హైదరాబాద్ : పంజాబ్ బ్యాంకుల కన్షార్షియం నుంచి రూ. 13 వేల కోట్ల రుణం తీసుకొని విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరస్థుడు నీరవ్ మోదీ లండన్ లో ఉన్న భారత్ తీసుకురావడంతో జాప్యం ఎందుకు జరుగుతోంది ? లండన్ వీధుల్లో నీరవ్ తిరుగుతున్నారని టెలీగ్రాఫ్ రిపోర్టర్ ప్రపంచానికి చూపించినా .. ఇండియాకు రప్పించడంలో ఆలస్యం ఎందుకవుతోంది ? సీబీఐ, ఈడీ దర్యాప్తు సంస్థలను యూకే హోంశాఖ ఇండియా వెళ్లండి .. అప్పగింత కార్యక్రమం జరుగుతోందని ఎందుకు చెప్పింది. వీటన్నింటికీ కారణం ఆయనకు ఉన్న గోల్డెన్ వీసా.

ఏంటీ గోల్డెన్ వీసా ?
యూరోపియన్ యూనియన్ కు చెందని పెట్టుబడిదారులకు బ్రిటిష్ ప్రభుత్వం టయర్-1 ఇన్వెస్టర్ వీసాను జారీచేస్తుంది. దీనిని యూకే గోల్డెన్ వీసాగా పిలుస్తారు. యూకే ప్రభుత్వ బాండ్లు లేదా కంపెనీ షేర్లలో 20 లక్షల పౌండ్లు ..దాదాపు 18 కోట్ల పెట్టుబడులు పెట్టేవారికి అక్కడి ప్రభుత్వం గోల్డెన్ వీసాను జారీచేస్తుంది. నీరవ్ మోదీ కూడా గోల్డెన్ వీసా ద్వారానే బ్రిటన్ లో ఉంటున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. కానీ అతనికి ఇంతకుముందే గోల్డెన్ వీసా జారీ అయినట్టు సమాచారం.

ఐదేళ్లు పెట్టుబడి పెడితే శాశ్వత పౌరసత్వం
ఓ వ్యక్తి యూకేలో వ్యాపారం నెలకొల్పడం, లేదంటే పనిచేయడం, చదువుకొనేందుకు గోల్డెన్ వీసా అనుమతిస్తోంది. అయితే ఒకసారి రూ.18 కోట్ల పెట్టుబడులు పెట్టేవారికి మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుంది. సదరు వ్యక్తి ఐదేళ్లపాటు పెట్టుబడులు పెడితే వారికి శాశ్వత పౌరసత్వానికి అర్హుడవుతారు.

విదేశాల్లో ఉంటూ కూడా ..
గోల్డెన్ వీసాలో చాలా వెసులుబాటులు ఉన్నాయి. సదరు వ్యక్తి లండన్ లో ఉంటూ పెట్టుబడులు పెట్టొచ్చు. లేదంటే విదేశాల్లో ఉంటూ కూడా పెట్టుబడి పెట్టే వీలుంది. విదేశాలకు పారిపోయిన నీరవ్ మోదీ .. జనవరి వరకు అమెరికాలో ఉండి .. తర్వాతే లండన్ తిరిగి వచ్చారు. అయితే గతేడాది మేలో డైమండ్ హోల్డింగ్స్ పేరుతో వజ్రాభరణాల షోరూమ్ ను నీరవ్ రిజిష్టర్ చేయించినట్టు తెలుస్తోంది. కంపెనీ చిరునామాగా స్కాటిష్ ప్రావిడెంట్ హౌస్ ను చూయించారు. ఈ అడ్రస్ నీరవ్ అకౌంటెంట్ దత్తానీ చార్టెర్డ్ అకౌంటెంట్స్ కు చెందినది.
More From GoodReturns

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..



Click it and Unblock the Notifications