For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కేవలం 49 పైసలకే రూ.10 లక్షల రైల్వే ఇన్సురెన్స్! పూర్తి వివరాలు ఇవే

|

మీరు ఏ వాహనంలో ప్రయాణించినా ఇన్సురెన్స్ చేయడం ఎంతో ముఖ్యం. మీరు ప్రయాణించే సమయంలో ఇన్సూరెన్స్ ప్రొవైడర్లు వివిధ రకాల ఛార్జీలు వసూలు చేస్తారు. ఇండియన్ రైల్వేస్ కూడా తమ ప్లాట్ ఫాం ద్వారా ఎయిర్ టిక్కెట్‌లు బుక్ చేస్తే ఉచితంగా రూ.50 లక్షల ఇన్సురెన్స్, రైల్ టిక్కెట్ ద్వారా ట్రెయిన్ టిక్కెట్ బుక్ చేస్తే కేవలం 49 పైసలకు రూ.10 లక్షల ఇన్సురెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. మీరు రైల్ టిక్కెట్ ద్వారా బుక్ చేసుకున్నప్పటికీ ఇన్సురెన్స్ తీసుకోవడం మీ ఇష్టం. మీకు ఇష్టం ఉంటే ఆప్షన్ మీ సెలక్ట్ చేసుకోవచ్చు.

రైల్లో ప్రయాణిస్తున్నారా, ఇలా ఫుడ్ ఆర్డర్ చేసుకోండి: 500కు పైగా రెస్టారెంట్లతో ఒప్పందంరైల్లో ప్రయాణిస్తున్నారా, ఇలా ఫుడ్ ఆర్డర్ చేసుకోండి: 500కు పైగా రెస్టారెంట్లతో ఒప్పందం

టిక్కెట్ బుక్ చేసుకుంటే ఇన్సురెన్స్

టిక్కెట్ బుక్ చేసుకుంటే ఇన్సురెన్స్

మీరు టిక్కెట్ బుక్ చేసుకునే సమయంలో ఇన్సురెన్స్ ఆప్షన్ ఎంచుకుంటే కన్‌ఫర్మ్ అయిన టిక్కెట్ లేదా ఆర్ఏసీ ఈ టిక్కెట్‌కు ఇన్సురెన్స్ ఉంటుంది. కానీ వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్లకు ఉండదు. స్లీపర్, ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ వంటి అన్ని ఏ క్లాస్ ప్రయాణాలకు ఇన్సురెన్స్ తీసుకోవచ్చు. ప్యాసింజర్, సబర్బన్ రైళ్లలో తప్ప అన్ని రైళ్లలోను ఈ సదుపాయం ఉంది. అయితే ఐఆర్‌సీటీసీ (irctc.co.in.) వెబ్ సైట్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకుంటేనే ఈ ఇన్సురెన్స్ ఉంటుంది.

ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చెల్లుబాటు

ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చెల్లుబాటు

ఈ ఇన్సురెన్స్ మొత్తాన్ని రైలు ప్రమాదం కారణంగా గాయపడిన వ్యక్తికి లేదా మరణించిన వ్యక్తి ఫ్యామిలీకి అందిస్తారు. ఈ ఇన్సురెన్స్ ప్రయాణీకుడు టిక్కెట్ తీసుకున్న స్టేజ్ నుంచి అతను ప్రయాణించే గమ్య స్థానం వరకు చెల్లుబాటు అవుతుంది.

ఇన్సురెన్స్ డబ్బు ఇలా వస్తుంది

ఇన్సురెన్స్ డబ్బు ఇలా వస్తుంది

రైలు ప్రమాదంలో వ్యక్తి చనిపోయినా లేదా శాశ్వతంగా వికలాంగుడుగా మారినా రూ.10 లక్షలు వస్తాయి. శాశ్వత పాక్షిక అంగవైకల్యం ఏర్పడితే రూ.7.5 లక్షలు వస్తాయి. ఏమైనా గాయాలు తగిలితే ఆసుపత్రి ఖర్చుల కోసం రూ.2 లక్షలు అందుతాయి. అలాగే, మృతుల రవాణాకు అదనంగా రూ.10వేలు చెల్లిస్తారు. ఇందుకోసం ఐఆర్‌సీటీసీ మూడు ఇన్సురెన్స్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. శ్రీరామ్ జనరల్ ఇన్సురెన్స్ కంపెనీ లిమిటెడ్, ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సురెన్స్ కంపెనీ లిమిటెడ్, రాయల్ సుందరమ్ జనరల్ ఇన్సురెన్స్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రయాణికుడికి తన పాలసీకి చెందిన సమాచారం గురించి ఎస్సెమ్మెస్, రిజిస్టర్డ్ ఈ మెయిల్ ఐడీ ద్వారా అందుతుంది. ఈ సందేశం నేరుగా కంపెనీ నుంచి వస్తుంది. టిక్కెట్ బుక్ చేశాక మీకు ఆ ఇన్సురెన్స్ కంపెనీ నుంచి సమాచారం వచ్చాక ఆ కంపెనీ వెబ్ సైట్లో మీరు మీ నామినీ వివరాలు పొందుపర్చవలసి ఉంటుంది. ఆ వివరాలు పూర్తి చేయకుంటే లీగల్‌గా మీ హక్కుదారులకు దానిని చెల్లిస్తారు.

English summary

కేవలం 49 పైసలకే రూ.10 లక్షల రైల్వే ఇన్సురెన్స్! పూర్తి వివరాలు ఇవే | Booking Indian Railways ticket at IRCTC? Now, get insurance up to Rs 10 lakh for just 49 paise

The IRCTC provides insurance worth Rs 50 lakh for free if you are booking air ticket from its platform and insurance up to Rs 10 lakh for just 49 paise if you are booking a rail ticket.
Story first published: Wednesday, April 3, 2019, 18:08 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X