For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతి లో హోటళ్ల బాగోతం చూడండి.తస్మాత్ జాగ్రత్త?

ప్రపంచ ప్రఖ్యాతి పొందిన పుణ్యక్షేత్రం తిరుపతి కి ప్రతిరోజు అనేక ప్రాంతాలనుండి కొన్ని లక్షల మంది భక్తులు వెంకన్న దర్శనం కోసం వస్తుంటారు.

By bharath
|

ప్రపంచ ప్రఖ్యాతి పొందిన పుణ్యక్షేత్రం తిరుపతి కి ప్రతిరోజు అనేక ప్రాంతాలనుండి కొన్ని లక్షల మంది భక్తులు వెంకన్న దర్శనం కోసం వస్తుంటారు.కలియుగ దైవం అని పిలువబడే వెంకటేశ్వర స్వామి క్షణ దర్శనం కోసం అనేకమంది కాలినడకన కూడా వస్తుంటారు.భక్తుల సౌకర్యాణార్థం టిటిడి అనేక కార్యక్రమాలు తరచూ చేపడుతూనే ఉంటారు.ఐతే నిత్యం భక్తుల రద్దీ తో ఎల్లపుడు కిటకిట లాడుతున్న తిరుపతిలో అనేక హోటళ్లు మరియు రెస్టారెంట్లు వెలిశాయి.

ఆహార నాణ్యత:

ఆహార నాణ్యత:

ప్రతిరోజు కొన్ని లక్షల మంది తరచూ వెంకన్న దర్శనానికి వస్తుంటారు.సుదూర ప్రాంతాలనుండి వస్తున్న ప్రజల ఆరోగ్యాలతో హోటళ్లు చెలగాటమాడుతున్నాయి.కనీస ఆహార నాణ్యత పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు.దర్శనానికి వెళ్తున్న ప్రజలు అనారోగ్య బారిన పడుతున్నారు.

కల్తీ నూనెలు:

కల్తీ నూనెలు:

హోటళ్ల ముసుగులో కల్తీ నూనెలు రాజ్యమేలుతున్నాయి,కనీస నాణ్యత లేని నూనెలు అలాగే చెడిపోయిన నూనెలు వంటల తయారీలో విపరీతంగా వాడేస్తున్నారు.అలాగే, చూడగానే కంటికి ఇట్టే ఆకట్టుకునేలా రంగులు కలిపిన పదార్థాలు ప్రజలు ఎంతో ఇష్టం తో తినడం వల్ల రోగాలను కొని తెచ్చుకుంటున్నారు.

భోజనం ఖరీదు:

భోజనం ఖరీదు:

మనం బయట హోటళ్లలో భోజనం చేసినపుడు మహా ఐతే రూ.40 నుండి రూ.60 రూపాయలు ఒక ప్లేటుకు చెల్లిస్తాం, నాణ్యత అలాగే రుచి గల భోజనం లభిస్తుంది.కానీ ఈ హోటళ్లలో మాత్రం నాణ్యత మరియు రుచి అసలు ఉండదు కానీ దార మాత్రం రూ.100 రూపాయలదాకా ఒక ప్లాటుకు షిల్లించాల్సి ఉంది.ఉదయం ఆహారం ప్రతి ప్లేటు రూ.50 రూపాయల పైమాటే,ఈ ధరలు చిన్న హోటళ్లలో మాత్రమే ఇంక పెద్ద హోటళ్లలో ధరలు చెప్పనవసరం లేదు.

ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు:

ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు:

కొన్ని వందల ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు తిరుపతిలో ఉన్నాయి,వీరు ఇష్టారాజ్యంగా ప్రజలను దోచుకుంటున్నారు,24 గంటలు ఆహారం లభించును అని బోర్డులు పెట్టి పగలు రాత్రి తేడాలేకుండా నాణ్యత లేని మరియు కల్తీ నూనెలు వాడి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు.రెండు మూడు రోజుల క్రితం వండిన ఆహారాన్ని సైతం ప్రజలకు అందిస్తున్నారు.వీటిలో వాడే నూనె నెలల తరబడి ఓకే నూనెను వాడుతూ ఉంటారు చెడిపోయిన నూనెను మార్చకుండా అందులోకే కాస్త కొత్త నూనెను కలిపి వాడేస్తున్నారు.

