For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గుడ్‌న్యూస్... ఇక మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు: పూర్తి వివరాలు...

|

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) శుభవార్త చెప్పింది. బ్యాంకు అకౌంట్‌లలో ప్రతి నెల కచ్చితంగా మినిమం బ్యాలెన్స్ ఉండాలన్న నిబంధనను ఎత్తివేసింది. ఇప్పటి వరకు గ్రామీణ, పట్టణ, నగర ప్రాంత అకౌంట్‌దారులు తమ ఖాతాల్లో కచ్చితంగా కనీస నగదు నిల్వ ఉండేలా చూసుకోవాలి. మినిమం బ్యాలెన్స్ ప్రాంతాన్ని బట్టి, బ్యాంకును బట్టి రూ.500 నుంచి రూ.10,000 వరకు ఉంది. ప్రభుత్వ బ్యాంకుల్లో మినిమం బ్యాలెన్స్ తక్కువగా ఉన్నప్పటికీ, ప్రయివేటు బ్యాంకుల్లో మాత్రం ఎక్కువగా ఉండాలి. లేదంటే పెనాల్టీ ఉంటుంది.

జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఎప్పుడు తీస్తారు: వడ్డీ రేటు వివరాలు.జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఎప్పుడు తీస్తారు: వడ్డీ రేటు వివరాలు.

BSBDA ఖాతాదారులకు గుడ్‌న్యూస్

BSBDA ఖాతాదారులకు గుడ్‌న్యూస్

బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ హోల్డర్లకు (BSBDA) ఇది గుడ్ న్యూస్. BSBDA అకౌంట్స్‌ను సాధారణంగా నో ఫ్రిల్స్ అకౌంట్స్‌గా పిలుస్తారు. బేసిక్ సేవింగ్స్ ఖాతాదారులు కనీస సదుపాయాలకు తోడు చెక్‌బుక్‌తో పాటు ఇతర సేవలనూ ఉచితంగా పొందే అవకాశం ఇప్పుడు ఆర్బీఐ కల్పించింది. బేసిక్ సేవింగ్స్ ఖాతాదారులు తమ ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ ఉంచాలనే నిబంధనను ఇప్పుడు కేంద్ర బ్యాంకు తొలగించింది.

మినిమం బ్యాలెన్స్ నిబంధనకు నో

మినిమం బ్యాలెన్స్ నిబంధనకు నో

నెలలో 4సార్లు బ్యాంకులు, ఏటీఎంల నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు అన్ని బ్యాంకులకు కేంద్ర బ్యాంకు ఆదేశాలు జారీ చేసింది. ఈ సదుపాయాలు కల్పిస్తున్నందుకు అకౌంట్‌లో మినిమం బ్యాలెన్స్ ఉంచాలనే నిబంధన ఉండకూడదని ఆర్బీఐ పేర్కొంది. ఈ ఆదేశాలు జూలై 1వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి.

ఇక వీరికి మినిమం బ్యాలెన్స్ లేకుండానే వివిధ రకాల సేవలు

ఇక వీరికి మినిమం బ్యాలెన్స్ లేకుండానే వివిధ రకాల సేవలు

బేసిక్ సేవింగ్స్ ఖాతాలు అంటే ఎలాంటి మినిమం బ్యాలెన్స్ అవసరం లేకుండా నిర్వహించుకోవచ్చు. చెక్ బుక్‌తో పాటు ఇతర సదుపాయాలు అడిగితే బ్యాంకులు మినిమం బ్యాలెన్స్ చూపించాలని అడుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బీఎస్‌బీడీఏను (Basic Savings Bank Deposit Accoun-BSBDA) సేవింగ్స్ ఖాతాగా కొన్ని రకాల సదుపాయాలు ఎలాంటి ఛార్జీలు లేకుండానే అందించాలని బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించింది.

ఈ సేవలు పొందవచ్చు

ఈ సేవలు పొందవచ్చు

ఆర్బీఐ ఆదేశాల నేపథ్యంలో కనీస సదుపాయాలకు అదనంగా బ్యాంకులు చెక్‌బుక్స్ వంటి సేవలను ఉచితంగానే అందించాల్సి ఉంటుంది. BSBDA సేవలను ఆర్బీఐ సడలించింది. ఏటీఎం నుంచి నెలకు నాలుగుసార్లు క్యాష్ విత్ డ్రా ఉచితం, బ్యాంకు ఖాతాల్లో ఎన్నిసార్లైన డిపాజిట్, ఉచిత ఏటీఎం లేదా డెబిట్ కార్డు జారీ, యాక్టివేషన్ ఛార్జీలు వసూలు చేయకూడదనే సడలింపులు ఉన్నాయి.

English summary

గుడ్‌న్యూస్... ఇక మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు: పూర్తి వివరాలు... | No minimum balance, more than 4 withdrawals allowed for no frill accounts

Banks will have to allow at least four withdrawals in a month, including those from ATM, from basic or no frill accounts, said the RBI on Monday. There will be no limit on the number of deposits in a month. Banks will also have to provide cheque books and cannot ask them to maintain a minimum balance in lieu of facilities.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X