For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆర్బీఐ చెప్పినా...: 'కారణం తెలియదు, రూ.10 కాయిన్ తీసుకోవద్దని చెబుతున్నారు'

|

న్యూఢిల్లీ: ఈ నోట్లు చెల్లవని, ఈ కాయిన్స్ చెల్లవని అప్పుడప్పుడు ప్రచారం సాగుతుంది. వాటిపై అధికారులు వివరణ ఇచ్చే పరిస్థితులు వస్తాయి. అలాగే, రూ.10 నాణెం చెల్లదనే ప్రచారం చాలా రోజులుగా ఉంది. దీనిని చాలామంది తీసుకోవడానికి వెనుకాడుతారు. ఏ దుకాణంలో లేదా ఏ కూరగాయల షాప్‌లోనో, మరోచోట ఇస్తే తెలియనివారు.. అది చెల్లదు అని చెప్పి తీసుకోవడానికి మొగ్గుచూపరు. దీనిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వివరణ ఇచ్చింది. రూ.10 నాణెం చెల్లుతుందని చెప్పింది.

అయినా ఈ నాణేన్ని తీసుకోవడానికి వెనుకాడుతున్నారు. మణిపూర్‌లో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉంది. చాలాచోట్ల చిన్న వ్యాపారులు దీనిని తీసుకునేందుకు నో చెబుతున్నారట. పది రూపాయల కాయిన్స్ చలామణిలో ఉన్నప్పటికీ అవి చెల్లవనే భావనతో తీసుకోవడం లేదు. సూపర్ మార్కెట్లు, చిన్నచిన్న షాప్‌లు, కూరగాయల వ్యాపారులు దీనిని తీసుకోవడం లేదని ఓ స్కూల్ టీచర్ తెలిపారు. కొన్ని ప్రయివేటు బ్యాంకులు సైతం వీటిని తీసుకోవడం లేదని చెబుతున్నారు.

ఎప్పటి నుంచి ఇన్వెస్ట్ చేయాలి, ఏది లాభదాయకం?ఎప్పటి నుంచి ఇన్వెస్ట్ చేయాలి, ఏది లాభదాయకం?

Despite RBI clarification, no takers for Rs 10 coin in Manipur

మాంగ్‌లేంబి ఓ ప్రభుత్వ స్కూల్ టీచర్. రూ.10 కాయిన్ తీసుకోవడం లేదని ఆమె చెబుతున్నారు. వెండర్స్, ముఖ్యంగా గ్రాసరీ స్టోర్స్ ఈ కాయిన్స్ తీసుకోవడం లేదని, కొన్ని ప్రయివేటు బ్యాంకులు కూడా అంగీకరించడం లేదని చెప్పారు.

రూ.10 నాణెం చెల్లుతుందో లేదో తనకు తెలియదని, కానీ వాటిని తీసుకోవద్దని తనకు తెలిసినవారు చెబుతున్నారని, కానీ కారణం తెలియదని కూరగాయలు విక్రయించే పీ పిషక్ తెలిపారు.

ఆర్బీఐ ఇంఫాల్ బ్రాంచ్ జనరల్ మేనేజర్ మేరీ తంగ్‌పుర మాట్లాడుతూ.. రూ.10 నాణేంపై పుకార్లు వచ్చాయని, కానీ అవి అవాస్తవమని, పది రూపాయల నాణెం చెల్లుతుందని వివరణ ఇచ్చారు. దేశీయ మార్కెట్లో 14 డిజైన్లలో రూ.10 నాణేలు ఉన్నాయని, అవి నకిలీవి కాదని, ఎలాంటి అనుమానం లేకుండా తీసుకోవచ్చునని తెలిపారు.

English summary

ఆర్బీఐ చెప్పినా...: 'కారణం తెలియదు, రూ.10 కాయిన్ తీసుకోవద్దని చెబుతున్నారు' | Despite RBI clarification, no takers for Rs 10 coin in Manipur

If you happen to board a bus or visit a grocery store in Manipur with Rs 10 denomination coins in wallet, chances are there that you might be shown the door.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X