రానున్న కాలం అంతా డిజిటల్ కాలమే ఇప్పటికే దేశంలో సుమారు 40 కోట్ల మంది స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు..అది రానున్న కోద్ది సంవత్సరాల్లోనే 60 కోట్లకు చేరుకునే అవకాశం కనిపిస్తుంది..దీంతో డిజిటల్ రంగం మరింత విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆర్ధిక విశ్లేకులు భావిస్తున్నారు..దీంతో ఇంటర్ నెట్ ఆర్ధిక వ్యవస్థ సుమారు లక్ష కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు.

ఆర్ధిక రంగంలో దూసుకు పోతున్న డిజిటల్ లావాదేవీలు
ఆర్ధిక రంగాన్ని డిజిటల్ రంగం ఉర్రూతలు ఊగిస్తోంది.దీంతో భారత ఆర్ధిక వ్యవస్థలో స్మార్ట్ ఫోన్ల వినియోగం, ఇంటర్ నెట్ వాడకం చాల కీలకపాత్ర పోషిస్తున్నాయి..అందుబాటులో స్మార్ట్ ఫోన్ల ధరలు ఉండడంతోపాటు ఇంటర్ నెట్ వాడకం చీఫ్ గా ఉండడం, డిజిటల్ మార్కెట్ విస్తృతికి కారణం అవుతోంది..మరోవైపు ఈ కామర్స్ వెబ్ సైట్లు విపరీతంగా పుట్టుకురావడంతో వాటిలో వ్యాపారం దినదినాభివృద్ది జరుగుతోంది.దీనికి తోడు మొబైల్ అప్లికేషన్స్ లో ఆర్ధిక లావాదేవీలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇక మార్కెట్ పోటీని తట్టుకోవడానికి చాల కంపనీలు డిజిటల్ బాట పడుతున్నాయి. ఈనేపథ్యంలోనే రానున్న నాలుగైదు సంవత్సరాల్లో డిజిటల్ వ్యాపారం లక్ష కోట్లకు చేరుకుంటుందని ఆర్ధిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

జీడిపికి వృద్దికి తోడ్పాటు
కాగా ఇది దేశ జీడిపి ని పరుగులు పెట్టించే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా రానున్న రోజుల్లో 60 కోట్ల వరకు స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరగడంతోపాటు ఇంటర్ నెట్ వాడకం సైతం పెరిగే అవకాశం కనిపిస్తోంది. దీంతో ముఖ్యంగా ఫైనాన్సియల్ సర్వీసులు, రిటైట్ రంగం, మీడియా ,తోపాటు ట్రావెల్ అండ్ హస్పిటాలిటి ,హెల్త్ కేర్ వంటి రంగాల్లో ఇంటర్ నెట్ వాడకం పెరగనుంది. మరోవైపు సోషన్ నెట్ వర్క్, మెసెజ్ లతో కూడా డాటా వినియోగం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి...డిజిటల్ రంగంలో వచ్చే విప్లవాత్మక మార్పు వల్ల రానున్న రెండు మూడు సంవత్సారల్లో దేశ జీడిపిలో సుమారు 15 వేల కోట్ల రుపాయలు వరకు డిజిటల్ రంగం నుండి వస్తాయని కూడ అంచనా వేస్తున్నారు. ఇది వార్షిక జీడిపి వృద్దిలో కనీసం ఒక శాతంగా ఉండనున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

దేశంలో నెలకు సగటున ఒక జీబీ వినియోగం మాత్రమే
ప్రస్థుతానికి దేశంలో సుమారు 40 కోట్ల మంది ఇంటర్ నెట్ వాడకం దారులు ఉన్నట్టు సమాచారం ..కాగా ఇందులో 56 శాతం మంది నెలకు 1 జీబిని సగటున వాడుతున్నారు. అయితే ఇతర దేశాల్లో మాత్రం ఇది రెండు నుండి మూడు జీబీ ఉండగా ,అభివృద్ది చెందిన దేశాలైన జపాన్ , యూఎస్ లో అది సరాసరి 9-10 జీబీ వరకు ఉంది.

డాటా వినియోగంలో భారత్ 155 వస్థానం
ప్రపంచ వ్యాప్తంగా చూస్తే ఇంటర్ నెట్ డాటా వినియోగంలో 155 వ స్థానంలో భారత దేశం ఉంది. అయితే రానున్న రోజుల్లో మరిన్ని తగ్గే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి..తాజగా భారత దేశంలో 3జీ,4జీలు ఎక్కువగా వాడుతుండగా 5జీ ప్రయోగదశలో ఉంది. దీంతో ఎయిర్ టెల్,జీయో, సంస్థలు 5జిని సిద్దం చేస్తున్నాయి, 5జి గనుక పూర్తిగా అందుబాటులోకి వస్తే ఇంటర్ నెట్ వినియోగం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.దీంతో డిజిటల్ రంగంలో భారత్ వృద్ది సాదించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి..
More From GoodReturns

చమురు సంక్షోభంలో స్నేహితుడికి అండగా రష్యా.. భారత రిఫైనరీ కంపెనీలకు 6 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు సరఫరా

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications