For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వీసా విషయంలో కొత్త రూల్ మనవాళ్ళకి పెద్ద దెబ్బ...

By girish
|

అవకాశాల స్వర్గదామంగా పేరొందిన అమెరికాలో మన దేశానికి చెందిన టెకీలకు షాకిచ్చేలా పరిణామాలు మారుతున్నాయి. హెచ్-1బీ వీసా నిబంధనలు మరింత సంక్లిష్టం చేసే పనిలో భాగంగా ట్రంప్ సర్కార్ మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ ఏడాది హెచ్-1బీ వీసాలకు గానూ వచ్చిన దరఖాస్తుల్లో అత్యంత ప్రతిభావంతులకు మాత్రమే ఈ వీసాలు జారీ చేస్తామని హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ ప్రతినిధులు స్పష్టం చేశారు. స్థానికులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు.

వీసా విషయంలో కొత్త రూల్ మనవాళ్ళకి పెద్ద దెబ్బ...

హోమ్ల్యాండ్ సెక్యూరిటీ సెక్రెటరీ క్రిస్టెన్ నీల్సన్ మాట్లాడుతూ..'ప్రతి ఏడాదీ హెచ్-1బీ వీసా దరఖాస్తుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. వచ్చిన దరఖాస్తుల్లో అత్యంత ప్రతిభావంతులను మాత్రమే తీసుకుంటే కంపెనీలకు మేలు జరుగుతుంది. పనిలో నాణ్యత పెరుగుతుంది. అంతేకాకుండా అమెరికా పౌరులకు సైతం ఇక్కడే ఉద్యోగాలు చేసుకునే అవకాశం కలుగుతుంది. స్థానిక నియామకాలు మరింత పెంచాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం' అని తెలిపారు.

2018-19 సీజన్ కు గానూ అమెరికా ఏజెన్సీకి 1.9 లక్షల వీసా దరఖాస్తులు వచ్చాయి. వీరిలో భారతీయులే 60 శాతానికి పైగా ఉండటం గమనార్హం. కాగ్నిజెంట్ - టీసీఎస్ - ఇన్ఫోసిస్ - విప్రో లాంటి ఐటీ కంపెనీలు ఎక్కువగా భారతీయ ఐటీ నిపుణులకు హెచ్ 1బీ వీసా ద్వారా ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. నూతన విధానం వల్ల అమెరికన్లకు మేలు చేసేలా ఉన్నప్పటికీ.. అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే భారతీయులకు షాక్ వంటిదే.

Read more about: visa
English summary

వీసా విషయంలో కొత్త రూల్ మనవాళ్ళకి పెద్ద దెబ్బ... | H1B Visa New Rule

The possibilities of changing the texts of our country in the United States, which are known as heavenly possibilities, are changing. More on H-1B visa regulations
Story first published: Saturday, December 22, 2018, 12:43 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X