For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆడవారి కన్నా మగవారు ఫస్ట్ ఎందులోనో తెలుసా?

By girish
|

ఆడవారు అలంకార ప్రియులని ఇందుకోసం వారు ఎక్కువగా షాపింగ్‌ అంటే ఇష్టపడుతుంటారని అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. కానీ ఇటీవల అబ్బాయిల్లోనూ అందం గురించి శ్రద్ద పెరిగిపోతోంది.

మింత్రా

మింత్రా

అందరిలోనూ తము అందంగా ఉండాలన్న కాంక్ష వారిలోనూ ఎక్కువవుతోందని ఇటీవల అధ్యయనాలు తెలిపాయి. అబ్బాయిలే ఎక్కువగా షాపింగ్‌ చేస్తారట. ఈ విషయాలన్నీ అతిపెద్ద ఆన్‌లైన్‌ ఫ్యాషన్‌ షాపింగ్‌ వెబ్‌సైట్‌లైన మింత్రా - జబాంగ్‌ సీఈవో అనంత్‌ నారాయణన్‌ చెప్పారు.

 వెబ్‌సైట్‌

వెబ్‌సైట్‌

55 శాతం అబ్బాయిలే ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేస్తూ ఉన్నారని తెలిపారు. ఇండియా టుడే యూత్‌ సమిట్‌ మైండ్‌ రాక్స్‌లో నారాయణన్‌ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు చెప్పారు. అ‍బ్బాయిలే ఎక్కువ ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేయడానికి కారణం, అమ్మాయిల కంటే ఎక్కువగా వారి వద్దే స్మార్ట్‌ఫోన్లు కలిగి ఉండటమని మింత్రా సీఈఓ అనంత్ నారాయణన్ పేర్కొన్నారు. షాపర్‌ పరంగా చూసుకుంటే, అమ్మాయిలు ఎక్కువగా తమ వెబ్‌సైట్‌ను సందర్శిస్తే వారి పరిమాణం పెరుగుతోంది.

మింత్రా సీఈవో

మింత్రా సీఈవో

అయినా అమ్మాయిల కంటే ఎక్కువగా అబ్బాయిలే షాపర్స్‌ను ఆశ్రయిస్తున్నట్టు తెలిసింది. గ్రామీణ, పట్టణ ప్రాంత దుకాణదారులకు ఎలాంటి తేడా లేదని, గ్రామీణ వినియోగదారులు కొనుగోలు చేసే ఉత్పత్తులు, పట్టణ వినియోగదారులు తీసుకునేవి సమానంగా ఉన్నాయని మింత్రా సీఈవో తెలిపారు.

లేటెస్ట్‌ ఫ్యాషన్‌ను

లేటెస్ట్‌ ఫ్యాషన్‌ను

మింత్రాలో 55 శాతం డిమాండ్‌ టాప్‌ 30 నగరాలను మించి వస్తుందని, మిగతా 45 శాతం టాప్‌ 30 నగరాల నుంచి వెల్లువెత్తుందని చెప్పారు. చాలా గ్రామీణ ప్రాంతాల్లో యాక్సస్‌ లేదు, ఒకవేళ యాక్సస్‌ కల్పిస్తే, పట్టణ వాసులు అనుసరించే ట్రెండ్‌నే గ్రామీణులు అనుసరిస్తారని పేర్కొన్నారు. గ్లోబల్‌ ట్రెండ్స్‌ భారత్‌కు చాలా వేగంగా విస్తరిస్తాయని, భారతీయులు సరసమైన లేటెస్ట్‌ ఫ్యాషన్‌ను ఎక్కువగా ఇష్టపడుతుంటారని చెప్పారు.

Read more about: online shopping
English summary

ఆడవారి కన్నా మగవారు ఫస్ట్ ఎందులోనో తెలుసా? | Boys doing More Online Shopping Than Girls

Everyone knows that girls love decorating their loved ones for shopping. But now the conditions are changing. But in recent years, the baby is getting worried about beauty.
Story first published: Monday, September 17, 2018, 11:28 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X