For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

'మహర్షి' రికార్డ్స్‌కు అవేంజర్స్ అడ్డు, పవన్ కళ్యాణ్‌ను మహేష్ బాబు దాటేనా?

|

పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూ.ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ తేజ... తదితరుల సినిమాలు కోట్లు కురిపిస్తాయి. టాప్ హీరోల సినిమాలు అంటే నిర్మాతలకు పండుగే! ప్రిన్స్ మహేష్ బాబు 'మహర్షి' సినిమా నిన్న (మే 9వ తేదీన) విడుదలైంది. ఇది అతని 25వ సినిమా. దర్శకుడు వంశీ పైడిపల్లి, నిర్మాత అశ్వినీదత్, దిల్ రాజు, పీవీపీ ప్రసాద్. హీరోయిన్ పూజా హెగ్డె. అల్లరి నరేష్ కీలక పాత్ర పోషించాడు. ఈ సినిమాలో మహేష్ బాబు ఎన్నారై టైకూన్ రిషి కుమార్ పాత్రలో నటించారు.

అమెరికాలో మహర్షి సినిమా వసూళ్లు

అమెరికాలో మహర్షి సినిమా వసూళ్లు

మహర్షి సినిమా ఇంటా బయటా కలెక్షన్లలో దుమ్ము రేపుతోంది. అమెరికాలో మహేష్ బాబుకు మంచి ఫాలోయింగ్ ఉంది. దీంతో బాక్సాఫీస్ రికార్డులు తిరగరాస్తుందని భావిస్తున్నారు. అలాగే, మహేష్ బాబు 25వ సినిమా కావడంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఓవర్సీస్‌లో తొలి రోజు 1 మిలియన్ డాలర్లకు పైన కలెక్షన్లు వసూలు చేస్తుందని భావించారు. కానీ 500K నుంచి 600K డాలర్లకు పరిమితమైంది. అమెరికాలో ఈ ఏడాదిలో మాత్రం అధిక వసూళ్లు చేసిన చిత్రం మహర్షి.

మహర్షి రికార్డ్స్‌కు అవేంజర్స్ బ్రేక్

మహర్షి రికార్డ్స్‌కు అవేంజర్స్ బ్రేక్

ఆస్ట్రేలియాలో మహర్షి సినిమా తొలి రోజు 115K డాలర్లు వసూలు చేసింది.మహర్షి సినిమా 1900 స్క్రీన్ల పైన అట్టహాసంగా విడుదలైంది. అవేంజర్స్-ది ఎండ్‌గేమ్ కారణంగా ఓవర్సీస్‌లో మహర్షి సినిమాకు తక్కువ స్క్రీన్‌లు దొరికాయి. అవేంజర్స్-ది ఎండ్‌గేమ్ సినిమా ఇప్పటికీ కలెక్షన్లు కొల్లగొడుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు

తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు

మహర్షి సినిమా నైజాంలో మొదటి రోజు 6.38 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ఇది ఆల్ టైమ్ రెండో రికార్డు. నాన్-బాహుబలి రికార్డుల్లో మొదటిది. గుంటూరులో రూ.4.40 కోట్లు వసూలు చేసింది. సీడెడ్ రూ.2.89 కోట్లు, యూఏ రూ.2.88 కోట్లు, ఈస్ట్ రూ.3.2 కోట్లు, వెస్ట్ రూ.2.47 కోట్లు, కృష్ణ రూ.1.39 కోట్లు, నెల్లూరు రూ.1 కోట్లు వసూలు చేసింది. ఏపీ, తెలంగాణలో మొదటి రోజు కలెక్షన్లు రూ.24.6 కోట్లు. ఏపీ, తెలంగాణలలో కొన్ని థియేటర్లలో అదనపు షోలకు పర్మిషన్ లభించింది.

చెన్నై కలెక్షన్లు

చెన్నై కలెక్షన్లు

చెన్నై నగరంలో రూ.23 లక్షలు వసూలు చేసింది. ఆల్ టైమ్ రికార్డుల్లో నాలుగో స్థానంలో ఉంది. భరత్ అనే నేను రూ.27 లక్షలతో మొదటి స్థానంలో, రంగస్థలం రూ.25 లక్షలతో రెండో స్థానంలో, అజ్ఞాతవాసి రూ.24 లక్షలతో మూడో స్థానంలో ఉంది. చెన్నై, బెంగళూరు వంటి నగరాల్లో తెలుగువారు ఎక్కువ. ఇక్కడ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ల సినిమాలకు టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతాయి.

అజ్ఞాతవాసి రికార్డులు మహర్షి బద్దలు కొట్టేనా?

అజ్ఞాతవాసి రికార్డులు మహర్షి బద్దలు కొట్టేనా?

కేరళలోని కొన్నిసెంటర్లలో మహర్షి సినిమా విడుదలైంది. కొన్ని చోట్ల ఇది కొత్త రికార్డులు (టాలీవుడ్) సృష్టించింది. కేరళలో ఈ సినిమా మొదటి రోజు రూ.2.9 లక్షలు వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా మహర్షి తొలి రోజు కలెక్షన్లు రూ.60 కోట్లుగా భావిస్తున్నారు. రూ.30 కోట్లకు పైగా షేర్. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు ఎక్కువ వసూలు చేసిన టాలీవుడ్ సినిమాల్లో అజ్ఞాతవాసి తొలి స్థానంలో ఉంది. పవన్ కళ్యాణ్ ఈ సినిమా తొలి రోజు షేర్ రూ.39 కోట్లు. అయితే మహేష్ బాబు.. పవన్ కళ్యాణ్‌ను దాటేస్తారా చూడాలి.

English summary

'మహర్షి' రికార్డ్స్‌కు అవేంజర్స్ అడ్డు, పవన్ కళ్యాణ్‌ను మహేష్ బాబు దాటేనా? | Mahesh Babu's Maharshi first day overseas box office collections

Superstar Mahesh Babu's much anticipated 25th film Maharshi has hit the screens the other day all over the world. Directed by Vamshi Paidipally, this film is produced jointly by Ashwini Dutt, Dil Raju and PVP Prasad.
Story first published: Friday, May 10, 2019, 14:38 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X