For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్మార్ట్ ఫోన్ల కొనుగోలులో షియోమి రికార్డు : 29 శాతం షేర్‌తో ఫస్ట్ ప్లేస్, తర్వాత శామ్ సంగ్

|

హైదరాబాద్ : ఫోను లేనిదే చేయి ఆడదు. స్మార్ట్ ఫోన్ ఉంటే ఆకలి, దప్పికను మరచిపోతారు. ఇందుకు తగ్గట్టు స్మార్ట్ ఫోన్ల కొనుగోళ్లు కూడా పెరిగాయి. మార్చి క్వార్టర్‌లో 4 శాతం విక్రయాలు పెరిగినట్టు కౌంటర్ పాయింట్ రీసెర్స్ నివేదిక పేర్కొంది.

3.1 కోట్ల ఫోన్ల సేల్

3.1 కోట్ల ఫోన్ల సేల్

మార్చి క్వార్టర్ లో స్మార్ట్ ఫోన్లు 4 శాతం అంటే 3.1 కోట్ల స్మార్ట్ ఫోన్ల కొనుగోలు జరిగాయని తెలిపింది. ఇది అంచనా వేసిన దాన్ని కన్నా తక్కువ అని వెల్లడించింది. ప్రముఖ కంపెనీల స్మార్ట్ ఫోన్ల స్టాక్స్ ఇంకా ఉన్నాయని ప్రస్తావించింది. అయితే మార్కెట్ లో ఇంకా 40 కోట్ల మంది ఫీచర్ ఫోన్లనే వాడుతున్నందున స్మార్ట్ ఫోన్ అమ్మకాలకు మంచి అవకాశం ఉందని రీసెర్చ్ ఆనలిస్ట్ అన్షికా జైన్ లెక్కగట్టారు.

అగ్రస్థానంలో షియోమి

అగ్రస్థానంలో షియోమి

మార్కెట్ ఒడిదుడుకులు .. ఆశించిన మేర విక్రయాలు జరుగకపోయినా .. చైనా కంపెనీ షియోమి ఫోన్ల విక్రయాలు మాత్రం యథేచ్చగా జరుగుతున్నాయి. మార్కెట్ వాటా 29 శాతం కలిగి ఉందని నివేదికలో పేర్కొంది. ఆ తర్వాత శామ్ సంగ్ 23 శాతం, వివో 12 శాతం, రియల్ మీ 7 శాతం, ఒప్పో 7 శాతం ఉన్నాయని స్పష్టంచేసింది.

 చైనా బ్రాండ్లపై ఆసక్తి

చైనా బ్రాండ్లపై ఆసక్తి

వివో, రియల్ మి, ఒప్పొ ఫోన్లపై కస్టమర్లు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుండటంతో చైనా బ్రాండ్ల మార్కెట్ ఏడాదికి 20 శాతం మేర పెరుగుతోంది. ఈ ఏడాది చైనా బ్రాండ్లు రికార్డుస్థాయిలో 66 శాతం వాటా దక్కించుకున్నాయి.

శామ్ సంగ్ తర్వాత వన్ ప్లస్

శామ్ సంగ్ తర్వాత వన్ ప్లస్

ప్రీమియం స్మార్ట్ ఫోన్ల విభాగంలో వన్ ప్లస్ ఫోన్ నుంచి శామ్ సంగ్ అగ్రస్థానానికి చేరుకుంది. గెలాక్సీ ఎస్ 10 సిరీస్ స్మార్ట్ ఫోన్లకు ఎక్కువమంది కొనుగోలు చేయడంతో ... ఆ కంపెనీ షేర్ పెరుగుతోందని నివేదికలో పేర్కొంది.

English summary

స్మార్ట్ ఫోన్ల కొనుగోలులో షియోమి రికార్డు : 29 శాతం షేర్‌తో ఫస్ట్ ప్లేస్, తర్వాత శామ్ సంగ్ | redmi phone sales are increase

In March quarter, smart phones accounted for 4 per cent of the total smartphone purchased 3.1 crore smart phones. It is less than estimated.
Story first published: Saturday, April 27, 2019, 19:48 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X