For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రైతు బంధు పథకాన్ని దేశవ్యాప్తంగా ప్రవేశపెడితే ఎంత ఖర్చవుతుంది ?

భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆఖరి అస్త్రాన్ని ప్రయోగించబోతున్నారు. గంపెడన్ని ఆశలతో నాలుగున్నరేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన మోడీ సర్కార్.

By bharath
|

భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆఖరి అస్త్రాన్ని ప్రయోగించబోతున్నారు. గంపెడన్ని ఆశలతో నాలుగున్నరేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన మోడీ సర్కార్.. తాను ఇచ్చిన హామీల్లో ఎన్నింటిని అమలు చేసింది అనే విషయాన్ని పక్కనబెడితే ఈ బడ్జెట్‌ను ఆయన పూర్తిస్థాయిలో వాడాలనుకుని డిసైడ్ అయినట్టు ఉన్నారు. అందుకే ఓట్ ఆన్ అకౌంట్‌లో కూడా ఓట్ బ్యాంక్ కోసం వినియోగించే ప్రయత్నాల్లో ఉన్నారు.

రైతు బంధు పథకాన్ని దేశవ్యాప్తంగా ప్రవేశపెడితే ఎంత ఖర్చవుతుంది ?

ఓ వైపు రుణభారం పెరుగుతోంది.. మరోవైపు వృద్ధి అంతంమాత్రంగా ఉంది.. ఇదీ ఇప్పుడు దేశ ఆర్థిక స్థితి. 2014లో అధికారంలోకి అడుగుపెట్టిన మోడీకి అప్పుడది ఓ గోల్డెన్ ఆపర్చునిటీ. ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు భారీగా పడిపోవడంతో ఆర్థిక భారం అనూహ్యంగా తగ్గింది. మరోవైపు అనేక సంక్షేమ పధకాలకు ఆధార్ లింక్ చేయడంతో సబ్సిడీ భారం బాగా కలిసొచ్చింది. అయితే అప్పటి నుంచి కేంద్రం తీసుకున్న అనేక నిర్ణయాలు రివర్స్ అవుతూ వచ్చాయి. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం బెడిసికొట్టింది, జీఎస్టీ అమలు ఆలస్యమైంది.

అయితే ఆఖర్లో క్రూడ్ ధరలు బాగా పెరగడం, అనేక సంక్షేమ పథకాలకు నిధులు వంటివి అంశాలతో కరెంట్ ఖాతా లోటు పెరిగిపోయింది. మోడీపై జనాలు పెట్టుకున్న నమ్మకాన్ని ఆయన పూర్తిస్థాయిలో
నిలబెట్టుకోలేకపోయారనే వాదన ఉంది. దీంతో ఆఖరి అస్త్రంగా ఈ బడ్జెట్‌ను వేదిక చేసుకోబోతున్నారు. రైతులకు రుణమాఫీ సహా ఆర్థిక సాయాన్ని అందించడం, పేదలకు పెద్ద పీట వేసే నిర్ణయాలను వెల్లడించవచ్చని తెలుస్తోంది.

ఢిల్లీ వర్గాల సమాచారం ప్రకారం మోడీ.. రైతులకు నగదు బదిలీ పథకాన్ని ప్రకటించవచ్చని తెలుస్తోంది. ఇది సుమారు ఖజానాపై రూ.70 వేల కోట్ల వరకూ అధిక భారం మోపవచ్చని అంచనా. చిన్న రైతులకు ఇది లబ్ధి చేకూర్చేలా ప్రణాళికలను రూపొందిస్తున్నారు. వీటితో పాటు పన్నుచెల్లింపుదార్లకు కొద్దిగా లబ్ధి చేకురేలా
ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు.

నగదు చెల్లింపులు, ప్రతీ పౌరుడి ఖాతాలో నెలకు కొద్ది సొమ్ము జమ, రుణ మాఫీలు వంటి పథకాలన్నీ ప్రత్యక్షంగా బడ్జెట్ లోటును పెంచుతాయి. జీడీపీతో బడ్జెట్ లోటు 3.3
నుంచి 3.5 శాతానికి పెరగొచ్చని నిపుణులు లెక్కగడ్తున్నారు. ఇది బ్యాలెన్స్ షీట్‌ లెక్కలను తారుమారు చేయొచ్చు. ఇప్పటికే జీఎస్టీ రెవెన్యూ వసూళ్ల అంచనాలు తలకిందులు చేశాయి. డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాలు అందుకోవడం పక్కకుబెట్టి ఎక్కడో ఆగిపోయారు. దీంతో ఖజానాపై ఏటికేడు అప్పుల భారం పెరుగుతూనే వస్తోంది. ప్రస్తుతం బడ్జెట్ టార్గెట్‌తో చూస్తే ఫిస్కల్ డెఫిసిట్ 114.8 శాతంగా ఉంది. ఈ లెక్కన ఆర్థిక క్రమశిక్షణకు కట్టుబడాలంటే కేంద్రం తన ఖర్చుల్లో భారీగా కోతపెట్టుకోవాల్సి ఉంటుంది.

ఇలాంటి తరుణంలో మోడీ ఎలాంటి సాహసోపేతమైన బడ్జెట్‌ను ప్రకటిస్తారు,
రొటీన్‌కు భిన్నంగా ఎలాంటి భారీ ప్రకటనలను వెల్లడింపజేస్తారు అనే అంశంపైనే ఇప్పుడు అందరి ఆసక్తీ ఉంది.

Read more about: budget 2019 interim budget
English summary

రైతు బంధు పథకాన్ని దేశవ్యాప్తంగా ప్రవేశపెడితే ఎంత ఖర్చవుతుంది ? | Estimated Cost For Modi Rythu Bandhu Scheme

Indian Prime Minister Narendra Modi is going to launch the final weapon.
Story first published: Thursday, January 31, 2019, 20:05 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X