For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎలక్ట్రికల్ ఉపకరణాలను కొంటే ఈనెలలోనే కొనండి లేదంటే దరల మోత మోగనుంది?

మీరు ఎలక్ట్రికల్ ఉపకరణాలను కొనుగోలు చేయాలనుకుంటే,ఈ నెలలోనే చేయండి లేదంటే రానున్న నూతన సంవత్సర నెలలో ధరలు పెరగనున్నాయి.

By bharath
|

మీరు ఎలక్ట్రికల్ ఉపకరణాలను కొనుగోలు చేయాలనుకుంటే,ఈ నెలలోనే చేయండి లేదంటే రానున్న నూతన సంవత్సర నెలలో ధరలు పెరగనున్నాయి.వైట్ వస్తువుల తయారీదారులు జనవరి నుంచి ఉత్పత్తుల ధరలు మరోసారి పెంచే యోచనలో ఉన్నారు.

ఇన్పుట్ ధరల పెరుగుదల

ఇన్పుట్ ధరల పెరుగుదల

ఇన్పుట్ ధరల పెరుగుదల కారణంగా వచ్చే ఏడాది నుండి కంపెనీలు 7-10 శాతం టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఎయిర్ కండీషనర్ల ధరలను పెంచుతున్నాయని విశ్లేషకులు అంచనావేశారు.యిర్ కండీషనర్ల పై భారీగా పెరిగే అవకాశం ఉంది.

రూపాయి క్షిణించడం

రూపాయి క్షిణించడం

ఉపకరణాల తయారీదారులు పెరుగుతున్న ఉత్పాదన వ్యయం నుండి ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇది డాలర్ పై రూపాయి క్షిణించడం, అధిక పన్నుల ధరలు, అలాగే ఇంధన ధరలు ఎక్కువగా ఉంటున్న కారణంగా ఇది సంభవించింది.

రవాణా వ్యయం

రవాణా వ్యయం

వినియోగదారులు గుర్తింపు పొందిన కంపెనీల నుండి కొనే వస్తువులపై మొత్తం వ్యయాలలో 10-15 శాతం సరకు రవాణా వ్యయం అవుతుంది. చమురు ధరలు పెరగడం వల్ల రవాణా ఖర్చులు పెరగడానికి దారితీసింది.

ఏడాది ముగిసే వరకూ తాము ధరలను నియంత్రించగలమన్నారు. జనవరి 1 నుండి, తక్కువ ధరల వద్ద తాము ఉత్పత్తులను అందించలేము అని ప్రపంచ పరికర తయారీ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు. డిసెంబరు చివరి నాటికి ఈ పరిశ్రమ ఇప్పటికే ఉన్న జాబితాను మినహాయించాలని భావిస్తోంది.

ఎసి ధరలు అతిపెద్ద ధరల పెరుగుదలను చూడవచ్చు:

ఎసి ధరలు అతిపెద్ద ధరల పెరుగుదలను చూడవచ్చు:

వివిధ ఉత్పత్తి వర్గాలలో, AC ధరలు 2019 నుండి గరిష్ట పెరుగుదల చూడవచ్చని భావిస్తున్నారు.

జిఎస్టి కౌన్సిల్ కూడా గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జిఎస్టి) ను 28 శాతం వద్ద నిర్వహించింది. టీవీలు (27 అంగుళాల వరకు), రిఫ్రిజిరేటర్లు, ఆహార ప్రాసెసర్లు, వాషింగ్ మెషీన్ల పై 18 శాతం వరకు తగ్గాయి మరియు ఎసి కూడా 18 శాతానికి తగ్గించాలని చర్చలు జరుగుతున్నాయి కానీ ఇంకా నిర్ణయం బహిర్గతం కాలేదు.

కస్టమ్స్ సుంకం ప్రభావం

కస్టమ్స్ సుంకం ప్రభావం

సెప్టెంబర్ లో, ఎయిర్ కండీషనర్, వాషింగ్ మెషీన్లు (10 కిలోల వరకు) మరియు రిఫ్రిజిరేటర్లు వంటి కొన్ని ఉత్పత్తి వర్గాలకు కస్టమ్స్ సుంకం 20 శాతం పెంచారు. ఆ సమయంలో పండుగ సీజన్ ప్రారంభమైన కారణంగా, సంస్థలు ధరలను పెంచలేదు.

దీపావళి వరకు ధరలను నొక్కిపెట్టి ఆపై రేట్లు పెంచాలి అని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఫెస్టివల్ అమ్మకాలు అంచనా వేసిందానికంటే తక్కువగా జరిగాయి,అందుకే 2019 కి ధరల పెరుగుదల వాయిదా వేయాలని తాము నిర్ణయించుకున్నాము అని మిడ్-సైజ్డ్ ఉపకరణాల తయారీ అధ్యక్షుడు (అమ్మకాలు) అన్నారు.

Read more about: gst ac electronics companies
English summary

ఎలక్ట్రికల్ ఉపకరణాలను కొంటే ఈనెలలోనే కొనండి లేదంటే దరల మోత మోగనుంది? | Buy Your Appliances Before January 1, Prices Set To Rise By 7-10%

If you are planning to purchase electrical appliances, you should do so before the New Year. White goods makers will be initiating another price hike for products from January onwards.
Story first published: Thursday, December 6, 2018, 10:56 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X