For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇంటి పై సెల్ టవర్లున్న యాజమానులకు షాకింగ్ న్యూస్!

By girish
|

ఇంటిపై సెల్ టవర్ ఉన్నవారికి ఒక చేదు వార్త మోసుకొచ్చింది GHMC అది ఏంటో తెలుసా? ఇక నుంచి ఇంటి పై సెల్ సెల్ టవర్ ఉన్న వారికీ ఆస్తి పన్ను వసూలు చేయాలి అని నిర్ణయించింది.

ఈమేరకు GHMC హెడ్ ఆఫీస్ నుంచి ఆదేశాలు జారీ చేశారు అధికారులు.సర్కిల్ వారీగా ఉన్న సెల్ టవర్ అధికారులతో మెయిల్స్ పంపిన రెవిన్యూ అధికారులు వాటికీ ఆస్తి పన్ను మదింపు చేసి సంబంధిత ఏజెన్సీలకు డిమాండ్ నోటీసు ఇవ్వాలి అని నోటీసులతో తెలిపారు.

 ఇంటి పై సెల్ టవర్లున్న యాజమానులకు షాకింగ్ న్యూస్!

డిప్యూటీ మునిసిపల్ కమిషనర్లు, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్లు, వాల్యుయేషన్ ఆఫీసర్లు ఈ విషయంలో కీలకంగా వ్యవహరించాలి అని ఆదేశించారు. ఇక గ్రేటర్ లో అధికారక అనుమతి ఉన్న సెల్ టవర్లు 1800 వరకు ఉండగా 4000 పైగా సెల్ టవర్లు ఉన్నట్లు గతంలో నిర్వహించిన సర్వేలో గుర్తించారు.

జి.ఓ 96 ప్రకారం ముందు సెల్ టూర్లు ఏర్పాటు చేసుకొని అనుమతి తీసుకొనే వేసులుబాటు ఉన్న టెలికాం కంపెనీలు అక్రమంగా ఏర్పాటు చేస్తున్నాయి ఈ క్రమంలో భవనాల నిర్మాణ స్థిరత్వం స్థానికుల గోడు వారు పట్టించుకోలేదు అని చెబుతున్నారు అధికారులు.

ఈ మేరకు సెల్ టవర్ల నుంచి ఆస్తి పన్ను వసూలు చేయాలి అని నిర్ణయించిన్నట్లు GHMC చెబుతోంది. క్షత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహించి అనుమతి ఉన్న అక్రమంగా ఏర్పాటు చేసిన సెల్ టవర్ల పై పన్ను వేయనున్నారు.

ఇక అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన ఏజెన్సీలకు పన్ను పై ఫైన్ కూడా విదిస్తాము అని తెలిపారు. సంస్థ ఆర్ధిక వనరులు మెరుగుపర్చేందుకు GHMC కసరత్తు ప్రారంభించింది అని ఇందులో భాగంగా సెల్ టవర్ల పై ద్రుష్టి పెట్టాము అను చెప్పారు GHMC అధికారులు.

Read more about: income tax
English summary

ఇంటి పై సెల్ టవర్లున్న యాజమానులకు షాకింగ్ న్యూస్! | Income Tax on Cell Towers

A bitter news has come to people who have a cell tower on the house GHMC know what it is? Since then the house cell tower has decided to charge property taxes.
Story first published: Thursday, January 24, 2019, 14:53 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X