For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మారుతి జిప్సీ.. ఇక చరిత్ర ! ఆగిపోతున్న ఉత్పత్తి

|

ముంబై: రగ్డ్ లుక్‌తో ఒకప్పుడు యూత్‌ను కట్టిపడేసిన వెహికల్ ఇది. వందలాది సినిమాల్లో హీరోలు జిప్సీతో కనిపించిన సంగతి మనలో చాలా మందికి తెలుసు. ఒకప్పుడు పోలీసులకు కూడా ఇదో డ్రీమ్ వెహికల్‌లా ఉండేది. మొట్టమొదటి ఆఫ్ రోడ్ వెహికల్‌లా స్పోర్ట్స్ లవర్స్‌కు హాట్ ఫెవరెట్‌లా ఉండేది.

అలా 33 ఏళ్ల పాటు తన ఫ్యాన్స్‌ను అలరించిన జిప్సీ ఇక హిస్టరీగా మారిపోబోతోంది. ఎందుకంటే ప్రొడక్షన్‌ను ఆపేస్తున్నట్టు మారుతి సంస్థ ప్రకటించింది.

Its end of road for the iconic Maruti Gypsy

ఆర్మీకి కూడా ఇష్టం
బరువు తక్కువగా ఉండే కారణం వల్ల ఆర్మీకి కూడా జిప్సీ బాగా నచ్చింది.

ఏదైనా మెకానికల్ ఇబ్బందులు వచ్చినా వెంటనే సులువుగా రిపేర్ చేసుకునే వీలు కూడా ఇందులో ఉందని మారుతి వర్గాలు చెబ్తాయి. కొన్ని సందర్భాల్లో ధృవ్ హెలికాఫ్టర్ జిప్సీని ఎయిర్ లిఫ్ట్ చేసి ఇతర ప్రాంతాలకు తరలించిన సందర్భాలూ ఉన్నాయి.

గ్రీన్ కలర్‌తో ఆర్మీకి ఇచ్చిన జిప్సీ ఇప్పటికీ చాలాప్రాంతాల్లో ఆర్మీ అధికారులకు హాట్ ఫెవరేట్‌గానే ఉంది.
అయితే జిప్సీ స్థానంలో కొద్దికాలం క్రితం నుంచే సఫారీ ఆర్మీకి సరఫరా చేస్తోంది టాటా మోటార్స్. మారుతికి షాక్ ఇచ్చి పెద్ద ఎత్తున కాంట్రాక్ట్స్ పొందింది.

మారుతి ఇంజనీరింగ్ టీం ఈ మధ్య కొత్త మోడల్స్‌పైనే ఎక్కువగా దృష్టిపెట్టింది. బలేనో, బ్రెజా డిజైర్‌ను అప్ గ్రేడ్ చేస్తూ వస్తోంది. ఒకప్పటి పాత మోడల్స్‌ను ఇప్పుడు టచ్ చేయట్లేదు. దీంతో చివరకు మారుతి జిప్సీ మెల్లిమెల్లిగా మన రోడ్లపై నుంచి మాయం కాబోతోంది.

ఓమ్మీ సహా జిప్సీని భారత్ ఎమిషన్ నార్మ్స్ 6 కు తగ్గట్టు అప్‌గ్రేడ్ చేయడం లేదు. ప్రస్తుతం ఉన్న కొత్త నిబంధనల ప్రకారం క్రాష్ టెస్ట్‌లో నిలిచే సత్తా ఓమ్మీ, జిప్సీకి లేదు. అందుకే వీటిని ప్రస్తుతానికి తప్పించబోతున్నారు.

Read more about: maruti vehicle suv
English summary

మారుతి జిప్సీ.. ఇక చరిత్ర ! ఆగిపోతున్న ఉత్పత్తి | It's end of road for the iconic Maruti Gypsy

Maruti Gypsy has been a favourite off-roader among enthusiasts for many years. And just like that, Maruti Suzuki has pulled the plug on its production. An email circulated among all Maruti dealerships specifically asking not to accept any more bookings for the Gyspy. After being in production for 34 years, Gypsy will probably be one of the longest-running models in Indian auto history. With its discontinuation, Indian loses the only sub-Rs 10 lakh petrol-powered off-roader. The last known price was Rs 6.25 lakh and Rs 6.40 lakh (ex-showroom Delhi) for the soft-top and hard-top variants, respectively.
Story first published: Sunday, March 10, 2019, 11:44 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X