For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రైతులపై కేసు, పెప్సికోకు చిక్కులు?: దేశవ్యాప్తంగా వ్యతిరేక ప్రచారానికి సిద్ధం

|

ఫుడ్ అండ్ బీవరేజెస్ సంస్థ పెప్సికోకు షాక్. రైతులకు, పెప్సికోకు మధ్య పేటెంట్ వివాదం కొనసాగుతోంది. రైతులకు రాష్ట్రీయ కిసాన్ పరిషత్ (RKP) అండగా నిలబడింది. ఇప్పటికే బీజేపీ అనుబంధ సంస్థ భారతీయ కిసాన్ సంఘ్ (BKS) బహిరంగంగా రైతులకు అండగా నిలబడింది. రైతులు, పెప్సికో ఇష్యూలో కలుగజేసుకోవాలని BKS కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. RKPని విశ్వహిందూ పరిషత్ మాజీ ప్రెసిడెంట్ ప్రవీణ్ తొగాడియా ప్రారంభించారు. ఇది కూడా BKS బాటలో రైతులకు మద్దతుగా నిలిచింది.

ఈ మేరకు RKP పెప్సికోకు వ్యతిరేకంగా భారీ ఎత్తున ప్రచారం నిర్వహించాలని భావిస్తోంది. గుజరాత్ రైతుల పైన కేసులు విత్ డ్రా చేసుకోకుంటే పెప్సికో ఉత్పత్తులు నిషేధించాలని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తామని, అలాగే ఈ అంసంలో గుజరాత్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలుగజేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రైతులతో వివాదం పెప్సికోకు ఇబ్బందులు తెచ్చిపెడుతోంది.

<strong>జాన్సన్&జాన్సన్ బేబీ షాంపూలు అమ్మొద్దు: చైల్డ్ రైట్స్ బాడీ</strong>జాన్సన్&జాన్సన్ బేబీ షాంపూలు అమ్మొద్దు: చైల్డ్ రైట్స్ బాడీ

అసలేం జరిగింది?

అసలేం జరిగింది?

గుజరాత్‌కు చెందిన 9 మది రైతుల పైన పెప్సికో కేసు పెట్టింది. ఈరైతులు ఎఫ్‌సీ-5 రకం బంగాళాదుంపలు పండించడమే వారు చేసిన నేరం. లేస్ (Lays) చిప్స్‌లో ఉపయోగించే ఎఫ్‌సీ రకం ఆలుగడ్డలను ఉత్పత్తి చేస్తున్నారంటూ నలుగురు రైతులు తమకు రూ.కోటి చెల్లించాలని అహ్మదాబాద్ కోర్టులో, మరో ఐదుగురు రైతులు తమకు రూ.20 లక్షలు చెల్లించాలని మొదసా జిల్లా కోర్టులో పెప్సికో దావా వేసింది. ఈ రకం బంగాళాదుంపలను పండించే అధికారం కేవలం తమకు మాత్రమే ఉందని ఈ కంపెనీ వాదిస్తోంది. తాము పేటెంట్ కలిగి ఉన్నామని చెబుతోంది.

ల్యాబ్‌కు శాంపిల్స్

ల్యాబ్‌కు శాంపిల్స్

ఈ రకం బంగాళాదుంపలను ఉత్పత్తి చేసే అనుమతిని తాము పంజాబ్‌ రైతులకు మాత్రమే ఇచ్చామని, వారికి విత్తనాలు సరఫరా చేశామని పెప్సికో తెలిపింది. గుజరాత్‌ రైతులు ఈ విత్తనాలను అక్రమంగా సంపాదించి ఆలును చాటుగా ఉత్పత్తి చేస్తున్నారని పెప్సికో కోర్టుకు వెళ్లింది. దీనిపై ఈ నెల 8వ తేదీన కోర్టు మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది. గుజరాత్‌ రైతులు అదే ఆలును ఉత్పత్తి చేస్తున్నారో లేదా తెలుసుకునేందుకు కమిషన‌ను నియమించింది. ఆ బంగాళాదుంపల శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపించాలని ఆదేశించింది.

రైతులపై దావా

రైతులపై దావా

గుజరాత్ రైతులు అవే రకమైన ఆలు పండిస్తున్నారని విచారణలో తేలింది. దీంతో గుజరాత్ రైతులు వాటి ఉత్పత్తి నిలిపివేయాలని లేదా దానిని తమకే విక్రయించాలని కోర్టును పెప్సికో కోరింది. దీనిపై సమాధానం చెప్పేందుకు రైతుల తరఫు న్యాయవాది సమయం కోరారు. అయితే పెప్సికో తమను బెదిరిస్తోందని, భారత్‌లో రైతులపై దావాలు చెల్లవని, ప్రభుత్వం జోక్యం చేసుకొని న్యాయం చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పెప్సికో పొటాటో రైతులపై లీగల్ సూట్ వేయడం కలకలం రేపుతోంది. శుక్రవారం పెప్సికో ప్రతినిధులు మాట్లాడుతూ... వారు కూడా తమ కార్యక్రమంలో చేరాలని, మేమే వారికి విత్తనాలు సరఫరా చేస్తామని, వారు తమతో చేరాలని లేదంటే వేరే ఆలు పండించుకోవాలన్నారు. రైతులతో సెటిల్ చేసుకునేందుకు సిద్ధమన్నారు.

English summary

రైతులపై కేసు, పెప్సికోకు చిక్కులు?: దేశవ్యాప్తంగా వ్యతిరేక ప్రచారానికి సిద్ధం | PepsiCo in trouble? Rashtriya Kishan Parishad to run campaign to boycott its products

The ongoing controversy between food and beverages giant PepsiCo India and north Gujarat-based potato growers took a political turn on Saturday as Rashtriya Kishan Parishad (RKP) and senior Congress leader Ahmed Patel backed farmers’ concern.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X