For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టాప్ 5 బ్యాంకింగ్ యాప్స్ ఇవే మీ ఫోన్లో ఉన్నాయా?

By girish
|

మొబైల్ బ్యాంకింగ్ రాకతో దేశంలో బ్యాంకింగ్‌కు సంబంధించిన పనులు త్వరతిగతిన అవుతున్నాయి. ముఖ్యంగా ఎప్పుడైనా, ఎక్కడైనా బ్యాంకింగ్ సేవలు పొందడం సాధ్యపడుతోంది. దీని వల్ల బ్యాంకింగ్ లావాదేవీలు సలభతరం అవడంతో పాటు సమయం కూడా ఆదా అవుతుంది. బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఖాతాల మధ్య నగదును బదిలీ చేసుకోవచ్చు. నగదు డిపాజిట్ అయ్యిందా లేదా చూసుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే, మీకు బ్యాంకులో ఏయే సేవలు లభిస్తాయో దాదాపు వాటన్నింటినీ మొబైల్ బ్యాంకింగ్ ద్వారా పొందవచ్చు. ఇటీవల కాలంలో మొబైల్ బ్యాంకింగ్ యాప్స్ వినియోగం బాగా పెరుగుతుంది. లావాదేవీలు సురక్షితంగా ఉండేందుకు బ్యాంకులు మొబైల్ యాప్స్‌ను అందిస్తున్నాయి. భారతదేశంలో మొబైల్ బ్యాంకింగ్ యాప్స్‌ని అందిస్తున్న బ్యాంకుల వివరాలు తెలుసుకుందాం.

స్టేట్ బ్యాంక్ ఫ్రీడమ్ మొబైల్ యాప్:

స్టేట్ బ్యాంక్ ఫ్రీడమ్ మొబైల్ యాప్:

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన మొబైల్ యాప్ 'స్టేట్ బ్యాంక్ ఫ్రీడమ్'. ఈ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకుని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతా లావాదేవీలను నిర్వహించవచ్చు. ఇందు కోసం మీరు రిజిస్టర్ కావాల్సి ఉంది. రిజిస్టర్ అనంతరం నగదు బదిలీ, చెక్ బుక్ రిక్వెస్ట్, ఆన్‌లైన్ బిల్లులు లాంటివి చెల్లించవచ్చు

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్:

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్:

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తన మొబైల్ అప్లికేషన్‌ను విడుదల చేసింది. మై మెను ఫీచర్‌ను ప్రవేశపెట్టిన మొట్ట మొదటి బ్యాంకు ఇదే కావడం విశేషం. ఈ ఫీచర్ సాయంతో 10 లావాదేవీలను వినియోగించుకోవచ్చు.

ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి ఐమొబైల్ :

ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి ఐమొబైల్ :

ఐసీఐసీఐ బ్యాంక్‌ నూతనంగా నాలుగు మొబైల్‌ యాప్‌‌సను ఆవిష్కరించింది. వాటిల్లో ముఖ్యమైంది ఐమొబైల్ యాప్. దీంతో పాటు ఎన్‌ఆర్‌ఐల కోసం ప్రత్యేకంగా వీడియో బ్యాంకింగ్‌ను ప్రవేశపెట్టింది. గ్రూప్‌కు సంబంధించిన అన్ని యాప్‌‌సను ఒకే చోట చేరుస్తూ ఐసీఐసీఐ స్టోర్‌ను కూడా ఆవిష్కరించింది. ఈ యాప్‌‌‌తో ఖాతాదారులు బ్యాంకు శాఖకు వెళ్ళకుండానే తమ కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు. వీడియో కాల్‌ ద్వారా సర్వీస్‌ ఎగ్జిక్యూటివ్‌తో సంభాషిస్తూనే, తమ మొబైల్‌ ఫోన్‌పై గత 30 రోజుల్లో చేసిన లావాదేవీలను తెలుసుకోవచ్చు. గూగుల్‌ ప్లే స్టోర్‌లో కూడా ఈ యాప్‌‌స లభ్యమవుతాయి. నూతనంగా ఆవిష్కరించిన వాటిలో ఐసీఐసీఐ స్టోర్‌, ఇన్‌స్టా బ్యాంకింగ్‌, వీడియో బ్యాంకింగ్‌, ఎంపాస్‌బుక్‌ ఉన్నాయి.

ఐడీబీఐ మొబైల్ బ్యాంకింగ్ యాప్:

ఐడీబీఐ మొబైల్ బ్యాంకింగ్ యాప్:

ఐడీబీఐ బ్యాంక్ మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్‌ను ప్రారంభించింది. దీన్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ ద్వారా నిధుల బదిలీ, బిల్లుల చెల్లింపులు, మొబైల్ రీచార్జ్, లోన్లు, డిమ్యాట్, కరెంట్, రికరింగ్ డిపాజిట్లు వివరాలు తదితర సేవలును పొందవచ్చు.

న్యూ యాక్సెస్ మొబైల్ యాప్:

న్యూ యాక్సెస్ మొబైల్ యాప్:

యాక్సెస్ బ్యాంక్ రూపొందించిన ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ ద్వారా నిధుల బదిలీ, బిల్లుల చెల్లింపులు, మొబైల్ రీచార్జ్, లోన్లు, డిమ్యాట్, కరెంట్, రికరింగ్ డిపాజిట్లు వివరాలు తదితర సేవలును పొందవచ్చు.

Read more about: bajaj
English summary

టాప్ 5 బ్యాంకింగ్ యాప్స్ ఇవే మీ ఫోన్లో ఉన్నాయా? | Top 5 Banking Apps in India

With the advent of mobile banking, banking activities in the country are going up. Especially, it is possible to get banking services anywhere.
Story first published: Saturday, December 1, 2018, 11:42 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X