For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ ధరలు పెరుగుతాయి, ఇవి తగ్గుతాయి!

|

రెండో రోజుల్లో 2018-19 ఆర్థిక సంవత్సరం ముగుస్తోంది. ఈ నేపథ్యంలో మీరు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాల్సి ఉంది. ఈ నెలఖరులోగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేవారు పాన్ కార్డు-ఆధార్ కార్డును లింక్ చేసుకోవడం తప్పనిసరి. ఇదిలా ఉండగా, ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి పలు ఇన్సురెన్స్ ప్రీమియంలు తగ్గనున్నాయి.

ఇరవై రెండేళ్ల వయస్సు నుంచి యాభై ఏళ్ల వయస్సు గల వారికి ఈ ప్రయోజనాలు ఉంటాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఇన్సురెన్స్ కంపెనీలు మరణాల రేటుకు సంబంధించి కొత్త డేటాను ఫాలో కానుంది. ఇన్సురెన్స్ ప్రీమియం నిర్ణయించేందుకు 2006-08 నాటి మరణాల రేటును పరిగణలోకి తీసుకుంటున్నాయి. ఇందులో సామాన్యులకు భారం కలిగించే అంశాలూ ఉన్నాయి.

These will be cheaper from April 1st

వచ్చే నెల ఒకటే తేదీ నుంచి ఇళ్ల ధరలు తగ్గనున్నాయి. జీఎస్టీ కౌన్సెల్ కొత్త రేట్లు ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. అంతకుముందు 12 శాతం ఉన్న జీఎస్టీని 5 శాతం శ్లాబ్‌లోకి తీసుకు వచ్చారు. అదే రూ.45 లక్షల లోపు ఇంటిపై 8 శాతం ఉన్న జీఎస్టీని ఒక శాతం చేయడం గుడ్ న్యూస్. ఇది మధ్య తరగతి, సామాన్యులకు సొంతింటి కలను నిజం చేసే శుభవార్త.

ఆర్బీఐ కొద్ది రోజుల క్రితం రెపో రేటును పావు శాతం తగ్గించింది. దీంతో బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి. ఇది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలులోకి రానుంది. ఇప్పటికే ఉన్న రుణాలపై కూడా వడ్డీ రేట్లు తగ్గుతాయి.

మరోవైపు, కార్ల ధరలు పెరగనున్నాయి. తయారీ ఖర్చు, ఇతర ఆర్థిక కారణాల వల్ల పలు కార్ల కంపెనీ సంస్థలు ధరలు పెంచుతున్నాయి. సీఎన్జీ వాహనాల ధరలు కూడా పెరగనున్నాయి. సీఎన్జీతో పాటు కిచెన్లకు సప్లై చేసే పీఎన్జీ ఇంధనం ధరలు కూడా పెరగనున్నాయి.

English summary

ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ ధరలు పెరుగుతాయి, ఇవి తగ్గుతాయి! | These will be cheaper from April 1st

These will be cheper from April 1st.
Story first published: Friday, March 29, 2019, 18:00 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X