For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

250 ఏళ్ల చరిత్ర ఉన్న సంస్థ: ముఖేష్ అంబానీ చేతికి ఆ ప్రముఖ టాయ్స్ కంపెనీ

|

ముంబై: ఆసియాలోనే అత్యంత ధనవంతుడు ఆయన. ఇప్పటికే దాదాపు అన్ని రంగాల వ్యాపారాల్లో ఆయన ముద్రవేసుకున్నారు. ఇక టెలిఫోన్ రంగంలో పెను సంచలనమే సృష్టించారు. తక్కువ ధరలకే డేటా ఇచ్చి ఇతర టెలిఫోన్ సంస్థలకు సవాల్ విసిరారు. దీంతో ఆ కంపెనీలు కాస్త నష్టాల బాట పట్టాయి. తాజాగా లండన్‌లోని ఓ ప్రముఖ బొమ్మల తయారీ పై కన్నేశారు. దాన్ని కొంటున్నట్లు ప్రకటించారు. ఈ పాటికే ఆ ధనవంతుడు ఎవరో అర్థమైపోయి ఉంటుంది. ఔను మీరు ఊహించింది నిజమే. ఆయనే రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ.

 హామ్లేస్ బొమ్మల కంపెనీని టేకోవర్ చేసిన రిలయన్స్ ఇండస్ట్రీస్

హామ్లేస్ బొమ్మల కంపెనీని టేకోవర్ చేసిన రిలయన్స్ ఇండస్ట్రీస్

రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో కంపెనీని టేకోవర్ చేస్తున్నట్లు ప్రకటించింది. లండన్‌లోని ప్రముఖ బొమ్మల తయారీ కంపెనీ హామ్లేస్ సంస్థను రూ.620 కోట్లకు కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన డాక్యుమెంట్ ప్రక్రియ కూడా ముగిసినట్లు తెలుస్తోంది.

259 ఏళ్ల చరిత్ర ఉన్న బొమ్మల తయారీ కంపెనీ హామ్లేస్ సంస్థ గత కొన్నేళ్లుగా లాభాలు ఆర్జించడంలో విఫలమవుతూ వస్తోంది. 2018లో అన్ని పన్ను చెల్లింపుల తర్వాత 2.44 మిలియన్ పౌండ్లు లాభం వచ్చినట్లు ఆ సంస్థ పేర్కొంది. అంతకు ముందు ఏడాది అంటే 2017లో 11.24 మిలియన్ పౌండ్ల భారీ నష్టం వచ్చినట్లు హామ్లేస్ ప్రకటించింది.హామ్లేస్ సంస్థలో చైనాకు చెందిన ఫ్యాషన్ సంస్థ సీ బ్యానర్ ఇంటర్నేషనల్ 100 మిలియన్ పౌండ్లను 2015లో ఇన్వెస్ట్ చేసింది. చైనాలో ఈ ఫ్యాషన్ సంస్థకు స్టీవ్ మాడెన్ , సుండాన్స్ అనే రీటైల్ బ్రాండ్ స్టోర్స్ ఉన్నాయి.

 హామ్లేస్ గ్లోబల్ హోల్డింగ్స్ లిమిడెట్ నుంచి 100శాతం షేర్లు కొనుగోలు

హామ్లేస్ గ్లోబల్ హోల్డింగ్స్ లిమిడెట్ నుంచి 100శాతం షేర్లు కొనుగోలు

రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన సబ్సిడరీ కంపెనీ రిలయన్స్ బ్రాండ్స్ లిమిటెడ్, సీ బ్యానర్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్‌ సంస్థలు ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. హామ్లేస్ గ్లోబల్ హోల్డింగ్స్ లిమిడెట్ సంస్థకు సంబంధించిన 100శాతం షేర్లను కొనేందుకు ఒప్పందం కుదుర్చుకుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఇదే అంశాన్ని బాంబే స్టాక్ ఎక్స్‌ఛేంజ్ ఫైలింగ్‌లో కూడా పొందుపర్చింది.

 1760లో ఒకే ఒక స్టోర్‌తో ప్రారంభమైన హామ్లేస్ సంస్థ

1760లో ఒకే ఒక స్టోర్‌తో ప్రారంభమైన హామ్లేస్ సంస్థ

1760లో నోవా ఆర్క్‌లో ఒకే ఒక దుకాణంతో హామ్లేస్ సంస్థ ప్రారంభమైంది. ప్రస్తుతం 18 దేశాల్లో 167 స్టోర్లు ఈ సంస్థ నిర్వహిస్తోంది. యూకే తర్వాత చైనా, జర్మనీ, రష్యా, ఇండియా, దక్షిణాఫ్రికా, పశ్చిమాసియాలోని కొన్ని దేశాల్లో హామ్లేస్ స్టోర్లు ఉన్నాయి. ఇప్పటికే రిలయన్స్ రిటెయిల్ సంస్థకు పాన్ ఇండియాలో హామ్లేస్ బొమ్మలపై ఫ్రాంచైజీ హక్కులు కలిగిఉంది. ఇక తాజా ఒప్పందంతో రిలయన్స్ బ్రాండ్ టాయ్స్ రిటైల్ ఇండస్ట్రీలో కూడా తనదైన మార్కును చూపిస్తుందని రిలయన్స్ ఇండస్రీస్ పేర్కొంది. భారత్‌లో హామ్లేస్ సంస్థ ఫ్రాంచైజీగా ఉన్న రిలయన్స్ దేశవ్యాప్తంగా 29 నగరాల్లో 88 స్టోర్లను నిర్వహిస్తోంది.

 హామ్లేస్ సంస్థను కొనుగోలు చేసిన పలు కంపెనీలు

హామ్లేస్ సంస్థను కొనుగోలు చేసిన పలు కంపెనీలు

2003లో లండన్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్ నుంచి హామ్లేస్ సంస్థ తొలగించబడింది.ఆ సమయంలో ఈ సంస్థను ఐస్‌లాండ్‌కు చెందిన ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ బాగర్ గ్రూప్ర్ 68.8 మిలియన్ అమెరికన్ డాలర్లతో టేకోవర్ చేసింది. 2012లో ఈ సంస్థను 78.4 మిలియన్ అమెరికన్ డాలర్లకు ఫ్రాన్స్ సంస్థ గ్రూప్ లుడెండ్ కొనుగోలు చేసింది. 1881లో లండన్‌లోని రీజెంట్ స్ట్రీట్‌లో హామ్లేస్ సంస్థ ఏడు అంతస్తుల భవనంలో ఒక స్టోర్‌ను ప్రారంభించింది. ఆ సమయంలో 50వేల బొమ్మలను విక్రయించింది. అంతేకాదు లండన్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఈ స్టోర్ కూడా ఉండేది. ఈ స్టోర్‌ను ఏటా 5 మిలియన్ మంది పర్యాటకులు సందర్శించేవారు.

English summary

250 ఏళ్ల చరిత్ర ఉన్న సంస్థ: ముఖేష్ అంబానీ చేతికి ఆ ప్రముఖ టాయ్స్ కంపెనీ | British Toy store chain Hamleys to be acquired by Mukesh Ambani

Mukesh Ambani's Reliance industries has signed an agreement to acquire the famous london based toy company Hamleys, An official statement from the company said. Reliance had bought 100 percent shares from Hamleys global holdings limited.
Story first published: Friday, May 10, 2019, 10:20 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X