For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

'జగన్ అనే నేను' రైతులకు ఇస్తున్న భరోసా ఇదే?

వైయస్సార్ కాంగ్రెసు అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తన 13 నెలల పాటు ఆంధ్రప్రదేశ్ లో కొనసాగిన పాద యాత్ర ముగింపు సబ శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం పట్టణంలో పెద్ద ఎత్తున చేపట్టారు.

By bharath
|

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తన 13 నెలల పాటు ఆంధ్రప్రదేశ్ లో కొనసాగిన పాద యాత్ర ముగింపు సబ శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం పట్టణంలో పెద్ద ఎత్తున చేపట్టారు.

జగన్ పాదయాత్ర

జగన్ పాదయాత్ర

తన పార్టీ ప్రకారం, జగన్ 3,000 కి.మీ. మరియు 134 నియోజకవర్గాలను చుట్టేసింది, ఇది భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు చేయని పొడవైన పాదయాత్రగా పిలుస్తున్నారు. 'రావాలి జగన్' (కావాలి జగన్) అనే నినాదంతో వైయస్సార్ కాంగ్రెసు అధ్యక్షుడు 2 కోట్ల మందిని చేరుకున్నారు.

ప్రభుత్వం పై తీవ్ర వ్యాఖ్యలు

ప్రభుత్వం పై తీవ్ర వ్యాఖ్యలు

పాదయాత్ర సమయంలోమాట్లాడుతూ ప్రభుత్వం పై తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు.ప్రభుత్వం ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తోందని జన్మభూమి కమిటీల పేరిట భారీగా అక్రమాలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు.తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అవినీతి లేని పాలన అందిస్తానని ప్రజలకు తెలియజేసారు.

ఆంధ్రప్రదేశ్ రైతులకు

ఆంధ్రప్రదేశ్ రైతులకు

పాదయాత్ర ముగింపు సభలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రైతులకు సంబంధించి పలు ముఖ్యమైన వాగ్దానాలు చేసారు.చిన్న రైతులకు అధిక లబ్ది పొందేలా తమ ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందన్నారు.ఒక ఎకరా కు రూ.12,500 రూపాయల పెట్టుబడి సహాయం అందజేస్తామన్నారు.దీని వల్ల చిన్న రైతులకు తమ పంట పెట్టుబడికి సంబంధించి ఖర్చు సుమారు 70 నుండి 80 శతం తగ్గుతుందని అన్నారు.

ఉచిత బోర్లు:

ఉచిత బోర్లు:

రైతులకు జగన్ అందిస్తున్న మరో అబ్భుత వరం ఉచిత బోర్లు.దీని పై జగన్ మాట్లాడుతూ రాష్ట్రము లో అనేక మంది రైతులు ప్రతి ఏటా కొన్ని వేల బోర్లు వేసి నష్టపోతున్నారు అని వెల్లడించారు.వేసిన బోర్లలో నీళ్లు పడక ఒకవేళ నీళ్లు పడిన కొన్ని రోజులకే ఎండిపోవడం చూస్తున్నాం అని అన్నారు అందువల్ల రైతులు తీవ్రంగా నష్టపోతూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వీటిని నివారించడానికే తాము ఈ ఉచిత బోర్లు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

రైతులకు ఉచిత భీమా:

రైతులకు ఉచిత భీమా:

జగన్ తన ప్రసంగంలో మాట్లాడుతూ రైతులకు భీమా పథకం కూడా ప్రవేశపెట్టాడు.ప్రస్తుతం ఉన్న రోజుల్లో రైతులకు తమ పంట పై అనుకోని విపత్తు సంభవించి పంట పూర్తిగా నష్టపోతే భీమా వస్తుందో రాదో అనే ఆందోళన చెందుతున్నారని నొక వేల వస్తే ఎపుడు వస్తుందో కూడా తెలియని అయోమయ పరిస్థితుల్లో ఉన్నారని తెలిపారు.అలంటి ప్రతి రైతులకు భీమా చెల్లించే బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని వెల్లడించారు.

ఆక్వా రైతులకు:

ఆక్వా రైతులకు:

అదేవిదంగా ఆక్వా రైతులను ఆదేశించి మాట్లాడుతూ వారికి కరెంటు రేటుకేవలం రూ.1.50 రూపాయలకే ఇస్తామని హామీ ఇచ్చారు.వీటి వల్ల రైతులకు పెట్టుబడి ఖర్చు బాగా తగ్గుతుందని తద్వారా మంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుందని అన్నారు.

Read more about: ys jagan farmers ap
English summary

'జగన్ అనే నేను' రైతులకు ఇస్తున్న భరోసా ఇదే? | YS Jagan Bumper Offer To AP Farmers in Ichchapuram Meeting

Hyderabad: YSR Congress chief Jagan Mohan Reddy will end his three-month-long padyatra in Andhra Pradesh on Wednesday with grand celebrations planned in the state’s Ichchapuram town in Srikakulam district.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X