For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

విదేశీ ప్రయాణానికి సిద్ధమయ్యారా... ఫారెక్స్ కార్డు మరవకండి?

By Jai
|

హాలిడేస్ ను ఎంజాయ్ చేయడానికేకాకుండా ఉద్యోగరీత్యా విదేశాలకు వెళుతున్న వారి సంఖ్య ఇటీవలి కాలంలో గణనీయంగా పెరుగుతోంది. విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడి కరెన్సీలోనే ఖర్చు చేయాలన్న విషయం తెలిసిందే. అందుకే కొంతమంది ఎయిర్ పోర్ట్ లో తాము ఎక్కడికైతే వెళుతున్నామో ఆదేశ కరెన్సీని తీసుకుంటారు. ఒకవేళ ఈ కరెన్సీ మొత్తం అయిపోతే పరిస్థితి ఏమిటీ? అందుకే వివిధ బ్యాంకులు ఫారెక్స్ కార్డులను అందిస్తున్నాయి. వీటిని తీసుకోవడం ద్వారా విదేశీ ప్రయాణాల్లో చెల్లింపులు చేసే సమయంలో ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదు. ఫారెక్స్ కార్డు అవసరం, ప్రయోజనాలు తదితరాలు మీ కోసం....

వివిధ బ్యాంకుల ఆర్టీజీఎస్ టైమింగ్స్, ఛార్జీలువివిధ బ్యాంకుల ఆర్టీజీఎస్ టైమింగ్స్, ఛార్జీలు

ప్రయోజనాలు

ప్రయోజనాలు

ఒక విధంగా చెప్పాలంటే ఫారెక్స్ కార్డు అనేది ప్రీపెయిడ్ కార్డు లాంటిదే. ఇందులో మీకు నచ్చిన విదేశీ కరెన్సీని లోడ్ చేసుకోవచ్చు. విదేశాల్లో షాపింగ్, ఎంట్రీ టికెట్లు, రైల్, బస్సు పాసులు, టాక్సీలు , రెస్టారెంట్ బిల్లులు లేదా ఇతర బిల్లుల చెల్లింపులు చేసే సమయంలో ఈ కార్డు ద్వారా చెల్లింపులు చేయవచ్చు. మీకు నగదు అవసరం అనుకుంటే ఎటిఎం నుంచి విత్ డ్రా చేసుకోవచ్చు కూడా. బ్యాంకులు విభిన్న రకాల కస్టమర్ల అవసరాలను బట్టి విభిన్న ఫారెక్స్ కార్డులను అందుబాటులోకి తెచ్చాయి. వీటిలో మీ అవసరాలకు తగిన వాటిని ఎంచుకోవచ్చు. విదేశీ ప్రయాణాల్లో కరెన్సీ కన్నా ఫారెక్స్ కార్డులను తీసుకువెళ్లడం ఎంతో సురక్షితం, సౌకర్యవంతమైనవని చెప్పవచ్చు.

- ఫారెక్స్ కార్డు ద్వారా మంచి ఎక్స్చేంజి రేటు లభిస్తుంది.

- వివిధ దేశాల కరెన్సీ విలువ ప్రతి రోజు మారుతుంది. కొన్ని సందర్భాల్లో విలువ తగ్గింపు చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మీ వద్ద ఉన్న కరెన్సీ విలువ తగ్గడానికి అవకాశం ఉంటుంది. అయితే ఫారెక్స్ కార్డులో మాత్రం ఈ సమస్య ఉండదు. కరెన్సీ లోడ్ చేసినప్పుడే అప్పుడున్న రేట్ లాక్ అవుతుంది. కాబట్టి కరెన్సీ విలువ తగ్గిన మీకు నష్టం ఉండదు.

- ఫారెక్స్ కార్డులకు ఈవీఎం చిప్ తో పాటు పిన్ నెంబర్ కూడా ఉంటుంది కాబట్టి సురక్షితంగా చెల్లింపులు చేయవచ్చు.

