For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కోడి గుడ్డు పగిలిపోయింది.. రూ.50 కే కోడి ఎక్కడో తెలుసా?

By Sabari
|

నెల రోజుల కిందట వరకు ఆశాజనకంగా ఉన్న పౌల్ట్రీ రంగం ఒక్కసారిగా కుదేలైంది. కోడి, కోడిగుడ్డు ధరలు అమాంతంగా పతనమవుతుండడంతో రైతాంగం దిక్కుతోచని పరిస్థితిలో ఉంది.

రూ. 50కి

రూ. 50కి

ఎన్నడూ లేని విధంగా కోడి (లేయర్‌) ధర ఇపుడు రూ. 50కి పడిపోయింది. రైతు కొనుగోలు చేసే కోడి పిల్ల ధర రూ. 36 కాగా, 75 వారా లు పెంచిన కోడి ధర రూ. 50లే ఉండడం గమనార్హం

మార్కెట్‌లో

మార్కెట్‌లో

ఇక ప్రస్తుతం కోడి గుడ్డుధర కూడా భారీగా పతనమైంది. నవంబర్‌ నెల నుంచి ఫిబ్రవరి నెల వరకు కోడి గుడ్డుకు భారీగా గిరాకీ పెరిగింది. ఒక సమయంలో బహిరంగ మార్కెట్‌లో గుడ్డు ధర రూ. 6పైనే పలికింది. రైతుకు కూడా గరిష్ఠంగా గుడ్డుకు రూ. 5లు ధర లభించింది.

ట్రేడర్స్‌

ట్రేడర్స్‌

కానీ, ఇపుడు పరిస్థితి పూర్తిగా తిరగబడింది. ప్రస్తుతం కోడిగుడ్డు ధర రూ. 2.80 లు కాగా రైతుకు ఇది కూడా లభించడం లేదు. ట్రేడర్స్‌ నుంచి వారికి రూ. 2.60పైసలే లభిస్తున్నాయి.

రైతులు వాపోతున్నారు

రైతులు వాపోతున్నారు

ఒకోసారి ధర కూడా చెప్పకుండానే ట్రేడర్లు తీసుకువెళుతున్నారని రైతులు వాపోతున్నారు. గట్టిగా అడిగితే వాటిని ఎక్కడ వదిలేస్తారోనని అందుకే వారిచ్చిన రేటు తీసుకోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేపర్‌లో వచ్చిన రేటుకు ఎవరూ కొనడం లేదని ట్రేడర్లు తమ మార్జిన్‌ పెట్టుకుని అంతకంటే తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారని చెబుతున్నారు

బ్రాయిలర్‌

బ్రాయిలర్‌

లేయర్‌ రైతుల పరిస్థితి ఇలా ఉంటే బ్రాయిలర్‌ రైతుల పరిస్థితి కూడా ఇంతే దారుణం గా ఉంది. బ్రాయిలర్‌ పిల్ల ధర రూ. 45 లు కాగా ఇపుడు కిలో రూ. 60లకు మించి పోవడం లేదు. నెలన్నర రోజులు బ్రాయిలర్‌ను పెంచితే 2 నుంచి 2.2 కిలోల బరువు పెరుగుతుంది. ఇందు కు రూ. 160ల వరకు ఖర్చవుతుంది.

 నష్టానికి

నష్టానికి

ఇలా బ్రాయిలర్‌ కోడికి రూ. 160లు ఖర్చుపెడితే ప్రస్తుతం ధర ప్రకారం రైతుకు రూ. 140లకు మించి ధర రావడం లేదు. ఈ విధంగా రైతు నష్టానికి అమ్ముకోవాల్సి వస్తోంది.

వందల రూ. కోట్ల నష్టం

వందల రూ. కోట్ల నష్టం

తెలంగాణలో పౌల్ట్రీ పరిశ్రమకు హైదరాబాద్‌ చుట్టు పక్కల ప్రాంతాలే కేంద్రాలు. రాష్ట్రం మొత్తం మీద రూ. 9 కోట్ల కోళ్లు ఉంటే ఇందులో సగానికిపైగా రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లోనే ఉన్నాయి. రాష్ట్రంలో లేయర్‌ కోళ్లు నాలుగున్న ర కోట్లు, బ్రాయిలర్‌ నాలుగున్నర కోట్లు ఉన్నాయని అం చనా.

రంగారెడ్డి జిల్లాలో

రంగారెడ్డి జిల్లాలో

ఇందులో రంగారెడ్డి జిల్లాలో బ్రాయిలర్‌ రెండున్నర కోట్ల వరకు ఉన్నాయి. రైతుకు కోడి గుడ్డు ధర రూ. 3-80లు పైన ఉంటేనే గిట్టుబాటు అవుతుంది. ప్రస్తుతం రూపాయు నష్టానికి అమ్ముకోవాల్సి వస్తుంది. అలాగే బ్రాయిలర్‌ కిలో రూ. 85 నుంచి రూ. 90 వరకు ఉంటేనే గిట్టుబాటు అవుతుంది

షాద్‌నగర్‌లో

షాద్‌నగర్‌లో

లేయర్‌ కోడి ధర కూడా రూ. 90లపైనే ఉంటేనే గిట్టుబాటు అవుతుంది. కానీ వీటికి సమీపంలో కూడా ప్రస్తుత ధరలు లేవు. పేపర్‌ రేటు రూ. 78లు ఉండగా రైతుకు మాత్రం రూ. 60లు మించి ఇవ్వ డం లేదు. గత రెండు రోజుల కిందట షాద్‌నగర్‌లో బ్రాయిలర్‌ కిలో రూ. 55 లకే కొనుగోలు చేసినట్లు రైతులు తెలిపారు.కంటెంట్ ఫ్రొం ఏ బి న్

Read more about: egg price andhra pradesh chicken
English summary

కోడి గుడ్డు పగిలిపోయింది.. రూ.50 కే కోడి ఎక్కడో తెలుసా? | Summer Hits Egg Prices, 13% Decline in 10 Days

The rising mercury has lead to continuous fall in wholesale egg prices in the city. The prices have dropped by 13% in 10 days.
Story first published: Thursday, April 5, 2018, 13:07 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X