ముత్తూట్.. మణప్పురంలో మీ బంగారం ఉందా? అసలు మేనేజర్లు మీ బంగారంతో ఎం చేస్తున్నారో తెలుసా?
ఆర్ధిక సమస్యల వలన మధ్య తరగతి ప్రజలు తాము కస్టపడి సంపాదించి ,దాచుకున్న బంగారాన్ని అత్యవసర పరిస్థుతులలో వడ్డీ వ్యాపారస్తుల దగ్గర తక్కటు పెట్టడం మనకు తెలిసిందే.

ఎంతవరకు నమ్మకం
ఐతే వడ్డీ వ్యాపారస్తులు కొంత మంది ఎక్కువ వడ్డీ వసూల్ చేస్తున్నారు అని అందరు ముత్తూట్ మరియు మణప్పురంలో బంగారం తాకట్టు పెడుతున్నారు. మరి ఇవి ఎంతవరకు నమ్మకం?

గుండెలో రైలు పరిగెడుతున్నాయి
తాజాగా జరిగిన కొన్ని ఘటనలు చూస్తే ముత్తూట్లో కానీ మణప్పురంలో కానీ బంగారు నగలు తాకట్టు పెట్టిన వారి గుండెలో రైలు పరిగెడుతున్నాయి. మరి ఆ సంఘటనలు ఏంటో చూద్దామా.

ఒక్కసారి వెళ్లి చూసుకోండి
ఐతే మీకో మాట ఇది విన్న వెంటనే ముత్తూట్లో కానీ మణప్పురంలో కానీ లేదా ఇతర ఎక్కడ ఉన్న కానీ మీ బంగారం ఉందొ లేదో ఒకసారి వెళ్లి చూసుకోండి. ఎందుకు అంటారా ఐతే ఇది చదవండి.

చిత్తూర్ జిల్లా వీ.కోట
చిత్తూర్ జిల్లా వీ.కోట మండలానికి సంబంధించిన కొంతమంది ముత్తూట్ ఫైనాన్స్ ఖాతాదారులు మీ బంగారాన్ని తాకట్టు పెట్టేసుకున్నారు. అంటే ప్రజల బంగారాన్ని అన్నమాట.

మేనేజర్
చిత్తూర్ జిల్లాలో వీ.కోట మండలంలో ముత్తూట్ ఫైనాన్స్ లో ప్రకాష్ అనే వ్యక్తి మేనేజర్ గా పని చేస్తున్నాడు. ముత్తూట్ ఫైనాన్స్ పై నమ్మకంతో ప్రజలు అక్కడ బంగారాన్ని తాకట్టు పెట్టారు.

రూ.40 లక్షలు విలువ
ఐతే ఇప్పుడు ఆ నగల స్థానంలో గిల్ట్ నగలు ఉన్నాయి అంట ఎందుకంటే ఒరిజినల్ నగలను ఎప్పుడో మాయం చేసేసాడు మేనేజర్ ప్రకాష్.దాదాపుగా లాకర్లో ఉన్న రూ.40 లక్షలు విలువ చేసే ఖాతాదారుల ఆభరణాలు ముత్తూట్ లాకర్ నుంచి ఎప్పుడో మాయం అయిపోయాయి.

పోలీసులకి దిమ్మతిరిగిపోయింది
ఈ విషయంపై అనుమానంతో ఖాతాదారులు కేసు పెట్టడంతో ప్రకాష్ ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రకాష్ చెప్పిన విషయాలకు పోలీసులకి దిమ్మతిరిగిపోయింది అంట.

క్రికెట్ బెట్టింగ్
ఈ డబ్బు అంత ఎం చేసావు అంటే క్రికెట్ బెట్టింగ్ కోసం ఖాతాదారుల బంగారాన్ని తానే దొంగలించా అని ఆ బంగారాన్ని కర్ణాటక రాష్ట్రంలో అమ్మేసినట్లు మేనేజర్ ప్రకాష్ అంగీకరించాడు.

పొంతన లేని సమాధానాలు
మొత్తం బంగారం రూ.40 లక్షలకు అమ్మేశాడు ప్రకాష్ ఐతే నగల కోసం వచ్చిన ఖాతాదారులు తమ నగలు ఎక్కడ గుర్తిస్తారో అని భయంతో గత కొద్దీ రోజులుగా పొంతన లేని సమాధానాలు చెబుతున్నాడు ప్రకాష్.

రాళ్లు పెట్టాడు
ఇక మరో విషయం ఏమిటి అంటే . కొంతమంది నగలకు అయితే గిల్ట్ నగలు కూడా చేయించలేదు అంట వారి నగల స్థానంలో రాళ్లు పెట్టాడు అంట ఈ మేనేజర్.

