For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వ్యాపారులూ బహుపరాక్!: పన్ను ఎగవేత అరికట్టేందుకు జీఎస్టీ e-invoices

|

పన్ను ఎగవేతను తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. నిర్దిష్ట టర్నోవర్ కంటే ఎక్కువ బిజినెస్ చేసే వ్యాపారులు పన్ను ఎగ్గొట్టకుండా ఉండేందుకు e-invoice తెచ్చేందుకు జీఎస్టీ (గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్) అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. వ్యాపారులు తమ తమ సేల్స్‌ను ఇందులో జనరేట్ చేయాల్సి ఉంటుంది. దీనిపై అధికారులు వర్క్ చేస్తున్నారు. దీంతో పన్ను ఎగవేతను తగ్గించవచ్చునని భావిస్తున్నారు.

నిర్దిష్ట టర్నోవర్ కంటే పైన బిజినెస్ చేస్తున్న వ్యాపారులకు యూనిక్ నంబర్ ఇవ్వాలని యోచిస్తున్నారు. ఈ నెంబర్ ద్వారా సేల్స్‌ను e-invoice ద్వారా జనరేట్ చేసేందుకు వీలు కల్పిస్తారు. నిర్దిష్ట టర్నోవర్ కంటే ఎక్కువ బిజినెస్ చేస్తున్న వ్యాపారులకు ఇందుకు సంబంధించిన సాఫ్టువేర్ కూడా ప్రొవైడ్ చేయనున్నారని తెలుస్తోంది. ఇది జీఎస్టీ పోర్టల్ లేదా ప్రభుత్వ పోర్టల్‌కు లింకప్ అయి ఉంటుంది.

Govt plans to launch GST e-invoices to curb tax evasion

రిజిస్టర్డ్ పర్సన్ బిజినెస్ టర్నోవర్ లేదా వ్యాల్యూ ఆఫ్ ఇన్వాయిస్ ఆధారంగా e-invoice జనరేషన్ ఆవశ్యకత ఉంటుంది. e-invoice పైన అధ్యయనం చేసేందుకు జీఎస్టీ కౌన్సెల్ ఓ కమిటీని నియమించింది. ఇది సౌత్ కొరియా, లాటిన్ అమెరికా వంటి దేశాల్లోని వ్యవస్థలను స్టడీ చేస్తుంది.

ఈ-వే బిల్లులు

కాగా, జీఎస్టీ రిటర్న్స్ వరుసగా రెండు నెలలపాటు దాఖలు చేయకుంటే జూన్ 21 నుంచి ఈ-వే బిల్లులను పొందలేరు. వ్యక్తిగత, సంస్థాగత వ్యాపారులకు వస్తు రవాణా కోసం ఈ-వే బిల్లులు తప్పనిసరి. అయితే కొందరు వ్యాపారులు జీఎస్టీ విధానంలో అక్రమాలకు పాల్పడుతుండటంతో వారికి చెక్ పెట్టడంలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పై నిర్ణయానికి వచ్చింది. జీఎస్టీ కంపోజిషన్ స్కీం కింద ఉన్న వ్యాపారులకు కూడా ఇది వర్తిస్తుంది. కంపోజిషన్ స్కీంలో ఉన్నవారు ఆరు నెలలపాటు జీఎస్టీ రిటర్నులను ఫైల్ చేయకపోతే ఇక వారు ఈ-వే బిల్లులను జనరేట్ చేసే అవకాశం కోల్పోతారు.

English summary

వ్యాపారులూ బహుపరాక్!: పన్ను ఎగవేత అరికట్టేందుకు జీఎస్టీ e-invoices | Govt plans to launch GST e-invoices to curb tax evasion

GST officers are working on a system where businesses above a certain turnover threshold will have to generate e-invoice on government or GST portal for every sale, thereby effectively reducing the room for tax evasion.
Story first published: Sunday, April 28, 2019, 15:35 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X