For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కేరళ వరద ప్రాంతాలకు ట్రూజెట్ సహాయం ఏంటో తెలుసా.

భారతీయ ప్రాంతీయ ఎయిర్లైన్స్ అయిన ట్రూజెట్ వరద ఊబిలో చిక్కుకున్న కేరళకు మద్దతు ఇవ్వడానికి సహాయం చేస్తోంది. మూడు రోజుల పాటు వరద రిలీఫ్ పదార్ధాలను ఉచితంగా రవాణా.

|

హైదరాబాద్: భారతీయ ప్రాంతీయ ఎయిర్లైన్స్ అయిన ట్రూజెట్ వరద ఊబిలో చిక్కుకున్న కేరళకు మద్దతు ఇవ్వడానికి సహాయం చేస్తోంది. మూడు రోజుల పాటు వరద రిలీఫ్ పదార్ధాలను ఉచితంగా రవాణా చేయడం తో పాటు, చెన్నై మరియు హైదరాబాద్ కు ఉచితంగా వరదలలో ఇరుక్కున్న ప్రయాణీకులను కూడా ఎయిర్లైన్స్ తీసుకువెళ్లనుండి.

కేరళ వరద ప్రాంతాలకు ట్రూజెట్ సహాయం ఏంటో తెలుసా.

ఎన్నో ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు అత్యవసర మందులు, బట్టలు మరియు ఆహారాన్ని సేకరించేందుకు కృషి చేస్తున్నాయి. హైదరాబాద్, చెన్నైల నుండి కేరళ రాజధాని త్రివేండ్రం కు సేకరించిన రిలీఫ్ పదార్థాలు ఈ నెలలో 21, 22, 23 ఉచితంగా రవాణా చేయనున్నారని ట్రూజెట్ సీఈఓ విశాఖ్ మాన్సింగ్ చెప్పారు.

పైన పేర్కొన్న మూడు రోజులలో, తెలంగాణ ప్రభుత్వం నుండి సేకరించిన రిలీఫ్ పదార్థాలు తీసుకోని ట్రూజెట్ విమానము ఉదయం 5:30 గంటలకి చెన్నైకి మొదలవుతుంది. తరువాత, తమిళనాడు ప్రభుత్వం అందించిన రిలీఫ్ పదార్థాన్ని లోడ్ చేసిన తర్వాత ఆ విమానం త్రివేండ్రంకు చేరుతుంది.

ఈ వరద సహాయ పదార్థాలను కేరళ ప్రభుత్వ అధికారులకు అప్పగిస్తారు. త్రివేండ్రం నుండి తిరిగివచ్చేటప్పుడు,విమానంలో వరదలో చిక్కుకున్న ప్రయాణీకులను తీసుకువెళతారు మరియు కేరళ ప్రభుత్వం అందించిన ప్రయాణీకుల జాబితా ప్రకారం చెన్నై మరియు హైదరాబాద్ కు అత్యవసర పరిస్థితి ప్రయాణం లో భాగంగా ప్రయాణికులకు ఉచిత ప్రయాణం అందించనుంది అని సంస్థ తెలిపింది.

ఈ 3 రోజులు, 6 టన్నుల వరద రిలీఫ్ పదార్థం త్రివేండ్రంకు రవాణా చేయబడుతుందని, తిరిగి వచ్చేసరికి చెన్నై మరియు హైదరాబాద్కు 65 మంది ప్రయాణికులను తీసుకురానుంది విశోక్ మాన్సింగ్ చెప్పారు. తెలంగాణ, తమిళనాడు, మరియు కేరళ ప్రభుత్వాలతో ఈ ప్రయత్నం కోసం ట్రూజెట్ సన్నిహితంగా ఉంది.

Read more about: trujet
English summary

కేరళ వరద ప్రాంతాలకు ట్రూజెట్ సహాయం ఏంటో తెలుసా. | TruJet’s Helping Hand For Kerala Flood Victims

Hyderabad: TruJet, an Indian regional airline, is extending helping hand to support the flood-hit Kerala. Along with transporting the flood relief material free of cost for three days, the airlines are also to carry the passengers who are stuck in floods free of cost to Chennai and Hyderabad.
Story first published: Monday, August 20, 2018, 13:30 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X