For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దేశంలో బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళు ఇన్ని కోట్లమంది ఉన్నారా?

జన్ ధన యోజన విజయవంతం అయినప్పటికీ, బ్యాంకు ఖాతా లేకుండా 19 కోట్ల మంది పెద్దలు ఉన్నారు, దీంతో ఇది ప్రపంచంలోని రెండవ అతిపెద్ద బ్యాంక్ కథలు లేని దేశంగా పరిగణించబడింది అని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది.

|

జన్ ధన యోజన విజయవంతం అయినప్పటికీ, బ్యాంకు ఖాతా లేకుండా 19 కోట్ల మంది పెద్దలు ఉన్నారు, దీంతో ఇది ప్రపంచంలోని రెండవ అతిపెద్ద బ్యాంక్ కథలు లేని దేశంగా పరిగణించబడింది అని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది.

దేశంలో బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళు ఇన్ని కోట్లమంది ఉన్నారా?

అంతేకాకుండా గత ఏడాది బ్యాంకు ఖాతాల సగం నిష్క్రియాత్మకమైనదిగా ఉన్నాయని బహుముఖ ఆర్థిక సంస్థ ఒక నివేదికలో పేర్కొన్నది. భారతీయ ప్రభుత్వం యొక్క ఆర్ధిక చేర్పు పథకాన్ని,జన్ ధన్ యోజన, 31 కోట్ల మంది భారతీయులు లాంఛనంగా బ్యాంకింగ్ వ్యవస్థ మార్చి 2018 నాటికి తీసుకొచ్చిందని అన్నారు.

కాని వాటిలో సగం వరకు ఎలాంటి లావాదేవీలు జరగలేదు. అటు 2011 నుంచి దేశంలో బ్యాంకు ఖాతాలు వినియోగిస్తున్న వయోజనుల సంఖ్య దాదాపు 80 శాతం వరకు పెరిగిందట.అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా బ్యాంకు ఖాతాలు లేని వారిలో భారత్‌లోనే 11 శాతంమంది ఉన్నారు. ఓవరాల్‌గా భారత్‌లో చూస్తే... 69 శాతం మంది ప్రజలు మాత్రమే బ్యాంక్ ఖాతాలు కలిగి ఉన్నారు. అంటే దాదాపు 3.8 బిలియన్ల మంది ప్రత్యక్ష, పరోక్షంగా బ్యాంకింగ్ సేవలను వినియోగిస్తున్నారు. 2014లో 62 శాతం, 2011లో 51 శాతం బ్యాంకు ఖాతాలను కలిగి ఉన్నారు. 2014 - 17 మధ్యకాలంలో అయితే దాదాపు 51.5 మిలియన్‌మంది కొత్తగా బ్యాంకు ఖాతాలు పొందారు.

ప్రపంచబ్యాంకు నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యధికంగా బ్యాంకు ఖాతాలు లేని దేశంగా చైనా మొదటి స్థానంలో ఉంది. చైనాలో దాదాపు 22.5 కోట్ల మందికి బ్యాంకు ఖాతాలు లేవు. ఆ తర్వాత భారత్‌లో 19 కోట్ల మందికి... పాకిస్థాన్‌లో 10 కోట్ల మందికి, ఇండోనేషియాలో 9.5 కోట్ల మందికి బ్యాంకు ఖాతాలు లేవు. బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ కార్డుల ద్వారా ఖాతాల ప్రాధాన్యాన్ని పెంచడానికి మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ప్రపంచబ్యాంక్ తెలిపింది.

ప్రభుత్వ విధానాలు, సాంకేతికత కారణంగా 2014 నుంచి దేశంలో బ్యాంకు ఖాతాలు కలిగిన వయోజనుల సంఖ్య రెట్టింపు అయ్యిందంటోంది. అయితే ఆ అకౌంట్లలో చాలా వరకు ఉపయోగించడం లేదంటోంది. అలాగే ఆర్థిక వ్యవస్థలో ప్రజలు నగదు లావాదేవీలు జరుపుకోవడానికి డిజిటల్ టెక్నాలజీ ఎంతగానో ఉపయోగకరంగా ఉందని... దీనివల్ల దక్షిణాసియాలో బ్యాంకింగ్ కార్యకలాపాలు 23 శాతం నుంచి 70 శాతానికి పెరిగాయంటోంది.

English summary

దేశంలో బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళు ఇన్ని కోట్లమంది ఉన్నారా? | 19 Crore Indian Adults Don't Have Bank Account: World Bank

India has 19 crore adults without a bank account despite the success of the ambitious Jan Dhan Yojana, making it the world's second largest unbanked population after that of China, the World Bank said today.
Story first published: Friday, April 20, 2018, 11:28 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X