ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందాకొచ్చార్‌ను మరోసారి విచారించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సిద్ధమవుతోంది. ఐసీఐసీఐ బ్యాంకు-వీడియోకాన్ మనీలాండరింగ్ (పీఎంఎల్ఏ) కేసులో వచ్చేవారం హాజరు కావాలని ఆమెకు ఈడీ సమన్లు జారీ చేసింది. వీడియోకాన్ రుణాల మంజూరు వ్యవహారంలో చందా కొచ్చార్, ఆమె భర్త దీపక్ కొచ్చార్‌లు మనీలాండరింగ్ క్రిమినల్ కేసును ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇదివరకే వారిని విచారించారు. ఇప్పుడు మరోసారి నోటీసులు ఇచ్చారు.
ఈ నెల 10న ఢిల్లీలో ఈడీ అధికారుల ఎదుట విచారణకు హాజరుకావాలని ఈడీ స్పష్టం చేసింది. తొలుత ఈ నెల 6వ తేదీనే హాజరుకావాలని ఈడీ సూచించింది. అయితే కొన్ని కారణాల వల్ల తాను ఆ రోజు హాజరుకాలేనని, విచారణను మరో రోజుకు మార్చాలని చందాకొచ్చార్ కోరారు. దీంతో ఈడీ వచ్చే సోమవారం రావాలని పేర్కొంది.

ఈ కేసుకు సంబంధించి చందాకొచ్చార్ దంపతులు గత నెలలో దర్యాఫ్తుకు హాజరయ్యారు. మే 13 నుంచి 17 వరకు అయిదు రోజుల పాటు ఈడీ అధికారులు వారిని సుదీర్ఘంగా ప్రశ్నించారు. అంతకుముందు ఈ కేసుకు సంబంధించి ముంబై, ఔరంగాబాద్‌లలోని చందాకొచ్చర్, ఆమె కుటుంబ సభ్యులు, వీడియోకాన్ గ్రూప్‌నకు చెందిన వేణుగోపాల్ ధూత్ ఇళ్లలో సోదాలు చేశారు. అనంతరం ముంబైలోని ఈడీ కార్యాలయంలో విచారించారు.
వీడియోకాన్ గ్రూప్ రుణాల అవకతవకలపై చందాకొచ్చర్ గత ఏడాది అక్టోబరులో ఐసీఐసీఐ బ్యాంకు సీఈఓ పదవి నుంచి తప్పుకున్నారు. 2012లో వీడియోకాన్ గ్రూప్ రూ.3,250 కోట్ల రుణాలు పొందగా, దీనికి ప్రతిఫలంగా దీపక్ కొచ్చార్ కంపెనీలోకి పెట్టుబడులు వచ్చాయనే ఆరోపణలు ఉన్నాయి. వారిపై మనీ లాండరింగ్ క్రిమినల్ కేసు నమోదయింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications