For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్యాంకులకు ఈ ఐదేళ్లలోనే రూ.1,21,700 కోట్లు ఎగ్గొట్టిన డిఫాల్టర్లు, ఈ 10 ఏళ్ల లెక్క ఇదీ

|

బ్యాంకులు డిఫాల్టర్ల కారణంగా సతమతమవుతున్నాయి. దివాళా కోర్టులకు లాగుతున్నప్పటికీ లోన్లు తీసుకొని, ఎగ్గొడుతున్న చాలామంది నుంచి రీపేమెంట్ ఆలస్యమవుతోంది. ఉద్దేశ్యపూర్వక ఎగవేతదారులు దాదాపు 11,000కు పైగా ఉన్నారు. అంటే చాలామంది ఆర్థికంగా బాగున్నప్పటికీ బ్యాంకులకు మాత్రం తిరిగి చెల్లించడం లేదు. డిసెంబర్ 2018 నాటికి ఈ ఎగవేతదారుల మొత్తం రూ.1,61,213 కోట్లకు చేరుకుంది. మార్చి 2014 నుంచి ఉద్దేశ్యపూర్వక ఎగవేతలు రూ.39,504 నుంచి భారీస్థాయికి చేరుకున్నాయి. డిసెంబర్ 2018 నాటికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)కి చెందిన ఎగవేతలే రూ.39,471 కోట్లు ఉన్నాయి. ఈ అయిదేళ్లలో రూ.121,700 కోట్ల ఎగవేతలు పెరిగాయి.

పాన్-ఆధార్ లింక్ చేయలేదా, నష్టపోతారు జాగ్రత్త!పాన్-ఆధార్ లింక్ చేయలేదా, నష్టపోతారు జాగ్రత్త!

పదేళ్లుగా డిఫాల్టర్స్ లెక్కలు

పదేళ్లుగా డిఫాల్టర్స్ లెక్కలు

సిబిల్ లిస్ట్ ప్రకారం 2014 మార్చి నాటికి 5,090 మంది డిఫాల్టర్లు ఉన్నారు. ఎగవేత మొత్తం రూ.39,504 కోట్లుగా ఉంది. ఇది క్రమంగా 2018 డిసెంబర్ నాటికి 11,046 డిఫాల్టర్లకు చేరుకుంది. మొత్తం రూ.1,61,213 కోట్లకు చేరుకుంది. 2019 మార్చి నాటికి బ్యాంకులు మరిన్ని పేర్లు కూడా చేర్చవచ్చునని అంటున్నారు. ఉద్దేశ్యపూర్వక ఎగవేతదారులు (ప్రతి ఏడాది మార్చి నాటికి) 2009లో 2,248 మంది, అమౌంట్ రూ.8,703 కోట్లు, 2010లో 3,441 మంది, 12,961 కోట్లు, 2011లో 4,015 మంది, 15,273 కోట్లు, మార్చి 2012లో 4,435 మంది, 23,252 కోట్లు, 2013లో 3,887 మంది, రూ.25,370 కోట్లు, 2014లో 5,090 మంది, రూ.39,504 కోట్లు, 2015లో 5,991 మంది, రూ.56,764 కోట్లు, 2016లో 7,582 మంది, రూ.79,352 కోట్లు, 2017లో 8,647 మంది, 99,917 కోట్లు, 2018లో 10,408 మంది, రూ.1,36,291 కోట్లుగా ఉంది. 2018 డిసెంబర్ నాటికి 11,046 మంది, రూ.1,61,213 కోట్లుగా ఉంది.

ఏ బ్యాంక్‌లో ఎంతమంది డిఫాల్టర్లు, ఎంత అమౌంట్?

ఏ బ్యాంక్‌లో ఎంతమంది డిఫాల్టర్లు, ఎంత అమౌంట్?

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిఫాల్టర్లు 1,675, అమౌంట్ రూ.39,471 కోట్లు,

పంజాబ్ నేషనల్ బ్యాంకు డిఫాల్టర్లు 1,094, అమౌంట్ రూ.23,448 కోట్లు,

బ్యాంక్ ఆఫ్ ఇండియా డిఫాల్టర్లు 400, అమౌంట్ రూ.9,784 కోట్లు,

బ్యాంక్ ఆఫ్ బరోడా డిఫాల్టర్లు 574, అమౌంట్ రూ.7,833 కోట్లు,

ఐడీబీఐ డిఫాల్టర్లు 180, అమౌంట్ రూ.7,381 కోట్లు,

యూకో బ్యాంక్ డిఫాల్టర్లు 649, అమౌంట్ రూ.6,525 కోట్లు,

యూనియన్ బ్యాంకు డిఫాల్టర్లు 803, అమౌంట్ రూ.5,575 కోట్లు.

ఉద్దేశ పూర్వక ఎగవేతదారుల డిస్సెమినేషన్ స్కీం

ఉద్దేశ పూర్వక ఎగవేతదారుల డిస్సెమినేషన్ స్కీం

ఉద్దేశ పూర్వక ఎగవేతదారుల్లో గుప్తా కోల్, కింగ్ ఫిషర్, ర్యాంక్ ఇండస్ట్రీస్, రాజా టెక్స్‌టైల్స్, బెటా నాఫ్తోల్ తదితరాలు ఉన్నాయి. ఉద్దేశ పూర్వక ఎగవేతదారుల డిస్సెమినేషన్ స్కీంను ఆర్బీఐ 1999లో మొదటిసారి నోటిఫై చేసింది. 2002 మే నెలలో దీనిని మోడిఫై చేసింది.

English summary

బ్యాంకులకు ఈ ఐదేళ్లలోనే రూ.1,21,700 కోట్లు ఎగ్గొట్టిన డిఫాల్టర్లు, ఈ 10 ఏళ్ల లెక్క ఇదీ | Wilful defaults surge by Rs 121,700 crore in 5 years

Wilful defaults have soared by Rs 121,700 crore from just Rs 39,504 crore in March 2014, according to figures published by Transunion Cibil, a credit information company.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X