For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్యాంకులు బంద్ కానీ ఏటీఎంలో డబ్బు పరిస్థితి ఏంటి?

By girish
|

గత మూడు రోజుల నుంచి బ్యాంకు సేవలు పని చేయడం లేదు దింతో పట్టణాలలో మరియు పల్లెటూరిలో ప్రజలు చాలా కష్టపడుతున్నారు. గత రెండు సంవత్సరాల క్రితం పెద్ద నోట్లు రద్దు తర్వాత ప్రజలు కష్టాలు పడ్డారు.

 బ్యాంకు:

బ్యాంకు:

వరసగా రెండు, మూడు రోజులకు బ్యాంక్ లకు సెలవలు వస్తేచాలు ఏటీఎంలలో కూడా డబ్బులు దొరకక ఇబ్బంది పడాల్సి వస్తోంది. ప్రస్తుతం క్రిస్మస్, న్యూ ఇయర్ సెలవలు వరసగా వచ్చాయి. దీనికి తోడు బ్యాంకు ఉద్యోగులు కూడా సమ్మె మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో నగదు కొరత ఏర్పడుతుందేమోననే భయం నగరవాసులకు పట్టుకుంది. కాగా దీనిపై సంబంధిత అధికారులు తాజాగా వివరణ ఇచ్చారు.

ఏటీఎంలలో:

ఏటీఎంలలో:

వరుస సెలవులు, బ్యాంకు ఉద్యోగుల సమ్మె వల్ల నగదు కొరత ఏర్పడకుండా ఖాతాదారుల కోసం ఏటీఎంలలో డబ్బులు పెట్టినట్లు బ్యాంకు ఉన్నతాధికారులు ప్రకటించారు. హైదరాబాద్ నగరంలో 3,969 ఏటీఎంలుండగా వీటిలో 85 శాతం ఏటీఎంలలో నగదు ఉంచామని అధికారులు చెప్పారు.

హైదరాబాద్:

హైదరాబాద్:

హైదరాబాద్ నగరంతోపాటు గ్రామాలు, పట్టణప్రాంతాల్లోని ఏటీఎంలలోనూ నగదు కొరత ఏర్పడకుండా చర్యలు తీసుకున్నామని అధికారులు వివరించారు. వరుస సెలవులతో పాటు బ్యాంకు ఆఫ్ బరోడా, విజయాబ్యాంకు, దేనాబ్యాంకుల విలీనానికి వ్యతిరేకంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగారు.

 క్రిస్మస్:

క్రిస్మస్:

దీంతోపాటు క్రిస్మస్, ఇతర సెలవులతో ఖాతాదారులకు నగదు కొరత ఏర్పడకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఏటీఎంలలో నగదును నింపామని వివిధ బ్యాంకుల ఉన్నతాధికారులు వివరించారు.

Read more about: bajaj
English summary

బ్యాంకులు బంద్ కానీ ఏటీఎంలో డబ్బు పరిస్థితి ఏంటి? | Bank Bandh Today

The banking services have not been working since last three days. People in the towns and towns are struggling to work. People have been struggling after abolishing big banknotes two years ago.
Story first published: Wednesday, December 26, 2018, 11:32 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X