For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇదే కారణం హైదరాబాద్ బెస్ట్ అనడానికి ఈ కారణం ఏంటో చూడండి.

By girish
|

హైదరాబాద్‌ అన్ని రంగాల్లో దూసుకెళ్తున్న నగరం. అందరికీ చేరువైన ప్రాంతం. సకల సదుపా యాలకూ నిలయం. అందుకే మన భాగ్యనగరం ఖ్యాతి విశ్వవ్యాప్తమవుతున్నది. దేశ, విదేశీయులను అమి తంగా ఆకట్టుకుంటున్నది. తాజాగా విడుదలైన ఓ అధ్యయనంలో రాష్ట్ర రాజధాని తన సత్తాను చాటింది.

 టెక్నాలజీ రంగం

టెక్నాలజీ రంగం

నిర్మాణ రంగ సేవలు, పెట్టుబడుల నిర్వహణ సంస్థయైన కొల్లియర్స్‌ ఇంటర్నేషనల్‌ ఆసియాలో అత్యంత అనువైన ప్రాంతాలు, టెక్నాలజీ రంగం పేరిట రూపొందించిన పరిశోధన నివేది కను బుధవారం విడుదల చేసింది.

 టెక్కీలు

టెక్కీలు

సామాజిక, ఆర్థిక, ఆస్తులు, మానవీయ కారణాలు అనే అంశాల ప్రాతి పదికన దీన్ని తయారు చేసింది. ఇందులో టెక్నాలజీ సంస్థలు తమ కార్యకలాపాల ప్రారంభానికి, విస్తరణకు హైదరాబాద్‌నే ఎక్కువగా ఎంచుకుంటున్నాయని తేలింది. దేశంలో బెంగళూరు తర్వాత హైదరాబాద్‌పైనే టెక్కీలు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు.

 బెంగళూరు

బెంగళూరు

ఆసియా దేశాల్లోని మొత్తం 16 మహా నగరాలతో ఈ నివేదిక రూపొందగా, బెంగళూరు తొలి స్థానంలో నిలిచింది. హైదరాబాద్‌కు 7వ స్థానం దక్కగా, ముంబై 10, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ 11వ స్థానాల్లో ఉన్నాయి. సిలికాన్‌ వ్యాలీ ఆఫ్‌ ఇండియాగా ప్రాచుర్యం కలిగిన బెంగళూరు ఐటీ నైపుణ్యం, సామాజిక, ఆర్థికపరమైన అంశాల్లో బలంగా ఉందని కొల్లియర్స్‌ అభిప్రాయపడింది

2022 నాటికి

2022 నాటికి

గడిచిన మూడేళ్లకుపైగా కాలంలో సగటున ఏటా 4 బిలియన్‌ డాలర్ల స్టార్టప్‌ పెట్టుబడులను బెంగళూరు అందుకున్న దంటూ 2022 నాటికి ఆసియాలో అత్యంత వృద్ధి దాయక నగరంగా ఉంటుందన్నది. ఇక జాబితాలో సింగపూర్‌ రెండో స్థానంలో, షెన్జెన్‌ (చైనా) మూడో స్థానంలో ఉండగా, బీజింగ్‌, హాంకాంగ్‌, టోక్యో, తైపీ తదితర నగరాలకూ చోటు లభించింది.

 హైదరాబాద్‌కు

హైదరాబాద్‌కు

అన్ని నగరాల కంటే ఎక్కువగా బెంగళూరుకు 67.9 శాతం మార్కులు పడ్డాయి. సింగపూర్‌కు 62.6 శాతం, షెన్జెన్‌కు 60.9 శాతం ఓటింగ్‌ రాగా, హైదరాబాద్‌కు 59.3 శాతం పోలైయ్యాయి. 60 నుంచి 50 శాతం మధ్య స్కోర్లను మిగతా నగరాలు అందుకున్నాయి.

ఖర్చు తక్కువ ఆదాయం ఎక్కువ

ఖర్చు తక్కువ ఆదాయం ఎక్కువ

దేశంలోనే ధనిక రాష్ట్రంగా పేరున్నా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షించేందుకు అవలంభిం చిన విధానాలు తెలంగాణ ప్రగతిని పరుగులు పెట్టిం చాయి. పన్నుల్ని తగ్గించడంతోపాటు జీవన వ్యయాన్ని అదుపులో పెట్టడంతో ఐటీ రంగం హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున విస్తరించింది. కావాల్సినన్ని భూ వనరులకుతోడు, రోడ్డు, విమాన, రైలు రవాణా వ్యవస్థలు ప్రభావవంతంగా ఉండటం, మెరుగైన ఔటర్‌ రింగ్‌ రోడ్డు సౌకర్యాలు నగరం రూపురేఖల్నే మార్చేశాయి. మానవీయ కారణాల్లో దేశంలోని ఇతర నగరాల కంటే హైదరాబాద్‌ రేటింగ్‌ ఎంతోబాగుంది.

తాజా సర్వే

తాజా సర్వే

తాజా సర్వే ఇక్కడ పన్ను రేట్లు, జీవన వ్యయం కూడా చాలా తక్కువని స్పష్టం చేసింది. దీంతో టెక్నాలజీ రంగ సంస్థలు హైదరాబాద్‌ కేంద్రంగా తమ కార్యకలాపాలను దేశ వ్యాప్తంగా విస్తరించేందుకు ముందుకొస్తున్నాయి. ఫలి తంగా ఆఫీస్‌ మార్కెట్‌ బలపడి రియల్‌ ఎస్టేట్‌ రంగం జోరందుకున్నది. ఈ పరిణామం హైదరాబాద్‌ శివారు ప్రాంతాల అభివృద్ధికి దోహద పడటమేగాక వరంగల్‌, కరీంనగర్‌ వంటి పొరుగు జిల్లాలనూ ఐటీ-హబ్‌లుగా తీర్చిదిద్దేందుకు గొప్ప అవకాశాన్ని కల్పించింది.

Read more about: income
English summary

ఇదే కారణం హైదరాబాద్ బెస్ట్ అనడానికి ఈ కారణం ఏంటో చూడండి. | Hyderabad Life Style and Income

Hyderabad is one of the most prolific cities in the world. It's a place that's all right. All the time is good. That is why our part of the world is fame. The country and foreigners are impressive. In a recent release, the state capital has shown its own capabilities.
Story first published: Saturday, September 22, 2018, 12:58 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X