయంలో మార్చి 2018లో రిలయన్స్ గ్రూప్ కంపెనీల మొత్తం అప్పులు రూ.1.7 లక్షల కోట్లుగా ఉంది. అయితే కొన్నాళ్లుగా ఆస్తులు అమ్ముతూ రుణభారం తగ్గించుకుంటున్నారు. గత పద్నాలుగు నెలల్లో అసలు రూ.24,800, వడ్డీ రూ.10,600 కలిపి మొత్తం రూ.35,000 కోట్ల అప్పులు చెల్లించారు.

2008 నుంచి ఇలా తగ్గుదల...
2008లో అనిల్ అంబానీ నెట్ వర్త్ 42 బిలియన్ డాలర్లు కాగా, 2011 నాటికి అది 8.8 బిలియన్ డాలర్లు పడిపోయింది. 2013 నుంచి అతని సంపద తరుగుతూ వస్తోంది. 2013లో 5.2 బిలియన్ డాలర్లు, 2016లో 2.5 బిలియన్ డాలర్లు పడిపోయింది. 2018 నాటికి అంబానీ నెట్ వర్త్ 2.7 బిలియన్ డాలర్లుగా ఉంది. బ్యాంక్రప్టసీ కారణంగా మరింత దెబ్బతిన్నారు. కొద్ది నెలల క్రితం 4.5 బిలియన్ డాలర్ల రుణాన్ని ముఖేష్ అంబానీ చెల్లించడంతో అనిల్ అంబానీ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి తప్పింది. ప్రస్తుతం అంబానీ నెట్ వర్త్ 0.5 బిలియన్ల డాలర్లకు పడిపోయిందని నివేదికలు వెల్లడిస్తున్నాయి.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications