For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సుందర్ పిచాయ్, ఫ్రైడ్‌మాన్‌కు అరుదైన గౌరవం

|

ప్రముఖ సెర్చింజన్ గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌కు అరుదైన గౌరవం దక్కింది. అమెరికా బిజినెస్ అడ్వోకసీ గ్రూప్ USIBC ఇచ్చే గ్లోబల్ లీడర్‌షిప్ 2019 అవార్డుకు సుందర్ పిచాయ్‌తో (46) పాటు నాస్దక్ ప్రెసిడెంట్ అడెనా ఫ్రైడ్‌మాన్ (50) ఎంపికయ్యారు. సాంకేతిక రంగ అభివృద్ధికి ఈ రెండు కంపెనీలు చేస్తున్న సేవలకు గాను వీరిని ఎంపిక చేశారు. ఈ అవార్డును వాషింగ్టన్‌కు చెందిన యూఎస్-ఇండియా బిజినెస్ కౌన్సెల్ (USIBC) అందిస్తోంది.

PM కిసాన్ నిధి: ప్రతి రైతుకు లబ్ధితో పాటు వీరికి ప్రయోజనాలు.PM కిసాన్ నిధి: ప్రతి రైతుకు లబ్ధితో పాటు వీరికి ప్రయోజనాలు.

 గ్లోబల్ లీడర్ షిప్ అవార్డు 2019

గ్లోబల్ లీడర్ షిప్ అవార్డు 2019

గ్లోబల్ లీడర్‌షిప్ అవార్డు 2019ని త్వరలో జరగనున్న 'ఇండియాస్ ఐడియాస్ సమ్మిట్'లో సుందర్ పిచాయ్, ఫ్రైడ్‌మాన్‌కు అందించనున్నారు. USIBC 2007 నుంచి ఈ అవార్డును ఇస్తోంది. అమెరికా, భారత్‌ల నుంచి టాప్ కార్పోరేట్ ఎగ్జిక్యూటివ్స్‌ను ఈ అవార్డులకు ఎంపిక చేస్తున్నారు. సదరు ఎగ్జిక్యూటివ్స్‌ల ఆధ్వర్యంలోని కంపెనీలు పాత్రను పరిగణలోకి తీసుకుంటారు. అమెరికా - భారత్ వాణిజ్య బంధం బలోపేతానికి సహకరిస్తున్న కార్పొరేట్‌ కంపెనీల దిగ్గజాలకు ప్రదానం చేస్తున్నారు.

 వాణిజ్య సంబంధాల, సాంస్కృతిక సంబంధాలు

వాణిజ్య సంబంధాల, సాంస్కృతిక సంబంధాలు

గూగుల్‌, నాస్దక్ కంపెనీల సహకారంతో 2018లో అమెరికా-భారత్‌ మధ్య వస్తు సేవల ద్వైపాక్షిక వాణిజ్యంలో 150 శాతం మేర వృద్ధి చెందినట్లు ఈ సందర్భంగా USIBC పేర్కొంది. గత అయిదేళ్లలో ఇది 142.1 బిలియన్ డాలర్లకు చేరుకుందని తెలిపింది. నాస్దక్ అధ్యక్షులు ఫ్రైడ్‌మాన్‌ మాట్లాడుతూ... USIBC కృషితో ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాలతో పాటు సాంస్కృతిక బంధం కూడా బలపడుతోందన్నారు.

సుందర్ పిచాయ్ ఏమన్నారంటే?

సుందర్ పిచాయ్ ఏమన్నారంటే?

గూగుల్ వృద్ధికి భారత్‌ ఎంతగానో తోడ్పాటును అందిస్తోందని సుందర్ పిచాయ్ ఈ సందర్భంగా చెప్పారు. ఈ క్రమంలో జరిగిన సాంకేతిక అభివృద్ధితో ప్రజల జీవన విధానం ఎంతగానో మెరుగుపడిందన్నారు. భారత్ అభివృద్దికి గూగుల్ తనవంతు సహకారం చేస్తూనే ఉంటుందని పేర్కొన్నారు. భారత్ - అమెరికా సంబంధాలు ఎప్పుడు కూడా చాలా క్రిటికల్ పరిస్థితుల్లో లేవని చెప్పారు.

సుందర్ పిచాయ్ లీడర్‌షిప్‌లో ఇండియా డిజిటల్ ఎకానమీ సెక్ట్రా‌ను శక్తివంతం చేయడం మాత్రమే కాదని, మహిళలు, అట్టడుగు వర్గాలు సహా లక్షలాది మంది ఇండియన్స్‌కు టెక్నాలజీని తీసుకెళ్తున్నారని USIBC ప్రెసిడెంట్ నిషా దేశాయి బిస్వాల్ అన్నారు.

English summary

సుందర్ పిచాయ్, ఫ్రైడ్‌మాన్‌కు అరుదైన గౌరవం | Sunder Pichai to receive 2019 Global Leadership Award

Google's India born CEO Sundar Pichai and Nasdaq president Adena Friedman have been chosen for the prestigious Global Leadership Awards 2019 by business advocacy group USIBC in recognition of the two companies' contribution as the leading technology driven platforms.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X