For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రజలలో రోజురోజుకి ఆసక్తి పడిపోతోంది! ఇంతకీ ఎందులో ఆసక్తి పడిపోతోందో తెలుసా?

By Sabari
|

వినియోగదారులకు ఆన్‌లైన్‌ మార్కెట్‌పై ఆసక్తి పడిపోతోంది. గత 12 నెలల్లో దాదాపుగా 5.4 కోట్ల మంది ఈ లావాదేవీల నుంచి బయటికి వచ్చేశారని గూగుల్‌, ఒమ్డి యర్‌ నెట్‌వర్క్‌లు సంయుక్తగా నిర్వహించిన ఒక రిపోర్టులో వెల్లడయ్యింది.

ఇ-కామర్స్‌కు

ఇ-కామర్స్‌కు

దీంతో భారత్‌లో ఇంటర్నెట్‌ చాలా వేగంగా విస్తరిస్తున్న ప్రస్తుత సమయంలో ఇ-కామర్స్‌కు భారీ డిమాండ్‌ ఉంటుందన్న అంచనాలు తలకిందులయ్యాయి. గతేడాది 5.4 కోట్ల‌ మంది ఒక్క సారి మాత్ర మే ఆన్‌లైన్‌ కొనుగోళ్లకు ఆసక్తి చూపారు.

వ్యాపార వర్గాలు

వ్యాపార వర్గాలు

మరోసారి ఈ వేదికల్లో ఎలాంటి కొనుగోళ్లు చేయడానికి ఆసక్తి చూపలేదు. దీంతో ఆన్‌లైన్‌ వ్యాపార వర్గాలు దాదాపుగా రూ.3.5 లక్షల కోట్లు (50 బిలియన్‌ డాలర్ల) వ్యాపారం కోల్పోయారని అంచనా.

ఆన్‌లైన్‌లో లావాదేవీలు

ఆన్‌లైన్‌లో లావాదేవీలు

భారత్‌లో గత కొన్ని సంవత్స రాలుగా ఇంటర్నెట్‌ వినియోగదారులు భారీగా పెరుగుతు న్నారు. ప్రతీ ఏడాది దాదాపుగా 4 కోట్ల మంది కొత్తగా నెట్‌ వినియోగంలోకి వస్తున్నారు. మొత్తంగా 39 కోట్ల ఇంటర్నెట్‌ వినియోగదారుల్లో 40 శాతం మంది ఎప్పుడో ఒక్కసారి ఆన్‌లైన్‌లో లావాదేవీలు చేస్తున్నారు

పట్టణ వసూలే

పట్టణ వసూలే

ఆన్‌లైన్‌ లావాదేవీల్లో 56 శాతం మంది పురుషులు నమోదైయ్యారని అంచనా. ఇందులో 60 శాతం మంది పట్టణ వసూలే. అందులోనూ 80 శాతం మంది 34 సంవత్సరాల లోపు వారే. 5.4 కోట్ల మంది ఇ-కామర్స్‌కు దూరం కాగా మరో 5 కోట్ల మంది క్రియాశీలక కొనుగోలుదారులు ఆన్‌లైన్‌లో కొనసాగుతున్నారు.

రిటైల్‌ మార్కె ట్‌లో

రిటైల్‌ మార్కె ట్‌లో

ఆన్‌లైన్‌ కొనుగోళ్లు తగ్గడానికి గల కారణాలను ఆ సంస్థలు ఈ నివేదికలో వెల్లడించాయి. ఆన్‌లైన్‌ ఉత్పత్తులపై నమ్మకం పడిపోవడం,అఫ్‌లైన్‌ లేదా రిటైల్‌ మార్కె ట్‌లో కొనుగోళ్లు అనుకూలంగా ఉండటం, రీఫండ్లు పొందండం సంక్లిష్టంగా మార‌డం వంటివి ప్ర‌ధాన కార‌ణాలుగా నిలుస్తున్నాయి.

Read more about: online shopping
English summary

ప్రజలలో రోజురోజుకి ఆసక్తి పడిపోతోంది! ఇంతకీ ఎందులో ఆసక్తి పడిపోతోందో తెలుసా? | Drastic Change in Online Shopping Now A Days

Customers are interested in online market. About 5.4 crore people have been out of the transactions in the last 12 months, according to a report jointly by Google and OMR Networks.
Story first published: Wednesday, August 22, 2018, 12:14 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X