ఎవరోఒకరు సహాయం
లాకర్లో ఉన్న ఆభరణాలు తీయాలి అంటే ఒక్క మేనేజర్ మాత్రమే సాధ్యం కాదు అతనికి ఆ సంస్థలోని ఎవరోఒకరు సహాయం చేసింటారు అని మనం అనుమానించాల్సిన విషయం.

మణప్పురం
మోసగాళ్లు ఎక్కడన్నా ఉండచ్చు ఎందుకంటే ఒక వీ.కోట మండలంలోనే ఇలా ఉంది అంటే సరిపోదు అంది ఇంకో ఫైనాన్స్ కూడా ఉంది అదే మణప్పురం.

రాజమహేంద్రవరం
రాజమహేంద్రవరం నగరంలో కోరుకొండ రోడ్డులో రాజా థియేటర్ ఎదురుగా ఉన్న మణప్పురం గోల్డ్ లోన్ కార్యాలయంలో ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారం మాయం ఐపోతుంది అంట.

నకిలీ డాక్యూట్మెంట్లు
ఆ సంస్థలో పని చేసే వారే నకిలీ డాక్యూట్మెంట్లు సృష్టించి ఆ బంగారాన్ని అమ్మేసుకుంటున్న వ్యవహారం బయటకి వచ్చింది. దింతో ఒక ఖాతాదారుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసాడు.

తీగ లాగితే డొంకంతా
ఇంకేముంది తీగ లాగితే డొంకంతా కదిలింది ఇదిఅంతా చేస్తోంది ఆ వ్యవస్థ ఉద్యోగులే. రాజమహేంద్ర వరంకి చెందిన సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి 94 గ్రాముల బంగారాన్ని కోరుకొండ రోడ్డులో మణప్పురం గోల్డ్ లోన్లో తాకట్టు పెట్టి రుణం తీసుకున్నాడు.

దాదాపుగా 3 నెలలు అయింది
ఈ బంగారం తాకట్టు పెట్టి దాదాపుగా 3 నెలలు అయింది. తీరా నగలు విడిపించుకుందాం అని వెళ్ళితే మీ నగలు ఎప్పుడో విడిపించుకెళ్ళారు అని అతనికి సమాచారం ఇచ్చారు ఆ సంస్థలోని ఉద్యోగులు.

మేనేజర్ నీళ్లునమిలాడు.
ఐతే సుబ్రహ్మణ్యం చెప్పిన ప్రకారం తాను 3 నెలల తర్వాత ఇప్పుడే వస్తున్నాను అని తన నగలు ఎవరో తీసుకెళ్లడం ఏంటి అని ఎదురు ప్రశ్నించాడు. ఇక సుబ్రహ్మణ్యం ప్రశ్నల మీద ప్రశ్నలు వేయడంతో ఆ మేనేజర్ నీళ్లునమిలాడు.

వీళ్లకి చాల చిన్న పని
విషయం పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది ఇప్పుడు ఆ మేనేజర్ జైలులో ఉన్నాడు. మీ బంగారాన్ని గిల్ట్ నగలుగా మార్చి మీ నగల స్థానాలలో పెట్టడమో లేదా అసలు బంగారం మొత్తం మాయం చేసేయడం వీళ్లకి చాల చిన్న పని.

వెళ్లి చెక్ చేసుకోండి
కాబ్బటి ఈ సంస్థలో మీరు బంగారం పెట్టాలి అనుకుంటే కాస్త జాగ్రత్త వహించండి. ఇప్పటికే మీరు ఆ సంస్థలో మీరు బంగారం పెట్టి ఉంటె ఎందుకన్న మంచిది ఒక్కసారి వెళ్లి చెక్ చేసుకోండి.

సిబ్బంది బాధ్యత
అనుమానం వచ్చినపుడు మీ నగలను మీకు చూపించడం ప్రతి బ్యాంకు సిబ్బంది బాధ్యత అనుమానము వస్తే చెక్ చేసుకోవడంలో తప్పు లేదు. బ్యాంకు సిబ్బంది నగలు చూపించడానికి నిరాకరిస్తే మీరు డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేయవచ్చు.

అది మన కష్టం
కాబ్బటి మీ నగలు అక్కడ సేఫ్ అని అనుకోకుండా ఒక్కసారి వెళ్లి చెక్ చేసుకోండి. ఎందుకంటే అది మన కష్టం. వేరే వారి మీద నమ్మకంతో మన కష్టాన్ని అక్కడ పెడుతున్నాము. ఒక్కసారి వెళ్లి చూసుకోండి.