For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

త్వరలో రూ.50 నోటు కొత్త సిరీస్, ప్రత్యేకతలు ఇవే

|

త్వరలో రూ.50 నోట్లు రానున్నాయి. ఈ కొత్త నోట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ సంతకం ఉండనుంది. త్వరలోనే రూ.50 నోటు నూతన సిరీస్ చలామణిలోకి రానుందని ఆర్బీఐ మంగళవారం ప్రకటించింది.

గవర్నర్ శక్తికాంత దాస్ సంతకంతో మహాత్మా గాంధీ బొమ్మ ఉండే కొత్త సిరీస్ త్వరలోనే చలామణిలోకి రానుందని, ఈ సిరీస్‌తో పాటు పాత రూ.50 నోట్లు కూడా చెల్లుతాయని ఆర్బీఐ ప్రకటించింది.

Rs 50 Notes To Be Issued With RBI Governor Shaktikanta Das Signature

కొత్తగా రానున్న రూ.50 నోటు 66 ఎంఎం x 135 ఎంఎం సైజులో ఉంటుంది.
ముందువైపు దేవనాగరి లిపిలో 50 సంఖ్య రాసి ఉంటుంది. ముందువైపు మహాత్మాగాంధీ చిత్రం కనిపిస్తుంది. ముందు, వెనుక వైపులో 50 సంఖ్య వాటర్‌మార్క్ కనిపిస్తుంది. సెక్యూరిటీ త్రెడ్‌పైన భారత్ అని రాసి ఉంటుంది. ముందువైపు కుడి భాగంలో అశోక స్తంభం ఎంబ్లమ్ ఉండి, నోటు ముద్రించిన సంవత్సరం నోటు వెనక భాగంలో ఎడమవైపు కనిపిస్తుంది. స్వచ్ఛ్ భారత్ లోగో కూడా ఉండనుంది.

నోట్ల పైన ఆర్బీఐ గవర్నర్ సంతకం దశాబ్దాలుగా వస్తోంది. జేమ్స్ బ్రెయిడ్ టైలర్ ఆర్బీఐ రెండో గవర్నర్‌గా ఉన్నారు. 1937 నుంచి 1943 మధ్య ఆయన సంతకం చేశారు. తొలి ఆర్బీఐ గవర్నర్ స్మిత్ (ఏప్రిల్ 1 1935 - 30 జూన్ 1937) నోట్ల పైన సంతకాలు చేయలేదు. అయిదో గవర్నర్‌గా అంబేగౌంకర్ ఇంటెరిమ్ గవర్నర్‌గా కొంతకాలం ఉన్నారు. అప్పుడు ఆయన సంతకం చేశారు.

English summary

త్వరలో రూ.50 నోటు కొత్త సిరీస్, ప్రత్యేకతలు ఇవే | Rs 50 Notes To Be Issued With RBI Governor Shaktikanta Das' Signature

On Tuesday, the Reserve Bank of India (RBI) said it will put into circulation Rs 50 denomination banknotes signed by its Governor Shaktikanta Das.
Story first published: Wednesday, April 17, 2019, 17:56 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X