For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆస్ట్రేలియా కోర్టులో ఉబెర్ డ్రైవర్ల దావా : క్లాస్ యాక్షన్ పిటిషన్ దాఖలు

|

న్యూఢిల్లీ : అమెరికాలో 10 బిలియన్ డాలర్ల ఇనిషీయల్ పబ్లిక్ ఇష్యూ (ఐపీవో) సిద్ధమవుతోన్న ఉబెర్‌కు ఆస్ట్రేలియా ట్యాక్సీ డ్రైవర్ల నుంచి ఎదురుదెబ్బ తగిలింది. చట్టవిరుద్ధంగా అనుచిత ప్రయోజనాలను పొంది .. తమ పొట్ట కొట్టారని వేల మంది ట్యాక్సీ డ్రైవర్లు ఆస్ట్రేలియాలో క్లాస్ యాక్షన్ దావా వేశారు. సరైన లైసెన్స్ లేని డ్రైవర్లతో పర్మిట్ లేని వాహనాలు నడిపి ఉబెర్ చట్టాలను ఉల్లంఘించిందని వారు దావాలో పేర్కొన్నారు.

పరిహారం ఇప్పించండి ..
ఉబెర్ చర్యల వల్ల తాము కోల్పోయిన ఆదాయాన్ని తిరిగి చెల్లించాలని ట్యాక్సీ డ్రైవర్లు దావాలో కోరినట్టు వారి తరఫున కేసు వేసిన సంస్థ మారీస్ బ్లాక్ బర్న్ పేర్కొంది. అంతేకాదు ఇది ఆస్ట్రేలియా చరిత్రలో పెద్ద క్లాస్ యాక్షన్ దావాగా మారుతున్నట్టు సంస్థ పేర్కొంది. ఆస్ట్రేలియాలో ఉబెర్ చట్టవిరుద్ద కార్యకలాపాల విషయంలో కోర్టు తీర్పు మైలురాయిగా నిలుస్తోందని తెలియజేసింది.

uber drivers petition file australlia court

సమస్య కాదు కానీ ..
ఈ కేసులో ఉబెర్ కు వ్యతిరేకగా తీర్పు వస్తే కంపెనీపై ఎంత ప్రతికూల ప్రభావం ఉంటుందన్న అంశంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఉబెర్ కేసు ఓడిపోయి పరిహారం చెల్లించాల్సి వచ్చినా .. బిలియన్ డాలర్ల ఆదాయమున్న కంపెనీకి మిలియన్ డాలర్ల పరిహారం చెల్లింపు సమస్య కాబోదని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఉబెర్‌కు పొంచి ఉన్న చట్టపరమైన రిస్కుల నుంచి ఇన్వెస్టర్లకు కనీసం హెచ్చరిక లాంటిదైనా ఇచ్చినట్లవుతోందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

English summary

ఆస్ట్రేలియా కోర్టులో ఉబెర్ డ్రైవర్ల దావా : క్లాస్ యాక్షన్ పిటిషన్ దాఖలు | uber drivers petition file australlia court

Uber, who is preparing for $ 10 billion in the American public issue (IPO) in the US, has suffered a setback from Australian taxi drivers. Thousands of taxi drivers have challenged class action in Australia as they have illegally gained and lost their stomach. They claimed that the unmanned vehicles were run by unlicensed drivers and violated Uber Laws.
Story first published: Saturday, May 4, 2019, 18:22 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X