For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మా కృషిని గుర్తించి రేటింగ్ పెంచండి: అనిల్ అంబానీ, రుణభారంపై కొత్త మంత్ర

|

NBFC (నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ-బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ) రంగానికి అత్యవసర చికిత్స అవసరమని రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ అన్నారు. అధికారంలోకి వచ్చే కొత్త ప్రభుత్వం (మోడీ నేతృత్వంలోని ఎన్డీయే), రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)లు ఇందుకు కృషి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బిగ్ బ్రదర్‌లా ఆర్బీఐ NBFCకి కొత్త ఊపిరి ఊదాలన్నారు. ఇవి పూర్తిగా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అత్యవసర చికిత్స చేస్తేనే నిలదొక్కుకుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

BIG FMను రూ.1,200 కోట్లకు అమ్మనున్న అనిల్ అంబానీ, రేడియో సిటీ చేతికి... BIG FMను రూ.1,200 కోట్లకు అమ్మనున్న అనిల్ అంబానీ, రేడియో సిటీ చేతికి...

ట్యాబ్లెట్ ఇస్తే సరిపోదు

ట్యాబ్లెట్ ఇస్తే సరిపోదు

2020 ఏప్రిల్ నుంచి NBFC రంగానికి ద్రవ్యలభ్యత కవరేజీ నిబంధనలను ఆర్బీఐ కఠినతరం చేసింది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై ఆయన మాట్లాడారు. గత ఎనిమిది నెలలుగా NBFC సంక్షోభంలో కొట్టు మిట్టాడుతోందన్నారు. అవినీతితో పాటు ఇతర వ్యవహారాల వల్ల ఆర్థిక వ్యవస్థపై తీవ్ర దుష్ప్రభావం పడిందని చెప్పారు. ఎమర్జెన్సీ రూంలోని రోగిని కాపాడేందుకు టాబ్లెట్ ఇస్తే సరిపోదని, అందుకు సంబంధించిన వ్యవస్థ కావాలని, ఇప్పుడు NBFCకి అదే అవసరమన్నారు. కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం (మోడీ ప్రభుత్వం), ఆర్బీఐ నిధుల లభ్యతను పెంచడం ద్వారా సాయం చేయాలన్నారు. బ్యాంకులు కూడా NBFCకి నష్టభయం కారణంగా రుణాలు తగ్గించాయన్నారు. ఒకవేళ ఇస్తున్నా అధిక వడ్డీ ఉంటోందన్నారు. IL&FS సంక్షోభం తర్వాత NBFCకి నిధుల కొరత సమస్య ఎదురవుతోందన్నారు. మ్యుచువల్ ఫండ్ సంస్థలు కూడా రుణాలు తగ్గించాయన్నారు.

అనిల్ అంబానీ కొత్త మంత్ర

అనిల్ అంబానీ కొత్త మంత్ర

ప్రముఖ NBFCల బ్యాలెన్స్ షీట్ గత ఎనిమిది నెలల కాలంలో పూర్తిగా తగ్గిపోయిందని అనిల్ అంబానీ అన్నారు. తమ రిలయన్స్ క్యాపిటల్ వాటాల విక్రయం ద్వారా రుణాన్ని తగ్గించుకుంటోందని తెలిపారు. ఇటీవల ఎరిక్సన్ అంశంలో ముఖేష్ అంబానీ రూ.459 కోట్లు చెల్లించి అనిల్ అంబానీని గట్టెక్కించారు. ఆ తర్వాత అనిల్ అంబాని వివిధ సంస్థల్లో వాటాలు అమ్మడం ద్వారా రుణాలు తగ్గించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అనిల్ అంబానీ రుణ తగ్గింపుకు ఓ సూచన చేశారు. విలువ పెంచి, కొన్ని షేర్లు విక్రయించి, రుణాలు తగ్గించుకోవాలన్నారు. రిలయన్స్ నిప్పోన్ అసెట్ మేనేజ్‌మెంట్‌లో 43 శాతం వాటాను నిప్పోన్ లైఫ్‌కు విక్రయించడం ద్వారా రూ.6,000 కోట్లను సమీకరిస్తున్నారు. సాధారణ బీమా వ్యాపార విభాగంలో, వినోద ఆస్తులను కూడా రాబోయే కొన్ని వారాల్లో విక్రయిస్తామన్నారు. తమ సంస్థలు మూలధనంతో సమృద్ధిగా ఉన్నాయన్నారు. బిగ్ ఎఫ్‌ఎంను రేడియో సిటీకి విక్రయించడం ద్వారా రూ.1200 కోట్లు, ప్రైమ్ ఫోకస్‌లో 35 సాతం వాటా విక్రయం ద్వారా మరికొన్ని నిధులు సేకరిస్తోంది.

మా కృషిని గుర్తించి రేటింగ్ పెంచాలి

మా కృషిని గుర్తించి రేటింగ్ పెంచాలి

నగదు (కరెన్సీ-C), క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ (C), కోర్టులు(C) అంట్ మూడు Cల ప్రభావం కార్పోరేట్ రంగంపై బాగా పడుతోందని అనిల్ అంబానీ అన్నారు. నగదు కొరత ఉన్నప్పుడు విచక్షణతో జరిపే కొనుగోళ్లు తగ్గుతాయని, రికవరీ ప్రక్రియ ఆలస్యం అయ్యేందుకు కోర్టులు కారణం అవుతున్నాయన్నారు. అంతర్జాతీయ సంస్థల స్థాయిలో దేశీయ సంస్థలకు తగిన నైపుణ్యం, ఆధునిక తత్వం లేకపోవడం వల్ల క్రెడిట్ రేటింగ్‌లు తగ్గుతున్నాయన్నారు. NBFC అంశంలో ఆర్బీఐ, సెబీ, రానున్న ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. ఆస్తుల విక్రయం ద్వారా రుణబారం తగ్గించేందుకు తమ ప్రయత్నాలు తాము చేస్తున్నామని, దీనిని రేటింగ్ ఏజెన్సీలు గుర్తించాలన్నారు. మా కృషిని గుర్తించి రేటింగ్ పెంచేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

English summary

మా కృషిని గుర్తించి రేటింగ్ పెంచండి: అనిల్ అంబానీ, రుణభారంపై కొత్త మంత్ర | Anil Ambani wants RBI to play key role to gasping NBFCs

Anil Dhirubhai Ambani Group (ADAG) chairman Anil Ambani believes that the non banking financial sector or NBFCs are gasping for breath.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X