For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యూనికార్న్ క్లబ్‌లోకి లెన్స్‌కార్ట్

By Jai
|

హైదరాబాద్: దేశీయ స్టార్టప్ కంపెనీలు వ్యాల్యుయేషన్‌లో దూసుకుపోతున్నాయి. తాజాగా, కళ్లద్దాలు ఆన్‌లైన్‌లో, దుకాణాల్లో విక్రయించే స్టార్టప్ కంపెనీ లెన్స్ కార్ట్ యూనికార్న్ క్లబ్‌లో చేరబోతోంది. విలువపరంగా ఒక బిలియన్ అమెరికా డాలర్లు (సుమారు రూ.7వేల కోట్లు) ఉంటే ఆ కంపెనీని యూనికార్న్‌గా అభివర్ణిస్తారు. దేశంలో ఫ్లిప్‌కార్ట్‌తో పాటు ఒక డజను వరకే స్టార్టప్ కంపెనీలు ఈ లీగ్‌లో చేరాయి.

ఏటా వేల కొద్ది స్టార్టప్ కంపెనీలు పుట్టుకు వస్తున్నాయి. పోటీని, ఆర్థిక ఒత్తిళ్లను తట్టుకొని నిలబడేవి వందల్లోనే ఉంటాయి. అందులో నుంచి ఏ ఒకటో రెండో కంపెనీలు మాత్రమే అంతకంతకు విలువను పెంచుకుంటూ దూసుకుపోతాయి. పేటీఎం కూడా ఇలా ఎదిగి యూనికార్న్ క్లబ్‌లో చేరిన సంస్థనే.

జపాన్ దిగ్గజ ప్రయివేటు ఈక్విటీ కంపెనీ 350 మిలియన్ డాలర్లు (సుమారు రూ.2,450 కోట్లు) లెన్స్‌కార్ట్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తోందట. తద్వారా లెన్స్ కార్ట్ విలువ దాదాపు రెట్టింపుకు పైగా పెరిగి 1 బిలియన్ డాలర్లను దాటనుందని ది ఎకనమిక్స్ టైమ్స్ పేర్కొంది.

రూ.2,500 కోట్లు సమీకరించనున్న తెలంగాణ ప్రభుత్వంరూ.2,500 కోట్లు సమీకరించనున్న తెలంగాణ ప్రభుత్వం

Lenskart set to turn unicorn with likely $350 mn funding

దేశవ్యాప్తంగా మెట్రో నగరాలు, పెద్ద నగరాలు, పట్టణాల్లో లెన్స్‌కార్ట్‌కు దుకాణాలు (ఆఫ్‌లైన్ స్టోర్లు) ఉన్నాయి. అలాగే ఆన్‌లైన్లోను కళ్లద్దాలు విక్రయిస్తోంది. తాజా పెట్టుబడితో సింగపూర్ సహా అనేక దేశాల్లో లెన్స్ కార్ట్ కార్యకలాపాలు ప్రారంభించనుందని సమాచారం.

అదే జరిగితే అంతర్జాతీయంగా కార్యకలాపాలు సాగించే అతికొద్ది భారతీయ స్టార్టప్‌లలో లెన్స్‌కార్ట్‌కు చోటు దక్కనుంది. గత ఏడాది లెన్స్‌కార్ట్ సుమారు రూ.500 కోట్ల ఆదాయంపై రూ.70 కోట్ల నష్టాన్ని చవి చూసిందట. అయితే అంత క్రితం ఏడాది నష్టం రూ.263 కోట్లతో పోల్చితే కంపెనీ నష్టాలు బాగా తగ్గించుకోగలిగింది. వచ్చే ఒకటి రెండేళ్లలో లాభాల బాట పట్టే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

English summary

యూనికార్న్ క్లబ్‌లోకి లెన్స్‌కార్ట్ | Lenskart set to turn unicorn with likely $350 mn funding

Lenskart may be the next entrant to India’s unicorn club with the help of a $350 Mn investment from SoftBank Vision Fund.
Story first published: Wednesday, May 29, 2019, 11:25 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X