For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హైదరాబాద్ రోడ్లపైకి టీవీఎస్ రూ. 2.25 లక్షల బైక్

By Chanakya
|

హైదరాబాద్ రోడ్లపై దూసుకుపోయేందుకు సిద్ధమైంది టివిఎస్ అపాచీ ఆర్ఆర్ 310 సూపర్ బైక్. రేస్ డ్యూన్డ్ స్లిప్పర్ క్లచ్ టెక్నాలజీతో వచ్చిన ఈ బైక్‌ హైదరాబాద్‌లో లాంఛ్ అయింది. ఫాంటమ్ బ్లాక్ కలర్‌తో చూడగానే స్పీడ్ లవర్స్‌కు కిక్ ఇచ్చేలా ఉంది ఈ బైక్. బండి స్థిరత్వాన్ని మరింతగా పెంచుతూ, ముఖ్యంగా కార్నర్స్‌లో కూడా స్పీడ్ తగ్గకుండా దూసుకుపోయేలా డిజైన్ చేశారు ఈ అపాచీ ఆర్ఆర్ 310 బైక్‌ని.

ఏంటీ క్లచ్ స్లిప్పర్ టెక్నాలజీ

క్లచ్‌పై ఒత్తిడి తగ్గించడంతో పాటు సిటీ, హై వేస్, రేస్ ట్రాక్స్‌.. ఇలా ఎక్కడైనా అవసరానికి తగ్గట్టు వేగంగా దూసుకుపోవడం ఈ టెక్నాలజీ స్పెషాలిటీ. ఇప్పటికే అపాచీ బైక్‌ను కలిగి ఉన్న వాళ్లు కూడా ఈ టెక్నాలజీని వినియోగించుకోవచ్చు. దీన్ని అదనపు యాక్సెసరీగా తక్కువ ధరకే అందుబాటులోకి తెస్తున్నామని టీవీఎస్ యాజమాన్యం వెల్లడించింది. హైదరాబాద్ ఎక్స్ షోరూం ధర రూ.2.20 లక్షలుగా నిర్ణయించారు.

ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్ సేల్: ఏ ప్రాడక్ట్‌పై ఎంత డిస్కఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్ సేల్: ఏ ప్రాడక్ట్‌పై ఎంత డిస్క

మరిన్ని ఫీచర్స్

మరిన్ని ఫీచర్స్

  • 310 సిసి ఇంజన్
  • లిక్విడ్ కూల్డ్ ఇంజన్ విత్ అడిషనల్ కూలింగ్ టెక్నాలజీ
  • 6 స్పీడ్ గేర్ బాక్స్
  • రేసర్లు ఇష్టపడే టాకో మీటర్ స్టైల్
  • బై ఎల్ఈడీ ట్విన్ ప్రొజెక్టర్
  • మికెల్లిన్ స్ట్రీట్ స్పోర్ట్స్ టైర్స్
  • ధోనీ ఫస్ట్ కస్టమర్

    ధోనీ ఫస్ట్ కస్టమర్

    టీవీఎస్ లాంఛ్ చేసిన అపాచీ ఆర్ఆర్ 310కి ధోనీ బ్రాండ్ ఎంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ మధ్యే జాతీయ స్థాయిలో లాంఛ్ అయిన ఈ బైక్‌కు ధోనీయే మొదటి కస్టమర్. స్పీడ్‌ను అమితంగా ఇష్టపడే ధోనీకి ఈ మోడల్ తెగ్గ నచ్చేసిందట. ఈ సూపర్ ప్రీమియం బైక్‌ను ఓ ఇండియన్ సంస్థ ఉత్పత్తి చేయడం తనకు మరింత ఆనందంగా ఉంది అంటున్నాడు ధోనీ.

    ప్రీమియం సెగ్మెంట్

    ప్రీమియం సెగ్మెంట్

    టీవీఎస్‌కి లభిస్తున్న ఆదాయంలో ప్రీమియం సెగ్మెంట్‌ నుంచి 13 శాతం, మోటర్ సైకిల్స్ నుంచి 69 శాతం లభిస్తోందని యాజమాన్యం వెల్లడించింది. ఇప్పుడు ప్రీమియం సెగ్మెంట్లో అపాచీకి 45 శాతం మార్కెట్ షేర్ ఉందని, ఇది మరింతగా పెంచుకునే లక్ష్యంతో ఉన్నామని టీవీఎస్ చెబ్తోంది.

English summary

హైదరాబాద్ రోడ్లపైకి టీవీఎస్ రూ. 2.25 లక్షల బైక్ | 2019 TVS Apache RR 310 bike on Hyderabad roads

It's been roughly a year and a half since the Apache RR 310 started going out to customers, and the bike hasn't really met the hopes and expectations TVS set for it.
Story first published: Wednesday, May 29, 2019, 17:18 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X