- ఒకవేళ పిన్ నెంబర్ ను మార్చుకోవాలన్నా ఆన్ లైన్ ద్వారా మార్చుకోవచ్చు.

-మీ కార్డును అవసరం అనుకుంటే బ్లాక్ చేసుకోవచ్చు.

- ఒకవేళ కార్డును కోల్పోతే ప్రీపెయిడ్ నెట్ బ్యాంకింగ్ లేదా ఫోన్ బ్యాంకింగ్ ద్వారా కార్డును బ్లాక్ చేసుకోవచ్చు.

- అనధికారిక లావాదేవీలు జరిగితే దానికి బీమాను కూడా పొందే అవకాశముంటుంది.

- ఈ కార్డుల ద్వారా వివిధ రకాల డిస్కౌంట్లను, క్యాష్ బ్యాంకులను కూడా పొందవచ్చు.

ఏ కార్డు తీసుకోవాలి

ఏ కార్డు తీసుకోవాలి

సింగిల్ కరెన్సీ కార్డులతో పాటు మల్టీ కరెన్సీ కార్డులను కూడా బ్యాంకులు అందిస్తున్నాయి. ఇవి అందించే ప్రయోజనాలు భిన్నంగా ఉంటాయి. ఉదాహరణకు సింగిల్ కరెన్సీ కార్డు తీసుకుంటే ఆ కరెన్సీలో చెల్లింపులు చేసినప్పుడు కరెన్సీ కన్వర్షన్ చార్జీలు ఉండవు. కానీ వేరే కరెన్సీలో చెల్లింపులు చేస్తే చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. మల్టీ కరెన్సీ ఫారెక్స్ కార్డును తీసుకుంటే ఏ దేశానికి వెళ్లినా ఆ దేశ కరెన్సీలో చెల్లింపులు చేయవచ్చు. కరెన్సీ కన్వర్షన్ చార్జీలు ఉండవు. మల్టీ కరెన్సీ కార్డులో 23 రకాల కరెన్సీలను లోడ్ చేసుకోవచ్చు.

దరఖాస్తు ఇలా...

దరఖాస్తు ఇలా...

- భారత కరెన్సీలో చెల్లింపులు చేసి ఫారెక్స్ కార్డును పొందవచ్చు.

- ఆన్ లైన్ లేదా బ్యాంకు శాఖను సంప్రదించి ఈ కార్డును పొందవచ్చు.

- దరఖాస్తు సమయంలో మీకు అవసరం ఉన్న కార్డు, ఫారెక్స్ విలువను తెలియజేయాల్సి ఉంటుంది. మీకు అవసరం ఉన్న ఫారెక్స్ కోసం ఎంత చెల్లించాలో లెక్కించుకొని చెల్లింపులు చేయాలి. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే మూడునాలుగు రోజుల్లో కార్డు మీ చిరునామాకు వస్తుంది.

- బ్రాంచ్ శాఖల ద్వారా మరింత వేగవంతంగా ఫారెక్స్ కార్డును పొందవచ్చు. కొన్ని గంటల వ్యవధిలోనే ఈ కార్డు ఆక్టివేట్ అవుతుంది.

- ఫారెక్స్ కార్డు కోసం పాస్ పోర్ట్, వీసా, విమాన టిక్కెట్ కాపీలు అవసరం ఉంటాయి.

- ఇంకా ఇవేమి డాక్యూమెంట్లు అవసరం ఉంటాయో ఫారెక్స్ కార్డును ఇచ్చే బ్యాంకు వెబ్ సైట్ ద్వారా లేదా కస్టమర్ కేర్ సెంటర్ల ద్వారా తెలుసుకోవచ్చు.

Read more about: card
English summary

విదేశీ ప్రయాణానికి సిద్ధమయ్యారా... ఫారెక్స్ కార్డు మరవకండి? | Don't forget Forex Card while foreign tour

The fee, however, is higher when you use your card abroad. And when you withdraw money from ATMs abroad using your debit card, you will have to pay a withdrawal fee.
Story first published: Monday, June 17, 2019, 14:21 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X