న్యూఢిల్లీ: జపాన్‌కు చెందిన ఎలక్ట్రానిక్స్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ దిగ్గజం సోనీ కార్పోరేషన్.. సుభాష్ చంద్ర నేతృత్వంలోని జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (జీఈఈఎల్)ను కొలుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది. దీని విలువ రూ.13వేల కోట్లుగా తెలుస్తోంది.
ఈ అంశంపై ఇప్పటికే చర్చలు జరిగాయని, ఇవి చివరి దశలో ఉన్నట్లుగా చెబుతున్నారు. మొత్తం 20 నుంచి 25 శాతం వాటాలను విక్రయించాలని సుభాష్ చంద్ర భావిస్తున్నారని తెలుస్తోంది. ఈ అమ్మకం ద్వారా వచ్చిన రూ.13 వేల కోట్ల మొత్తాన్ని రుణాలు చెల్లించేందుకు వినియోగించే అవకాశం కనిపిస్తోంది.

ఈ షేర్లపై సుభాష్ చంద్ర దాదాపు 30 శాతం ప్రీమియం కోరుతున్నట్లుగా తెలుస్తోంది. సుభాష్ చంద్ర ఎంత వాటా ఉంచుకోవాలనే దానిపై ప్రస్తుతం చిక్కుముడి కొనసాగుతోందని తెలుస్తోంది. ప్రస్తుతం ఎస్సెల్ గ్రూప్ జీలో 41.62 శాతం వాటాను కలిగి ఉంది. వాటిలో సగం పైగా ప్రస్తుతం రుణదాతల వద్ద తనఖాల్లో ఉన్నాయి.
ప్రస్తుతం సుభాష్ చంద్ర తన వద్ద ఇరవై శాతం వాటా ఉంచుకోవాలని భావిస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన రూ.650 రేటు వద్ద తన 19 శాతం వాటా విక్రయించినా రూ.13 వేల కోట్ల వరకు పొందే అవకాశముంది. దీంతో పరిస్థితిని తన అధీనంలోకి తెచ్చుకోవచ్చునని భావిస్తున్నారు. ప్రస్తుతం జీ సంస్థకు 171 దేశాల్లో దాదాపు 66 టెలివిజన్ ఛానల్స్ ఉన్నాయి. ఇది సోనీకి కలిసి వచ్చే అంశం.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?



Click it and Unblock the Notifications