For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ.650 కోట్ల పన్ను ఎగవేత: జెట్ ఎయిర్వేస్ నరేష్ గోయల్‌కు షాక్

|

న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంతో సర్వీసులను తాత్కాలికంగా మూసివేసిన జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్‌కు షాక్ తగిలింది. పన్ను ఎగవేత ఆరోపణలు రావడంతో ఆయనకు ఆదాయపన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. రూ.650 కోట్ల పన్ను ఎగవేత కేసులో ఆయనను అధికారులు ప్రశ్నించారని తెలుస్తోంది.

జెట్ ఎయిర్‌వేస్, దుబాయ్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న గ్రూప్ కంపెనీల మధ్య ఈ పన్ను ఎగవేత లావాదేవీలు జరిగినట్లు ఐటీ డిపార్ట్‌మెంట్‌లోని దర్యాప్తు విభాగం గుర్తించింది. ఈ ఎయిర్‌లైన్స్ దుబాయ్‌లోని జనరల్‌ సేల్స్‌ ఏజెంట్లకు కమీషన్ల రూపంలో భారీ మొత్తాలు చెల్లించినట్లు డిపార్ట్‌మెంట్‌ దృష్టికి వచ్చింది.

Naresh Goyal summoned for Jet Airways alleged tax evasion of Rs 650 crore

జెట్ ఎయిర్వేస్‌లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఐటీ శాఖ దర్యాఫ్తు చేపట్టింది. గత ఏడాది సెప్టెంబరులో ముంబైలో జెట్ ఎయిర్వేస్ ఆఫీసులో అధికారులు సోదాలు జరిపి పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ దర్యాఫ్తు ఫిబ్రవరిలో ముగిసింది. అందుకు సంబంధించిన రిపోర్టును అసెస్‌మెంట్ వింగ్‌కు పంపించారు. జెట్ ఎయిర్వేస్, దుబాయ్‌లోని ఎయిర్ లైన్ గ్రూప్ కంపెనీకి మధ్య అక్రమ లావాదేవీలు జరిగాయని దర్యాఫ్తులో గుర్తించారు. దుబాయ్‌లోని ఏజెంటుకు జెట్ ఎయిర్వేస్ ప్రతి సంవత్సరం భారీ మొత్తంలో కమిషన్లు ముట్టచెప్పినట్టు దర్యాఫ్తు నివేదికలో పేర్కొన్నారు. ఆదాయపన్ను చట్టం కింద ఉన్న పరిమితులను దాటి ఈ చెల్లింపులు జరిగినట్లు తేలింది.

ఐటీ శాఖ దర్యాఫ్తు విభాగ నివేదిక ప్రకారం... జెట్‌ తన ఏజెంట్లకు ఐటీ చట్టం పరిమితికి మించి కమీషన్లు చెల్లించింది. దీంతో వీటిని అనుమతి చెల్లింపులుగా పరిగణించాలని పేర్కొంది. ఇవి పన్నులు ఎగవేసేందుకు విదేశాలకు నిధుల మళ్లించే వ్యూహంతో జరిపిన చెల్లింపులని, దర్యాప్తులో వెల్లడైన వివరాల ఆధారంగా సమన్లు జారీ చేయడం జరిగిందని సంబంధిత అధికారి ఒకరు చెప్పారని తెలుస్తోంది.

జెట్ ఎయిర్వేస్ జూన్ త్రైమాసిక ఫలితాల ప్రకటనలను ఆలస్యం చేస్తున్న సమయంలో ఈ సర్వే జరిగింది. పన్నును ఎగవేసేందుకు విదేశాలకు నిధులను మళ్ళించాలనే ఉద్దేశ్యంతోనే ఈ చెల్లింపులు జరిగాయని, ఈ చెల్లింపులపై ప్రశ్నించేందుకు నరేష్ గోయల్‌కు నోటీసులు ఇచ్చామని ఐటీ అధికారులు తెలిపారు. దీనిపై జెట్ ఎయిర్వేస్ స్పందించాల్సి ఉంది.

English summary

రూ.650 కోట్ల పన్ను ఎగవేత: జెట్ ఎయిర్వేస్ నరేష్ గోయల్‌కు షాక్ | Naresh Goyal summoned for Jet Airways alleged tax evasion of Rs 650 crore

Jet Airways founder Naresh Goyal is going to be questioned by the income tax department in relation with an alleged case of tax invasion, sources have revealed to The Economic Times. This happens to be the first time Goyal is summoned for alleged irregularities in the company.
Story first published: Sunday, June 16, 2019, 13:08 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X