For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బినామీ ఆస్తులపై ఐటీ కొరడా.. 6,900 కోట్ల ప్రాపర్టీ జప్తు

|

ఢిల్లీ : బినామీ ఆస్తులపై కేంద్ర ప్రభుత్వం ఝలిపించిన కొరడా దెబ్బకు కొందరు విలవిల్లాడుతున్నారు. ఇప్పటికే అమల్లోకి వచ్చిన బినామీ చట్టం మంచి ఫలితాలను ఇస్తుండటం విశేషం. ఈ చట్టం మొదలైన నాటి నుంచి ఇప్పటిదాకా 6,900 కోట్ల విలువైన ఆస్తులు జప్తు చేసినట్లు ఐటీ శాఖ ప్రకటించింది. బినామీ ఆస్తులను ఎంకరేజ్ చేసేవారితో పాటు ఇతరుల ఆస్తులను తమ పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకునేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కొత్తగా అమల్లోకి వచ్చిన బినామీ చట్టం కింద గరిష్ఠంగా ఏడేళ్ల వరకు జైలుశిక్ష విధించనున్నారు. అంతేకాదు సదరు బినామీ ఆస్తిలో 25 శాతం ఫైన్ విధించాల్సి ఉంటుంది.

IT beat on benami assets, 6900 crores property seize

ఆస్తులు ఉండి కూడా పన్ను రిటర్న్స్ దాఖలు చేయనివారిపై దృష్టి సారించడం కోసమే కేంద్ర ప్రభుత్వం బినామీ చట్టాన్ని తెరపైకి తెచ్చింది. 2016, నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ చట్టం బినామీ ఆస్తులు కూడగట్టే వారి గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తోంది.

English summary

బినామీ ఆస్తులపై ఐటీ కొరడా.. 6,900 కోట్ల ప్రాపర్టీ జప్తు | IT beat on benami assets, 6900 crores property seize

IT beat on benami assets, 6900 crores property seize. Benami Act gave good results in findout the benami assets.
Story first published: Wednesday, January 30, 2019, 14:25 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X