For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రిలయన్స్ రికార్డ్: ఫాస్టెస్ట్ డౌన్‌లోడ్‌లో జియో టాప్, అప్‌లోడ్‌లో వొడాఫోన్

|

ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో మరో రికార్డ్ సాధించింది. జియో యూజర్లు క్రమంగా పెరుగుతోన్న విషయం తెలిసిందే. ఇందుకు ప్రధాన కారణం జియో అధిక డాటా ఇస్తుండటమే. తాజాగా, ట్రాయ్ (టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) మార్చి నెలకు సంబంధించిన గణాంకాలను వెలువరించింది. దీని ప్రకారం రిలయన్స్ జియో దేశంలోనే అత్యంత వేగవంతమైన డౌన్‌లోడ్ స్పీడ్ కలిగిన మొబైల్ నెట్ వర్క్‌గా నిలిచింది. అప్‌లోడ్‌లో మాత్రం వొడాఫోన్ మొదటి స్థానంలో నిలిచింది.

మీ ఇంటికి జియో గిగా ఫైబర్: హైస్పీడ్ ఇంటర్నెట్, ఈ విషయాలు తెలుసుకోండిమీ ఇంటికి జియో గిగా ఫైబర్: హైస్పీడ్ ఇంటర్నెట్, ఈ విషయాలు తెలుసుకోండి

 టాప్ డౌన్‌లోడ్‌లో రిలయన్స్ జియో

టాప్ డౌన్‌లోడ్‌లో రిలయన్స్ జియో

ట్రాయ్ చార్ట్ ప్రకారం మార్చి నెలకు రిలయన్స్ జియో 22.2 మెగా బైట్ పర్ సెకండ్ యావరేజ్ డౌన్‌లోడ్ స్పీడ్‌తో టాప్‌లో నిలిచింది. 2018లో ఫాస్టెస్ట్ 4జీ ఆపరేటర్‌గా రిలయన్స్ నిలిచింది. ఏడాది మొత్తం హయ్యెస్ట్ డౌన్‌లోడ్ స్పీడ్‌తో టాప్‌లో నిలిచింది. ఇక, అప్‌లోడింగ్ స్పీడ్‌లో వొడాఫోన్ తొలి స్థానంలో నిలిచింది. టాప్ డౌన్‌లోడ్ స్పీడ్‌తో జియో తొలి స్థానంలో నిలవగా, భారతీ ఎయిర్‌టెల్ 9.3 ఎంబీపీఎస్‌తో రెండో స్థానంలో నిలిచింది. ఫిబ్రవరిలో ఇది 9.4 ఎంబీపీఎస్‌గా ఉంది.

అప్‌లోడ్‌లో వొడాఫోన్

అప్‌లోడ్‌లో వొడాఫోన్

వొడాఫోన్-ఐడియాలు కలిసిపోయాయి. కానీ ట్రాయ్ 4జీ డౌన్‌లోడ్ స్పీడ్‌ను వేర్వేరుగా ఇచ్చింది. ఇందులో వొడాఫోన్ అప్‌లోడ్‌లో 7 ఎంబీపీఎస్‌తో మొదటి స్థానంలో ఉంది. ఫిబ్రవరిలో ఇది 6.8 ఎంబీపీఎస్‌గా ఉంది. అదే సమయంలో ఐడియా డౌన్‌లోడ్ స్పీడ్ ఫిబ్రవరిలో 5.7 ఎంబీపీఎస్‌గా ఉండగా, మార్చిలో 5.6 ఎంబీపీఎస్‌గా ఉంది.

 అప్‌లోడ్, డౌన్‌లోడ్ హిస్టరీ ఇలా

అప్‌లోడ్, డౌన్‌లోడ్ హిస్టరీ ఇలా

అప్‌లోడ్ స్పీడ్‌లో వొడాఫోన్ ఫిబ్రవరిలోను మొదటి స్థానంలో ఉంది. అప్‌లోడ్ స్పీడ్‌లో ఐడియా, భారతీ ఎయిర్‌టెల్‌లు ఫిబ్రవరి కంటే స్వల్పంగా తగ్గాయి. వీటి అప్ లోడ్ స్పీడ్ వరుసగా 5.5 ఎంబీపీఎస్, 3.6 ఎంబీపీఎస్‌గా ఉంది. రిలయన్స్ అప్ లోడ్ స్పీడ్ 4.6కు పెరిగింది. డౌన్‌లోడ్ స్పీడ్ యూజర్లకు వీడియోలు, ఇంటర్నెట్ బ్రౌజింగ్, మెయిల్స్ చెక్ చేసుకునేందుకు దోహదపడుతుంది. గణాంకాల ప్రకారం మైస్పీడ్ అప్లికేషన్ ద్వారా దీనిని సేకరించింది. మైస్పీడ్ యాప్ యాండ్రాయిడ్ ప్లే స్టోర్‌లో లభ్యమవుతోంది. మైస్పీడ్ అప్లికేషన్ ఇప్పటికే పది లక్షల మంది డౌన్‌లోడ్స్ పూర్తి చేసుకుంది.

English summary

రిలయన్స్ రికార్డ్: ఫాస్టెస్ట్ డౌన్‌లోడ్‌లో జియో టాప్, అప్‌లోడ్‌లో వొడాఫోన్ | Jio Has Fastest Download Speed in India at 22.2Mbps, Vodafone Tops Upload Speed: TRAI

With 22.2 Mbps (megabits per second) average download speed, Reliance Jio topped the 4G download speed chart of the Telecom Regulatory Authority of India (TRAI) for March.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X