For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

IBMలో భారీగా ఉద్యోగాల కోత, కారణాలివే: 25,000 ఖాళీలు ఉన్నప్పటికీ..

|

బెంగళూరు: ప్రముఖ ఇంటర్నెషనల్ బిజినెస్ మెషీన్ కార్ప్ యూఎస్‌లో ఈ వారం దాదాపు 2వేల మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. నాన్ పర్ఫార్మెన్స్ కారణంగా వారిని తొలగిస్తున్నట్లు తెలిపింది. ఇప్పటికే ఈ కంపెనీ ఇండియా యూనిట్‌లో 300 మంది ఉద్యోగులను తొలగించారు. ఆ తర్వాత యూఎస్‌లో ఈ వారం మరో రెండువేల మందిని తొలగించాలని నిర్ణయించారు. కాంపిటీటివ్ లెవల్లో తమ కంపెనీలోని అతికొద్దిమంది ఉద్యోగులు ప్రమాణాలు పాటించడం లేదని, పర్ఫార్మెన్స్ తక్కువగా ఉందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని కంపెనీ ప్రకటించింది.

SBI, ICICI, HDFC హోమ్‌లోన్స్ వడ్డీ రేటుSBI, ICICI, HDFC హోమ్‌లోన్స్ వడ్డీ రేటు

ఐబీఎంలో 3.5 లక్షల ఉద్యోగులు

ఐబీఎంలో 3.5 లక్షల ఉద్యోగులు

ఐబీఎంలో 3.5 లక్షల మంది (2018) ఉద్యోగులు ఉన్నారు. ఐబీఎం తమ ఎగ్జిస్టింగ్ కస్టమర్లకు అనుగుణంగా తమ ఆపరేషన్లను మార్చుకుంటోంది. తద్వారా ఐటీ పరిశ్రమలో సరికొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు, హైవాల్యూ సెగ్మెంట్స్ పైన దృష్టి సారించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), క్లౌండ్ కంప్యూటింగ్ పైన దృష్టి పెట్టిన నేపథ్యంలో 2016 నుంచి ఐబీఎం తమ ఉద్యోగులను తగ్గించుకుంటోంది.

ఉద్యోగం కోల్పోయింది ఒక శాతమే

ఉద్యోగం కోల్పోయింది ఒక శాతమే

మరో విషయం ఏమంటే ప్రపంచవ్యాప్తంగా ఐబీఎంలో 25 వేలకు పైగా వెకెన్సీలు (ఖాళీలు) ఉన్నాయట. అయితే వాటిని ఫుల్‌ఫిల్ చేయకపోవడమే కాకుండా ఉద్యోగులను నాన్ పర్ఫార్మెన్స్ కారణంగా తొలగించడం గమనార్హం. ప్రస్తుతం తమ సంస్థలోని ఉద్యోగుల్లో జాబ్స్ కోల్పోయిన వారు కేవలం ఒకశాతం కంటే తక్కువ అని చెబుతున్నారు. కొద్దిశాతం మంది ఉద్యోగులు తమ ప్రమాణాల్ని అందుకోవడం లేదని, వారిని విధుల నుంచి తప్పించామని, తాము, తమ బృందం ఐటీ సేవలపై దృష్టిని ఉంచుతామని, అవసరమైన విభాగాల్లో కొత్త వారిని తీసుకొని మా వినియోగదారులకు సేవలు అందిస్తామని పేర్కొంది.

అందుకే ఉద్యోగుల సంఖ్య తగ్గింపు

అందుకే ఉద్యోగుల సంఖ్య తగ్గింపు

ఐబీఎం తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోనుందని మొదట వాల్‌స్ట్రీట్ జనరల్‌ పేర్కొంది. క్లౌడ్కంప్యూటింగ్, AIపై దృష్టిపెట్టేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొంది. కాగా కొన్నేళ్లుగా ఐబీఎం ఆర్థిక ప్రగతి మందకొడిగా ఉంది. దీంతో వ్యాపారం పెద్దగా లేని విభాగాల్లో ఉద్యోగులను సంస్థ తగ్గించుకొంటోంది. దీనికి తోడు సరికొత్త విభాగాల వైపు అడుగులు వేస్తోంది.

English summary

IBMలో భారీగా ఉద్యోగాల కోత, కారణాలివే: 25,000 ఖాళీలు ఉన్నప్పటికీ.. | IBM fires 2,000 employees over non performance as tech giant looks to re invent itself

International Business Machine Corp has decided to fire about 2,000 employees in the United States over non performance.
Story first published: Sunday, June 9, 2019, 17:46 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X