ఒక రోజు హోటల్లో బస:

ఒక రోజు హోటల్లో బస:

తిరుపతిలో చిన్న మరియు పెద్ద హోటళ్లు మొత్తం కలుపుకొని సుమారు 500 దాక వెలిసాయి,వీటిలో రూ.1000 రూపాయల అద్దె నుండి రూ.15 వేల రూపాయల వరకు ఉన్నాయి.కొన్ని చిన్న హోటళ్లు మురికి కూపాల్లా ఉంటాయి కనీస శుభ్రత కూడా పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.

యాజమాన్యం తీరు:

యాజమాన్యం తీరు:

ఇక్కడ వ్యాపారం ఒక దందా లాగా కొనసాగుతోంది,తిరుపతికి ప్రతి రోజు అనేకప్రాంతాల నుండి ప్రజలు వస్తుంటారు,ఒకరోజు భోజనం చేసిన వ్యక్తి మరుసటి రోజు తన స్వస్థలానికి వెళ్లిపోతారు మరియు ప్రశ్నించే అవకాశం ఉండదని ఎలాపడితే అలా వ్యవహరిస్తున్నారు.ఇదేమిటి అని ప్రశ్నించిన వారిపై కొన్ని సందర్భాల్లో దాడులు సైతం చేసిన ఘటనలు ఉన్నాయి.ఒకవేళ అధికారులకు ఫిరియాదు చేసిన సరిగ్గా స్పందించారు.

ఆహార భద్రత అధికారులు:

ఆహార భద్రత అధికారులు:

ఆహార భద్రత అధికారులు తనిఖీలకు వచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి.కానీ వారు తనిఖీ చేసి ఆహార నమూనాలను సేకరించి హైదరాబాద్ లో ఉన్న ల్యాబుకు తరలిస్తున్నారు కానీ అవి ల్యాబుకే పరిమితమవుతున్నాయి.వాటిని పరిశీలించేలోపు అధికారులకు ముడుపులు అందుతున్నాయి.

టిటిడి యాజమాన్యం:

టిటిడి యాజమాన్యం:

టిటిడి యాజమాన్యం కూడా ఈ విషయాన్నీ గాలికి వదిలేసింది ఇందులో పెద్ద వారి ప్రమేయం ఉన్నందున అధికారులు కూడా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు.పుణ్యం కోసం ప్రజలు అనేక ప్రాంతాల నుండి వస్తుంటే ఇక్కడ హోటళ్ల నిర్వాకం వల్ల పుణ్యం కథ దేవుడెరుగు రోగాల బారిన పడకుండా ఉంటే చాలు దేవుడా అని ప్రతి ఒక్కరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అప్రమత్తం:

అప్రమత్తం:

ప్రజలు ఇటువంటి ఆహారాలపై అప్రమత్తం గా ఉంటే మంచిది.రంగు రంగుల ఆహార పదార్థాలు చూసి ఇస్తాను సారంగా తినకండి.మీరు తినే ఆహరం అలాగే హోటళ్లు కాస్త పరిశీలించి తినడం మీ ఆరోగ్యానికి శ్రేయస్సు కరం.

Read more about: tirupati food hotels
English summary

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతి లో హోటళ్ల బాగోతం చూడండి.తస్మాత్ జాగ్రత్త? | Be Careful About Hotels In Tirupati

For millions of people coming from different parts of the world every day, Tirupati is the world's most famous pilgrimage. Venkateshwara Swamy, also known as Kaliyuga God.
Story first published: Monday, October 22, 2018, 13:32 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X