For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హువాయ్ ఫోన్లలో ఇక గూగుల్ యాప్స్ పనిచేయవ్

By Chanakya
|

చైనా- అమెరికా మధ్య ముదిరిన వాణిజ్య వివాదం ఇప్పుడు హువాయ్ ఫోన్ కస్టమర్లకు చిక్కులు తెచ్చిపెట్టబోతోంది. రెండు దేశాల మధ్య వాతావరణం తారా స్థాయికి చేరడంతో హువాయ్‌పై ప్రత్యక్ష యుద్ధానికి దిగింది అమెరికా ప్రభుత్వం. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఫోన్ తయారీదారైన హువాయ్‌పై అనేక ఆంక్షలను విధించింది. ఇకపై యూఎస్ నుంచి ఏ ఎగుమతిదారు కూడా ఆ కంపెనీకి స్పేర్ పార్ట్స్, సాఫ్ట్‌వేర్ విక్రయించాలంటే అందుకు యూఎస్ ట్రేడ్ డిపార్ట్‌మెంట్ నుంచి ఖచ్చితంగా అనుమతి తీసుకోవాలి. తాజాగా గూగుల్ కూడా హువాయ్‌తో కటీఫ్ చెప్పేసింది. దీంతో ఇకపై గూగుల్ మ్యాప్స్, జీమెయిల్ సహా వివిధ యాప్స్ హువాయ్ ఫోన్లలో పనిచేయవు. ఇది నిజమా.. అనే అనుమానమే అక్కర్లేదు. ఎందుకంటే హువాయ్ ఇప్పుడు యాండ్రాయిడ్‌కు ప్రత్యామ్నాయాలను వెతికే వేటలో పడింది.

ఉబర్ ఈట్స్, ఫుడ్ పాండా ఎందుకు ఆఫర్స్ ఆపేశాయ్?ఉబర్ ఈట్స్, ఫుడ్ పాండా ఎందుకు ఆఫర్స్ ఆపేశాయ్?

గూగుల్ గూగ్లీ

గూగుల్ గూగ్లీ

హువాయ్‌తో సంబంధాలు దేశ భద్రతకు ముప్పు అనే స్థాయిలో అమెరికా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. అందుకే ఈ చైనీస్ కంపెనీకి దూరంగా ఉండాలని వివిధ సంస్థలకు హెచ్చరికలు జారీ చేసింతి వాషింగ్టన్. టెక్నాలజీ షేరింగ్‌పై నిషేధం విధించడంతో గూగుల్ కూడా తలొగ్గక తప్పలేదు. అందుకే తక్షణం గూగుల్‌కు సొంతమైన ప్రొప్రైటరీ సేవలు - జీమెయిల్, జీమ్యాప్స్ సహా మరికొన్ని అనుబంధ యాప్స్ కూడా నిలిచిపోబోతున్నాయి. అయితే గూగుల్ ప్లే, గూగుల్ సెక్యూరిటీ మాత్రం యధావిధిగా కొనసాగుతాయని సంస్థ ప్రకటించింది.

ఆ సేవలకు విఘాతం

ఆ సేవలకు విఘాతం

యాండ్రాయిడ్ నుంచి ఉచితంగా లభించే సేవలన్నీ కొనసాగుతాయని, అయితే గూగుల్‌కు మాత్రమే యాజమాన్య హక్కులున్న సేవలకు మాత్రం విఘాతం కలుగబోతోంది. దీనికి తోడు కొంత మంది చిప్ మ్యానుఫ్యాక్చరర్స్ కూడా హువాయ్‌కు స్పేర్ పార్ట్స్ ఆపేయబోతున్నారు. వాటిల్లో ఎన్‌విడియా సంస్థ వంటివి ప్రధానంగా ఉన్నాయి. హువాయ్ ప్రస్తుతం ఏడాదికి సుమారు 67 బిలియన్ డాలర్ల విలువైన (రూ.4.69 లక్షల కోట్లు) విడిభాగాలను దిగుమతి చేసుకుంటుంది. అందులో కేవలం యూఎస్ నుంచే సుమారు రూ.77 వేల కోట్ల విలువైన దిగుమతులను చేసుకుంటోంది హువాయ్.

5జీకి ఎఫెక్ట్

5జీకి ఎఫెక్ట్

చైనాను పూర్తిస్థాయి 5జీగా మార్చాలని ఉవ్విళ్లూరుతున్న హువాయ్‌కు ఇది షాకింగ్ వార్త. ఎందుకంటే గూగుల్ సహకారం లేకుండా 5జీ సేవలను విస్తరించలేదు. యాండ్రాయిడ్ ఓపెన్ సోర్స్ ప్రాజెక్టును వినియోగిస్తే యాప్స్ అన్నింటినీ మ్యాన్యువల్‌గా అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సాఫ్ట్‌వేర్ సంబంధ సమస్యలు, యాప్స్‌లో ఎప్పటికప్పుడు అప్ డేట్స్ వంటివి కష్టం కానుంది. మరి ఈ సమస్యలన్నింటినీ హువాయ్ ఏ విధంగా పరిష్కరించుకుంటుందో చెప్పడం కష్టమే.

English summary

హువాయ్ ఫోన్లలో ఇక గూగుల్ యాప్స్ పనిచేయవ్ | Google reportedly ends business with Huawei, will cut it off from Play Store

US internet giant Google, whose Android mobile operating system powers most of the world’s smartphones, said it was beginning to cut ties with Huawei, which Washington considers a national security threat.
Story first published: Tuesday, May 21, 2019, 11:50 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X