For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఏటీఎంల సంఖ్య తగ్గిపోతోంది..! ఇబ్బందుల్లో ఖాతాదారులన్న ఆర్బీఐ..!!

|

ఢిల్లీ/హైదరాబాద్ : భారత్ లో బ్యాంకుల జాతీయూకరణ తర్వాత బ్యాంకింగ్ రంగంలో అనూహ్య మార్పులు సంతరిచుకున్నాయి. ముఖ్యంగా సాంకేతికను అందిపుచ్చకున్న బ్యాంకింగ్ వ్యవస్థ ఆన్ లైన్ సేవలకు పెద్ద పీఠ వేసింది. అంతే కాకుండా క్యాష్ డిపాసిట్ దగ్గర నుండి విత్ డ్రాయల్స్ వరకు ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బ్యాంకింగ్ వ్యవస్థ పకడ్బందీ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా అనూకూలమైన ప్రదేశాల్లో ఎటీఎం లను ఏర్పాటు చేసి బ్యాంక్ సేవలను మరింత సరళతరం చేసింది.

ఐతే ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కొన్ని ఎటీఎం సెంటర్లను తగ్గించేందుకు కసరత్తు చేస్తున్నారు అదికారులు. నిర్వహణ పరమైన సమస్యలు, నగదు కొరత, సాంకేతిక సమస్యల కారణంగా దేశంలో ఏటీఎంల సంఖ్య క్రమంగా తగ్గిపోతోందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్బీఐ) ఓ నివేదికలో చెప్పింది. 2017లో 2,22,300 ఏటీఎంలు ఉండగా 2019 మార్చి నాటికి 2,21,703 ఏటీఎంలకు చేరిందని ఆ నివేదిక చెప్పింది.

Number of ATMs decreases.! RBI says clients in trouble..!!

ఈ నివేదిక ప్రకారం..నగదు వినియోగం కంటే ఏటీఎంల సంఖ్య కూడా తక్కువగా ఉంది. నగదును జమ చేయడం కంటే ఉపసంహరణ రేటు పెరిగిపోతుంది. ఇక 2012లో 10,832 మందికి గానూ ఒక ఏటీఎం ఉండగా..2017నాటికి ఆ సంఖ్య 5,919. ఐదేళ్ల కాలంలో కొన్ని బ్యాంకులు ఏటీఎంల విస్తరణ రేటును పెంచాయి. కానీ కొన్ని బ్యాంకులు మాత్రం నిర్వహణ పరమైన సమస్యల కారంణంగా భారం దించుకుంటున్నాయి.

రోడ్డుపై వాణిజ్య స్థలం, సెక్యూరిటీ సిబ్బంది, విద్యుత్‌ బిల్లుల భారం వంటి అంశాలు ఏటీఎంలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీంతో పాటు నగదు కొరత ఏర్పడుతుండటంతో చాలా మటుకు ఆన్‌లైన్ లావాదేవీలు జరిగిపోతున్నాయి.దీంతో రెండేళ్లలో 597 ఏటీఎంల మూసివేత పడినట్టు ఆర్బీఐ లెక్కలు చూపిస్తోంది.

English summary

ఏటీఎంల సంఖ్య తగ్గిపోతోంది..! ఇబ్బందుల్లో ఖాతాదారులన్న ఆర్బీఐ..!! | Number of ATMs decreases.! RBI says clients in trouble..!!

According to a report by the Reserve Bank of India (RBI), the number of ATMs in the country has been steadily declining due to operational issues, cash shortages and technical problems.
Story first published: Saturday, June 8, 2019, 19:00 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X