For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రికార్డులపై రికార్డులు.. సెన్సెక్స్, నిఫ్టీ పరుగో పరుగు

By Chanakya
|

స్టాక్ మార్కెట్ మరోసారి రికార్డుల మోత మోగించింది. సెన్సెక్స్ 39 వేల పాయింట్ల మార్కును, బ్యాంక్ నిఫ్టీ 30,648 పాయింట్ల మార్కును తాకాయి. నిఫ్టీ కూడా 10,700 పాయింట్ల మార్కును అధిగమించింది. చివర్లో తీవ్రమైన అమ్మకాల ఒత్తిడికి లోనైనప్పటికీ సూచీలన్నీ లాభాల్లోనే ముగిశాయి. మెటల్, బ్యాంకింగ్, ఐటీ, ఆటో రంగ కౌంటర్లకు కొనుగోళ్ల మద్దతు లభించగా రియాల్టీ, మీడియా, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎఫ్ఎంసిజి కౌంటర్లు నష్టపోయాయి.

సెన్సెక్స్ రికార్డ్: తొలిసారి 39వేల మార్క్ క్రాస్సెన్సెక్స్ రికార్డ్: తొలిసారి 39వేల మార్క్ క్రాస్

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రోత్సాహక సంకేతాలతో పటిష్ట లాభాలతో మొదలైన సూచీలు మిడ్ సెషన్ వరకూ అంతే ఉత్సాహాన్ని కనబర్చాయి. నిఫ్టీ ఒక దశలో 11,738 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. లైఫ్ టైం గరిష్టానికి 25 పాయింట్ల దూరంలో పరుగు ఆపిన నిఫ్టీ చివరకు 45 పాయింట్లు పెరిగి 11,669 దగ్గర క్లోజైంది. సెన్సెక్స్ 199 పాయింట్లు పెరిగి 38,872 దగ్గర ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ ఒక దశలో 30, 648 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. అయితే ఆఖరి గంటలో అనూహ్యమైన అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. ఏకంగా 350 పాయింట్లు పడిపోయి చివరకు 100 పాయింట్లు నష్టంతో 30,326 దగ్గర ముగిసింది.

Sensex smashes through 39,000 but settles off highs

పీఎస్‌యూ స్టాక్స్‌ ఎక్కడిదాకా

ప్రభుత్వ రంగ బ్యాంకులకు మూలధన సమకూర్పు సహా వడ్డీ రేట్ల తగ్గింపుపై అంచనాలు ప్రభుత్వ రంగ బ్యాంకులను పరుగులు తీయిస్తూనే ఉన్నాయి. ఈ రోజు కూడా ఆంధ్రా బ్యాంక్ 15 శాతం, యూకో బ్యాంక్ 6 శాతం, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 5.5 శాతం, కార్పొరేషన్ బ్యాంక్ - యూనైటెడ్ బ్యాంక్ 4 శాతం పెరిగాయి. లక్ష్మీవిలాస్ బ్యాంక్ 10 శాతం, జెకె బ్యాంక్ 8 శాతం, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ 5 శాతం, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 5 శాతం పెరిగాయి.

ఇసుజు సేల్స్ జూమ్

ఎస్ఎంఎల్ ఇసుజు మార్చి నెలలో 2003 వాహనాలను అమ్మింది. గతేడాది ఇదే నెలలో పోలిస్తే 14.1 శాతం అధికం. దీంతో ఈ స్టాక్ 4.6 శాతం లాభాలతో రూ.866 దగ్గర క్లోజైంది.
ఇదే సెక్టార్‌కు చెందిన మహీంద్రా అండ్ మహీంద్రా ఆటో అమ్మకాలు ఒక్క శాతం తగ్గాయి. ట్రాక్టర్ అమ్మకాలు 31 శాతం పడిపోవడంతో ఈ స్టాక్ 1.6 శాతం నష్టపోయి రూ.661 దగ్గర ముగిసింది.
ఎస్కార్ట్స్ ట్రాక్టర్ సేల్స్ మార్చి నెలలో 1 శాతం పడిపోయాయి. అయితే ఎగుమతులు 103 శాతం పెరిగినప్పటికీ స్టాక్ మాత్రం నీరసించింది. 3 శాతం నష్టపోయి రూ.776 దగ్గర క్లోజైంది.

మంచి బోణీ

దేశంలో మొట్టమొదటి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ ఎంబసీ రీట్స్ ఈ రోజు లిస్టైంది. ఈ యూనిట్ 3 శాతం లాభాలతో ప్రారంభమైంది. ఒక దశలో రూ. 324.50 గరిష్ట స్థాయికి చేరింది. చివరకు 4.7 శాతం లాభాలతో రూ.314.10 దగ్గర ముగిసింది. రూ.299-300 మధ్య యూనిట్లను ఎంబసీ ఆఫర్ చేసిన సంగతి తెలిసిందే.

ఎస్ఆర్ఎఫ్‌కు పొల్యూషన్ షాక్

ఎస్ఆర్ఎఫ్ సంస్థకు గుజరాత్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న ప్లాంట్‌ కాలుష్య నిబంధనలకు విరుద్ధంగా ఉందనే వార్తల నేపధ్యంలో ఈ స్టాక్ భారీగా పతనమైంది. క్లారిఫికేషన్ ఇచ్చేంత వరకూ ప్లాంట్ మూసివేయాలనే ఆదేశాలతో ఈ స్టాక్‌లో తీవ్రమైన అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. 20 రోజుల యావరేజ్‌తో పోలిస్తే 80 రెట్లు అధికంగా ట్రేడింగ్ వాల్యూమ్స్ నమోదయ్యాయి. ఇంట్రాడేలో రూ.2172 స్థాయికి పడిపోయినప్పటికీ స్టాక్ చివర్లో మళ్లీ తేరుకుంది. కేవలం 2 శాతం నష్టాలను నమోదు చేసి రూ.2358 దగ్గర క్లోజైంది.

English summary

రికార్డులపై రికార్డులు.. సెన్సెక్స్, నిఫ్టీ పరుగో పరుగు | Sensex smashes through 39,000 but settles off highs

Indian markets rose today, with the benchmark Sensex crossing the 39,000 mark for the first time ever, but could not sustain gains as profit-taking emerged at higher levels.
Story first published: Monday, April 1, 2019, 16:36 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X