For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చైనాకు షాక్: భారత్‌కు తగ్గిన దిగుమతులు, గత ఏడాది కంటే 5 శాతం డౌన్

|

న్యూఢిల్లీ: గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది జనవరి (2018-19 ఆర్థిక సంవత్సరంలో) మధ్య భారత్ నుంచి చైనాకు ఎగుమతుల విలువ 13.8 బిలియన్ డాలర్లగా ఉంటే, దిగుమతుల విలువ 60.1 బిలియన్ డాలర్లుగా ఉందని కామర్స్ మినిస్ట్రీ డేటా తెలిపింది. చైనా నుంచి దిగుమతులు గత ఏడాది కంటే ఐదు శాతం తగ్గుముఖం పట్టాయని పీహెచ్‌డీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తెలిపింది.

చైనా నుంచి భారత్‌కు దిగుమతులు తగ్గడానికి పలు కారణాలు ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరం (2018-19) ఏప్రిల్-జనవరి మధ్య అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2017-18) ఇదే వ్యవధితో పోల్చితే ఐదు శాతం తగ్గినట్లు పీహెచ్‌డీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రధాన కార్యదర్శి మహేశ్ రెడ్డి తెలిపారు. చైనా నుంచి దిగుమతులు 60.1 బిలియన్ డాలర్లుగా ఉన్నాయని తెలిపారు. చైనాతో భారత వాణిజ్య లోటు 53 బిలియన్ డాలర్ల నుంచి 46 బిలియన్ డాలర్లకు దిగి వచ్చిందన్నారు. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది జనవరి వరకు చైనాకు భారత్ చేసిన ఎగుమతులు 13.8 బిలియన్ డాలర్లుగా ఉన్నాయన్నారు.

Indias Imports from China Decelerating: Report

భారత్ నుంచి చైనాకు 2017-18లో ఎగుమతుల విలువ 13.33 బిలియన్ డాలర్లుగా ఉంటే, చైనా నుంచి దిగుమతుల విలువ 76.38 బిలియన్ డాలర్లుగా ఉంది. గత కొంతకాలంగా చైనాకు ఎగుమతులు పెరుగుతున్నాయి. అదే సమయంలో దిగుమతులు మాత్రం తగ్గుతున్నాయి. అంతకుముందు ఏడాది కంటే చైనాకు ఎగుమతులు 31 శాతం పెరిగాయి.

<strong>చైనీస్ ఈ కామర్స్ కంపెనీలకు చెక్, పన్నులు ఎగ్గొట్టే సంస్థలకు</strong>చైనీస్ ఈ కామర్స్ కంపెనీలకు చెక్, పన్నులు ఎగ్గొట్టే సంస్థలకు

మరోవైపు, చైనీస్ ఈ-కామర్స్ ప్లాట్ ఫాంలపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటికే చైనీస్ ఈ-కామర్స్ పోర్టల్స్ భారత్‌లో రిజిస్టర్ చేయించుకోవడం తప్పనిసరి చేసింది. చైనా వస్తువులు తక్కువ ధరకు వస్తుండటంతో ఆర్డర్ చేసి తెప్పించుకుంటున్నారు. చైనా కంపెనీలు యథేచ్చగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయి. గిఫ్ట్‌ల పేరుతో ఆర్డర్లు డెలివరీ చేస్తూ కస్టమ్ డ్యూటీ ఎగ్గొడుతున్నాయి. దీంతో ప్రభుత్వం దృష్టి సారించింది.

బహుమతుల పేరుతో భారత్‌కు వచ్చే రూ.5వేల విలువైన వస్తువులకు కస్టమ్స్ డ్యూటీ లేదు. దీంతో చైనా నుంచి రెండు లక్షలకు పైగా ఆర్డర్స్ వచ్చేవి. అయితే ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడంతో అవి 1.20 లక్షల యూనిట్లకు పడిపోయింది. ఈ-కామర్స్ పాలసీలో కేంద్రం ఇటీవల పలు మార్పులు చేసింది.

లక్షలకు పైగా ఆర్డర్లు పొందుతున్న చైనా కంపెనీలు ఆయా వస్తువులను బహుమతుల పేరుతో పార్సిల్ చేసి భారత్ పంపిస్తున్నారు. పార్సిళ్లపై గిఫ్ట్ అని ముద్రించి కస్టమ్స్ డ్యూటీ, జీఎస్టీ ఎగ్గొడుతున్నాయి. చైనా ఈ కామర్స్ కంపెనీలు నిబంధనలు కూడా ఉల్లంఘిస్తున్నాయి. కొన్నేళ్లుగా చైనీస్ ఈ కామర్స్ సంస్థలు నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతుండటంతో ఎట్టకేలకు ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. చైనా పార్సిళ్ల విషయంలో కఠినంగా వ్యవహరించాలని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, కస్టమ్స్‌ డిపార్ట్‌మెంట్‌తో పాటు పోస్టాఫీసులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఎయిర్‌పోర్టులు నౌకాశ్రయాలకు వచ్చే పార్సిళ్లపై మాత్రమే కస్టమ్స్ డ్యూటీ, జీఎస్టీ విధిస్తుండగా.. ఇకపై పోస్టాఫీసుల్లోనూ అమలు చేయాలని డీపీఐఐటీ స్పష్టం చేసింది.

English summary

చైనాకు షాక్: భారత్‌కు తగ్గిన దిగుమతులు, గత ఏడాది కంటే 5 శాతం డౌన్ | India's Imports from China Decelerating: Report

India's imports from China stood at USD 60 billion during the April-January period of 2018-19 fiscal, a deceleration of 5 per cent over the corresponding period a year ago, PHD Chamber of Commerce said on Saturday.
Story first published: Sunday, April 7, 2019, 14:34 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X