For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిరవ్ మోడీ ఆస్తులు పెద్ద మొత్తం లో జప్తు చేసిన ED?

నిరవ్ మోడీపై నమోదైన నగదు బదిలీ కేసులో హొంగ్ కాంగ్ లో 34.97 మిలియన్ డాలర్లు (రూ.225 కోట్ల) రూపాయల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్వాధీనం చేసుకుంది.

By bharath
|

నిరవ్ మోడీపై నమోదైన నగదు బదిలీ కేసులో హొంగ్ కాంగ్ లో 34.97 మిలియన్ డాలర్లు (రూ.225 కోట్ల) రూపాయల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్వాధీనం చేసుకుంది.దీంతో నీరవ్‌ మోదీ, ఆయన మేనమామ మెహుల్‌ ఛోక్సీకి సంబంధించి ఈడీ జప్తు చేసిన మొత్తం ఆస్తుల విలువ రూ.4,744 కోట్లకు చేరింది.

నిరవ్ మోడీ ఆస్తులు పెద్ద మొత్తం లో జప్తు చేసిన ED?

మోడీ మరియు అతని మామయ్య మెహల్ చోక్సి పంజాబ్ నేషనల్ బ్యాంక్ను 13,000 కోట్ల రూపాయలకు పైగా నష్టపరిచారని ఆరోపించారు. ఈ నెలలో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రూ .637 కోట్ల విలువైన ఆస్తులు, భారతదేశంలో అతని కుటుంబం, మరో నాలుగు ఇతర దేశాలలో ఉన్న ఆస్తులను జప్తు చేసారు.

విచారణ సమయంలో, నిరవ్ మోడీ కంపెనీలకు సంబందించిన కొన్ని విలువైన వస్తువులు హాంకాంగ్ ఆధారిత లాజిస్టిక్స్ కంపెనీ ఆధ్వర్యంలో ఉన్నాయి అని కనుగొన్నారు.పూర్తి విచారణ చేసిన తరువాత విలువలు, సరుకు రవాణా, ఎగుమతి చేసినవి,ఈ వస్తువులకు సంబందించిన యాజమాన్యం మరియు విలువ యొక్క రుజువులు దొరికిన తరువాత అవి కూడా జత చేస్తామని ED తెలిపింది.

గతంలో, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంపై దర్యాప్తు జరిపిన ED, నిరవ్ మోడీ విదేశీ ఆస్తులను స్వాధీనం చేసుకుంది. హాంకాంగ్లో రూ. 22 కోట్ల విలువైన వజ్రాల ఆభరణాలు,US లో రూ. 216 కోట్ల విలువైన రెండు అపార్ట్మెంట్లు, లండన్ లో ఉన్న అపార్ట్మెంట్ విలువ రూ. 58 కోట్లు, ఆరు బ్యాంకు ఖాతాల నుండి 322 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకుంది.

దక్షిణ ముంబయిలోని ఒక బ్రాంచీలో 11,380 కోట్ల రూపాయల విలువైన మోసపూరిత, అనధికార లావాదేవీలను కనుగొన్నట్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్ బిఎస్ఇకి తెలియగానే ఫిబ్రవరిలో ఈ మోసం వెలుగులోకి వచ్చింది.

నిరవ్ మోడి, అతని సహచరులతో పాటు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ను మోసగించినట్లు ఆరోపణలు వచ్చాయి, కొందరు బ్యాంకు అధికారులు కూడా ఈ కుంభకోణంలో పాలు పంచుకున్నట్టు అభియోగాలు ఉన్నాయి.

తాజాగా జత చేసిన ఆస్తులతో కలిపి చూస్తే మొత్తం విలువ ఇంతవరకు రూ .4,744 కోట్లకు చేరింది.

Read more about: pnb nirav modi bank fraud
English summary

నిరవ్ మోడీ ఆస్తులు పెద్ద మొత్తం లో జప్తు చేసిన ED? | ED Attaches Nirav Modi's Assets Worth Rs 255 Crore In Hong Kong

The Enforcement Directorate provisionally attached assets worth $34.97 million (Rs 225 crore) in Hong Kong under the money laundering case registered against Nirav Modi.
Story first published: Thursday, October 25, 2018, 16:19 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X