For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ.25వేల వరకు పెరగనున్న టాటా కార్ల ధరలు, కారణాలివే

|

ఏప్రిల్ మాసం నుంచి టాటా మోటార్స్ వాహనాల ధరలు పెరగనున్నాయి. కార్ల ధరలను రూ.25,000 వరకు పెంచుతున్నట్లు టాటా మోటార్స్‌ తెలిపింది. ఉత్పత్తి వ్యయం పెరగడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్ల పరిణామాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ కంపెనీ శనివారం పేర్కొంది.

మాల్యాకు షాక్: బెంగళూరు ఆస్తులు స్వాధీనం చేసుకోవాలన్న కోర్టుమాల్యాకు షాక్: బెంగళూరు ఆస్తులు స్వాధీనం చేసుకోవాలన్న కోర్టు

వచ్చే నెల నుంచి తమ కార్ల రేట్లను పెంచుతున్నట్లు టయోటా, జాగ్వార్‌ ల్యాండ్‌రోవర్‌ (జేఎల్‌ఆర్‌) ఇప్పటికే ప్రకటన చేశాయి. టాటా మోటార్స్‌ ప్రస్తుతం చిన్న కారు నానో నుంచి ప్రీమియం ఎస్‌యూవీ హెక్సా వరకు పలు మోడళ్ళను విక్రయిస్తోంది. వీటి ధర రూ.2.36 లక్షల నుంచి రూ.18.37 లక్షల వరకు ఉంది.

Tata Motors to hike passenger vehicle prices by up to ₹25,000 from April

మారిన మార్కెట్ పరిస్థితులు, ఉత్పత్తి ఖర్చు పెరగడం, అంతర్జాతీయ ఆర్థిక కారణాల వల్ల ఈ ధరలు పెంచుతున్నట్లు టాటా మోటార్స్ ప్రెసిడెంట్, పాసెంజర్స్ వెహికిల్ బిజినెస్ యూనిట్ మయాంక్ పరీఖ్ శనివారం నాటి ప్రకటనలో తెలిపారు.

ఈ ఏడాది మూడు నెలల్లోనే టాటా మోటార్స్ కార్ల ధరలను పెంచడం ఇది రెండవసారి. జనవరిలో వివిధ కార్లపై రూ.40 వేల వరకు పెంచింది. వీటిలో టాటా హారియర్ కారుతోపాటు ఇతర కార్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు మరోసారి ధరలు పెరుగుతున్నాయి.

English summary

రూ.25వేల వరకు పెరగనున్న టాటా కార్ల ధరలు, కారణాలివే | Tata Motors to hike passenger vehicle prices by up to ₹25,000 from April

Tata Motors Saturday said it will increase prices of its passenger vehicles range by up to Rs 25,000 from April on account of rising input costs and external economic conditions.
Story first published: Sunday, March 24, 2019, 11:32 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X